BrahMos range: బ్రహ్మోస్‌తో పాకిస్తాన్ పని ఫినిష్ - ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమే - రాజ్‌నాథ్ హెచ్చరిక
Rajnath Singh: పాకిస్తాన్‌లోని ప్రతి మూలకు బ్రహ్మోస్ క్షిపణి వెళ్లగదలని రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమేనని హెచ్చరించారు.

Every inch in Pakistan BrahMos range: బ్రహ్మోస్ రేంజ్‌లో పాకిస్థాన్ లోని ప్రతి అంగుళం ఉటుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌కు బలమైన హెచ్చరిక జారీ చేశారు. పాకిస్థాన్ భూభాగంలోని ప్రతి అంగుళం ఇప్పుడు బ్రహ్మోస్ మిస్సైల్ రేంజ్‌లో ఉందని, మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమే అని అన్నారు. ఈ ఆపరేషన్ భారత్‌కు విజయం ఒక చిన్న ఘటన కాదు, అలవాటుగా మారిందని ఆయన పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని సరోజినీ నగర్‌లోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్‌లో తయారైన మొదటి బ్యాచ్ బ్రహ్మోస్ మిస్సైళ్లను రాజ్‌నాథ్ సింగ్ ఫ్లాగ్ ఆఫ్ చేశారు. మే 11న ప్రారంభమైన ఈ యూనిట్ మిస్సైల్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్ , ఫైనల్ క్వాలిటీ చెక్‌లకు ఆధునిక సదుపాయాలను కలిగి ఉంది. ఇది ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ (యూపీడీఐసీ)కు మైలురాయి . భారత్ రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి ఉపయోగపడుతుంది.
First batch of #BrahMos missiles produced at the BrahMos Aerospace unit in #Lucknow. pic.twitter.com/avd4zYd7by
— Dr. Ajayshree Singh Sambyal (@AjayshreeSamby3) October 18, 2025
బ్రహ్మోస్ కేవలం మిస్సైల్ కాదు, భారత్ వ్యూహాత్మక విశ్వాసానికి నిదర్శనం. సైన్యం నుంచి నేవీ, ఎయిర్ ఫోర్స్ వరకు ఇది మా రక్షణ దళాలకు కీలకంగా మారిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత్ రక్షణ సామర్థ్యాలు ఇప్పుడు బలంగా పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసిస్తూ, ఇది భారతీయులలో కొత్త విశ్వాసాన్ని నింపిందని, బ్రహ్మోస్ సమర్థతను ప్రపంచానికి నిరూపించిందని సింగ్ అన్నారు. "ఈ విశ్వాసాన్ని కాపాడుకోవడం మన సామూహిక బాధ్యత" అని పేర్కొన్నారు. "మొత్తం ప్రపంచం ఇప్పుడు భారత్ సామర్థ్యాన్ని గుర్తిస్తోంది. బ్రహ్మోస్ మన కలలను వాస్తవంగా మార్చగలమనే నమ్మకాన్ని బలపరిచింది" అని చెప్పారు.
#WATCH | Lucknow, UP | Defence Minister Rajnath Singh says, "The BrahMos team has signed contracts worth approximately RS 4,000 crore with two countries within just one month. In the coming years, we will see experts from other countries flock to Lucknow, making it a knowledge… pic.twitter.com/SOIA82uscd
— ANI (@ANI) October 18, 2025
బ్రహ్మోస్ మిస్సైల్ భారత్ స్వదేశీయంగా అభివృద్ధి చేసిన సూపర్‌సోనిక్ క్రూజ్ మిస్సైల్. సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లలో కీలక ఆయుధంగా మారింది. లక్నో యూనిట్‌లో తయారీ భారత్ రక్షణ తయారీలో పెరుగుతున్న విశ్వాసం , సామర్థ్యాన్ని సూచిస్తుంది. యూనిట్‌లో విజయవంతమైన టెస్టింగ్ తర్వాత, మిస్సైళ్లు భారత సైనిక దళాలకు సిద్ధంగా ఉంటాయి. రాజ్‌నాథ్ హెచ్చరికలు పాకిస్థాన్‌కు బలమైన సందేశం పంపుతున్నాయి.





















