Ashok Gehlot Covid Positive: ఆ సీఎంకు మళ్లీ కరోనా పాజిటివ్.. ఒమిక్రాన్‌ను లైట్ తీసుకోవద్దు ప్లీజ్ అంటూ ట్వీట్
రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌కు మరోసారి కరోనా సోకింది. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన ట్వీట్ చేశారు.
![Ashok Gehlot Covid Positive: ఆ సీఎంకు మళ్లీ కరోనా పాజిటివ్.. ఒమిక్రాన్‌ను లైట్ తీసుకోవద్దు ప్లీజ్ అంటూ ట్వీట్ Ashok Gehlot tests covid positive, informs on twitter Ashok Gehlot Covid Positive: ఆ సీఎంకు మళ్లీ కరోనా పాజిటివ్.. ఒమిక్రాన్‌ను లైట్ తీసుకోవద్దు ప్లీజ్ అంటూ ట్వీట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/31/bd8183745c27939455459970d89e65da_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ మరోసారి కరోనా బారిన పడ్డారు. అయితే తనకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని గహ్లోత్ తెలిపారు. 70 ఏళ్ల గహ్లోత్ ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు.
తనను కలిసిన వారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సీఎం కోరారు. ఇటీవలే గహ్లోత్ కుమారుడు వైభవ్ గహ్లోత్ కూడా కరోనా బారిన పడ్డారు.
This evening I got myself tested for Covid and was found positive. My symptoms are very light and there is no other problem. All those who came into contact with me today, I request them to isolate themselves and undergo Covid-Test.
— Ashok Gehlot (@ashokgehlot51) January 6, 2022
आमजन में ऐसी धारणा है कि कोरोना का ओमिक्रोन वैरिएंट घातक नहीं है इसलिए लोग लापरवाही बरत रहे हैं। विशेषज्ञों की राय है कि ओमिक्रोन से ठीक होने के बाद पोस्ट कोविड समस्याएं पूर्व के वैरिएंट्स जितनी ही गंभीर हो सकती हैं।
— Ashok Gehlot (@ashokgehlot51) January 6, 2022
రాజస్థాన్‌లో బుధవారం కొత్తగా 1,883 కరోనా కేసులు నమోదుకాగా ఇద్దరు మృతి చెందారు. ఒమిక్రాన్ సోకి ఒక వ్యక్తి మరణించాడు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు జనవరి 17 వరకు మూసివేస్తూ రాష్ట్రం నిర్ణయం తీసుకుంది. అయితే 9, 10వ తరగతి విద్యార్థులకు మాత్రం తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయ్యాల్లో 50 శాతం సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చింది.
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కూడా ఈ వారం మొదట్లో కరోనా బారిన పడ్డారు. కేజ్రివాల్‌కు కూడా స్వల్ప లక్షణాలు ఉన్నాయి.
Also Read: Covid Cases: టాప్ గేరులో కరోనా వ్యాప్తి.. ఒక్కరోజులో ఏకంగా 90 వేల కేసులు.. బీ అలర్ట్!
Also Read: PM Security Lapse: మోదీ- రాష్ట్రపతి భేటీ.. పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై తీవ్ర ఆందోళన
Also Read: PM Modi Update: 'ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చా.. మీ సీఎంకు థ్యాంక్స్'.. పంజాబ్ అధికారులతో ప్రధాని
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)