RPF Police Save Life: రైలు ఈడ్చుకెళ్తున్నా వ్యక్తి ప్రాణాల్ని కాపాడిన రైల్వే పోలీసులు
పొరపాటున రైలు నుంచి జారి పడిన వ్యక్తిని కాపాడి హీరో అయ్యాడు రైల్వే పోలీసు. క్షణాల్లో మెరుపు వేగంతో స్పందించి నిండు జీవితాన్ని రక్షించిన ఆయనపై ప్రశంసలు జల్లు కురుస్తోంది.
కళ్ల ముందు ఏదైనా అనుకోని ఆపద జరిగితే కొందరు కచ్చితంగా స్పందిస్తారు. మరికొందరు చూసి చూడనట్లుగా వెళ్లిపోతారు. అదే ప్రమాదకరమైన సంఘటన అయితే మాత్రం రెప్పపాటులో రియాక్ట్ అవ్వాలి లేకుంటే అవతలి వాళ్ల ప్రాణాలు పోవచ్చు. అలా స్పందించన వాళ్లే కొన్నిసార్లు హీరో అవుతుంటారు. వార్తల్లో నిలుస్తుంటారు. ఈ కేటగిరికి చెందిన వ్యక్తే ఆ రైల్వే పోలీసులు
ప్రయాణం హాడావుడిలో ఉండి చాలా మంది వచ్చే ప్రమాదాన్ని పట్టించుకోరు. అలా ప్రమాదాన్ని పట్టించుకోకుండా ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. రైలు ఎక్కబోతూ ప్లాట్‌ఫామ్‌కు రైలుకు మధ్యలో చిక్కుకున్నాడు. దీన్ని చూసిన రైల్వే ఇన్‌స్పెక్టర్ రామారావు మెరుపు వేగంతో స్పందించారు. ప్రమాదంలో ఉన్న వ్యక్తిని రక్షించాడు.
Also Read: మేడారం వెళ్లొచ్చిన భార్యాభర్తలు, ఇంటికి వచ్చాక ఇద్దరూ మృతి - ఏం జరిగిందంటే
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ టౌన్‌రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ సంఘటన వైరల్‌గా మారింది. రైలు కింద పడిపోతున్న ప్రయాణికుడి ప్రాణాలు కాపాడి రియల్ హీరోగా నిలిచాడు రామారావు.
చిత్తూరు జిల్లా తిరుపతి వెళ్లే రేణిగుంట ఎక్స్‌ప్రెస్ శుక్రవారం కాకినాడ రైల్వే స్టేషన్ చేరుకుంది. టైమ్ కావడంతో ఎక్స్‌ప్రెస్ రైలు ప్లాట్ ఫామ్ నుంచి నెమ్మదిగా కదులుతోంది. అంతలో రమేష్ అనే ప్రయాణికుడు రైలును ఎలాగైనా అందుకోవాలని ప్రయత్నించారు. దాంతో అనుకోకుండా పట్టుతప్పిపోయిన ప్రయాణికుడు రైలు పట్టాలు, ప్లాట్ ఫాంకు మధ్యలో చిక్కుకుపోయాడు.
రైలు అతడ్ని ఈడ్చుకెళ్తుండగా.. గస్తీలో ఉన్న టౌన్ రైల్వేస్టేషన్ ఇన్‌స్పెక్టర్ రామారావు సరిగ్గా అదే సమయంలో రెండో నెంబర్ ప్లామ్ ఫాంపై ఉన్నారు. ఆయనతోపాటు కానిస్టేబుల్ జగదీశ్ పరుగున వెళ్లి ప్రయాణికుడ్ని రైలు కింద పడిపోకుండా పట్టుకున్నారు.
అదే సమయంలో రామారావు సమయస్ఫూర్తి ప్రదర్శించారు. ఓ వైపు రైలు కింద పడిపోతున్న వ్యక్తికి రక్షిస్తూనే మరోవైపు చైన్ లాగి రైలును ఆపాలంటూ గట్టిగా అరిచారు. ఇది విన్న రైల్లోని ప్రయాణికులు చైన్ లాగడంతో రైలు ఆగిపోగానే, ప్రయాణికుడు రమేష్‌ను సురక్షితంగా పట్టాల నుంచి పైకి లాగారు.
కష్ట సమయంలో ప్రాణాలకు తెగించి మరి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులపై తోటి ప్రయాణికులు, నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపింంచారు.
Also Read: పులివెందులలో సీబీఐ డీఐజీ - వచ్చే వారం కీలక అరెస్టులు ఉంటాయా ?
Also Read: మేడారం వెళ్లే దారిలో ఘోర ప్రమాదం, ఐదుగురు దుర్మరణం