Election Commission Update: ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు ఈసీ కీలక నిర్ణయం... అభ్యర్థుల వ్యయ పరిమితి పెంచుతూ ఉత్తర్వులు జారీ
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయ పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు ఎన్నికల వ్యయ పరిమితిని భారత ఎన్నికల సంఘం సవరించింది. ఈ వ్యయపరిమితి పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. సవరించిన పరిమితులు అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలకు 2014లో ఉన్న రూ.70 లక్షలు, రూ.54 లక్షల నుంచి రూ.95 లక్షలు, రూ.75 లక్షలకు పెంచింది. 2014లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న వ్యయపరిమితి రూ.28 లక్షలు, రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలు, రూ28 లక్షలకు పెంచింది. వీటిని ఎన్నికల ప్రవర్తన (సవరణ) నిబంధనలు, 2022 అని పిలువవచ్చని ఈసీ పేర్కొంది.
The Election Commission of India enhances the existing election expenditure limit for candidates in Parliamentary and Assembly constituencies. These limits will be applicable in all upcoming elections. pic.twitter.com/TGbTaJBs7N
— ANI (@ANI) January 6, 2022
భారత ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థులు చేసే వ్యయ పరిమితిని పెంచుతూ ప్రకటన జారీ చేసింది. తాజా నిర్ణయంతో పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ రూ.70లక్షల లిమిట్ ను రూ.95 లక్షలకు, రూ.54 లక్షల లిమిట్ ను రూ.75లక్షలకు పెంచింది. అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చును రూ.28 లక్షల నుంచి రూ.40 లక్షలు, రూ.20 లక్షల లిమిట్ ను రూ.28 లక్షలకు పెంచుతూ ప్రకటన జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వచ్చే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నుంచి అమల్లోకి రానున్నాయి.
Also Read: ఆ సీఎంకు మళ్లీ కరోనా పాజిటివ్.. ఒమిక్రాన్‌ను లైట్ తీసుకోవద్దు ప్లీజ్ అంటూ ట్వీట్
త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు
మరి కొన్ని రోజుల్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ తేదీలను జనవరి10-13 మధ్య కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలను తూర్పు యూపీ నుంచి ప్రారంభించాలని బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. 2017లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను ఏడు దశల్లో నిర్వహించారు. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. త్వరలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో ఎన్నికల సంఘానికి ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాములాంటిదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Also Read: 'ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చా.. మీ సీఎంకు థ్యాంక్స్'.. పంజాబ్ అధికారులతో ప్రధాని