అన్వేషించండి

Khammam: మేడారం వెళ్లొచ్చిన భార్యాభర్తలు, ఇంటికి వచ్చాక ఇద్దరూ మృతి - ఏం జరిగిందంటే

Khammam News: వన దేవతలను దర్శించుకునేందుకు మేడారం వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చిన రోజే భార్యాభర్తలిద్దరూ కాల్వలో పడి మృత్యువాత పడ్డారు.

వన దేవతలను దర్శించుకునేందుకు మేడారం వెళ్లారు.. దర్శనం సాపీగా సాగడంతో పిల్లాపాపలతో ఆ జంట ఇంటికి చేరింది. దైవదర్శానికి వెళ్లడం వల్ల రెండు మూడు రోజులుగా ఇంట్లో ఉతికే బట్టలు ఎక్కువగా ఉండటంతో భార్యభర్తలు ఇద్దరు వాటిని ఉతికేందుకు కాల్వకు వెళ్లారు. భర్త కళ్లముందే భార్య కాలు జారి కాల్వలో కొట్టుకుపోతుండటంతో అది చూసిన భర్త ఆమెను కాపాడేందుకు కాల్వలోకి దిగాడు. భార్యను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు కాల్వలో పడి మృత్యువాత పడ్డారు. భార్యను కాపాడేందుకు భర్త కాల్వలోకి దిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం ఆరెకొడుకు గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి.

ఆరెకొడుకు గ్రామానికి చెందిన ఆరెంపుల పరుశురాం తాపీ మెస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య నందని. వీరికి సుమశ్రీ, యశ్వంత్‌ అనే పిల్లలు ఉన్నారు. ఈ నెల 15న మేడారం వెళ్లి తిరిగి 17న ఇంటికి చేరుకున్నారు. రెండు రోజుల పాటు మేడారం వెళ్లడం, ఇంట్లో ఉతికే బట్టలు ఎక్కువగా ఉండటంతో కూతురు సుమశ్రీని తీసుకుని దంపతులు ఇద్దరు ముత్తగూడెం, పల్లెగూడెం గ్రామాల మద్యలో ఉన్న సాగర్‌ కాల్వకు వెళ్లారు. కూతురిని కాల్వ గట్టుపై కూర్చోబెట్టిన దంపతులు బట్టలు ఉతకడం కోసం కాల్వలోకి దిగారు. బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు నందిని కాలు జారి కాల్వలో పడిపోయింది.

ఈ సంఘటన చూసిన పరశురాం ఆమెను కాపాడబోయి కాల్వలోకి దూకాడు. పరుశురామ్‌కు ఈత వచ్చినప్పటికీ నందిని కాపాడే ప్రయత్నంలో ఆమె భర్త మెడ పట్టుకోవడంతో ఇద్దరు కాల్వలో కొట్టుకుపోయారు. ఇది చూసిన కూతురు సుమశ్రీ ఏడుస్తుండటంతో అటు వెళుతున్న వాహనదారులు వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించి మృత దేహాల కోసం గాలింపు చేపట్టారు. కాగా పల్లెగూడెం లాకుల వద్ద నందిని మృతదేహం లభించగా పరశురామ్‌ మృతదేహం ఇంకా లభించలేదు. పరుశురామ్‌ మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

అప్పటి వరకు సంతోషంగా ఉన్న కుటుంబంలో విషాదం..
తమ కోరికలు తీర్చే వనదేవతలను దర్శించుకునేందుకు మేడారం వెళ్లి మూడు రోజుల పాటు పిల్లలతో సరదాగా గడిపిన పరశురామ్‌ దంపతులు కాల్వలో పడి మృతి చెందడంతో ఆరెకొడుకు గ్రామంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు మృతి చెందడంతో అనాథలైన ఇద్దరు పిల్లలు వారి కోసం ఎదురు చూడటం గ్రామస్తులను కంటతడిపెట్టిస్తుంది. తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులు అనాథలు కావడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget