అన్వేషించండి

Elon Musk on Twitter: గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది-ట్విటర్‌కు పది రోజులు బ్రేక్ ఇచ్చిన ఎలన్ మస్క్

ట్విటర్‌కు పది రోజుల పాటు దూరంగా ఉన్న ఎలన్ మస్క్ మళ్లీ యాక్టివ్‌ మోడ్‌లోకి వచ్చేశాడు. వరుసగా నాలుగు ట్వీట్‌లు చేశారు.

పది రోజుల తరవాత ట్విటర్‌లో యాక్టివ్ అయిన మస్క్

ఎలన్ మస్క్ మళ్లీ ట్విటర్‌లో యాక్టివ్ అయిపోయారు. దాదాపు పది రోజులుగా ఆయన నుంచి ఎలాంటి ట్వీట్ రాలేదు. ఇదేంటి మస్క్ ఇంత సైలెంట్‌గా ఉన్నాడు అని అనుకున్నారంతా. మొత్తానికి పది రోజుల తరవాత మళ్లీ ట్విటర్‌లో యాక్టివ్ అయ్యారు. దాదాపు 100 మిలియన్ల ఫాలోవర్లున్న మస్క్ జూన్21 తరవాత ఏ ట్వీట్ చేయలేదు. సాధారణంగా అయితే ఆయన రోజుకు కనీసం 5 ట్వీట్స్ చేస్తుంటారు. ఇన్నాళ్లకు వరుసగా నాలుగు ట్వీట్‌లతో ఫాలోవర్లను ఎంగేజ్ చేశారు. పోప్‌ను కలవటం చాలా ఆనందంగా ఉందంటూ పోప్‌తో దిగిన ఓ ఫోటోని ట్వీట్ చేశారు మస్క్. ఇందులో ఈ ఫోటోలో నలుగురు అబ్బాయిలు కూడా కనిపించారు. అయితే ఇందులో తన ట్రాన్స్‌జెండర్ కూతురు మాత్రం కనిపించలేదు. తన పేరు మార్చుకోవాలని చూస్తున్నానని, తండ్రి పేరు తనకు అక్కర్లేదని ఇటీవలే మస్క్ కూతురు సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

వరుసగా నాలుగు ట్వీట్‌లతో..

పోప్‌ను ఎప్పుడు, ఎందుకు కలిశారన్నది మాత్రం స్పష్టత లేదు. తరవాత మరో ట్వీట్ చేశాడు. వరల్డ్‌ వైడ్‌ యూట్యూబర్‌గా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఓ 23 ఏళ్లు యంగ్‌స్టర్ ఇటీవలే క్యాన్సర్‌తో మృతి చెందాడు. అతనికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశాడు మస్క్. జూన్‌ 21న స్పేస్‌ఎక్స్ సంస్థ గురించి, ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్‌ గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశాడు. గతంలోనూ ఎలన్ మస్క్ ఇలా ట్విటర్‌కు గ్యాప్ ఇచ్చాడు. 2020 జూన్‌లో తనకు కొడుకు పుట్టాక కొన్ని రోజులు ట్విటర్‌లో ఇన్‌యాక్టివ్ అయ్యాడు. కొన్ని రోజుల పాటు బ్రేక్ ఇస్తానని చెప్పి మళ్లీ నాలుగు రోజులకే యాక్టివ్ మోడ్‌లోకి వచ్చేశాడు. కానీ  ఈసారి మాత్రం ఆయన ఎందుకు బ్రేక్ తీసుకున్నాడని చెప్పలేదు.

 ట్విటర్ నుంచి వెళ్లిపోతానంటూ బెదిరింపులు..

ఏప్రిల్‌లోనే ట్విటర్‌ను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించి చాలా హడావుడి చేశాడు. అప్పటి నుంచి ఈ డీల్‌కి సంబంధించి అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో ట్విటర్‌ను తన అధీనంలోకి తెచ్చుకునేందుకు 44 బిలియన్‌ డాలర్లు చెల్లించాడు. కంపెనీలో ఒక్కో షేర్‌ కోసం 54 డాలర్ల మేర చెల్లించాడు. అయితే గత నెల ట్విటర్‌ నుంచి వెళ్లిపోతానంటూ మస్క్‌ కాస్త హడావుడి చేశాడు. కంపెనీ అగ్రిమెంట్‌కు అనుగుణంగా నడుచుకోవటం లేదని, ఫేక్‌ అకౌంట్స్‌ సంబంధించిన డేటాను ఇవ్వటం లేదని మండిపడ్డాడు. ఇప్పటికీ ఆ గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ట్విటర్ బోర్డ్‌ మాత్రం మస్క్‌తో కుదుర్చుకున్న అగ్రిమెంట్‌ను ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నట్టు ప్రకటించింది. కానీ ఈ విషయంలో నిత్యం ఏదో ఓ వార్త బయటకు వస్తూనే ఉంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget