Mulugu: మేడారం వెళ్లే దారిలో ఘోర ప్రమాదం, ఐదుగురు దుర్మరణం
జాతర మొదలైన గత మూడు రోజుల నుంచి భక్తుల వాహనాలతో రోడ్డు మరింత రద్దీగా మారింది. ఈ నేపథ్యంలో చిన్నచిన్న ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి.
ములుగులో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ములుగు శివారులోని గట్టమ్మ ఆలయం వద్ద ఆర్టీసీ బస్సు, కారు ఒకదాని నొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వరంగల్ వైపు నుంచి మేడారం వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి కావడంతో గత నెల రోజులుగా ఈ మార్గం నిత్యం రద్దీగా ఉంటోంది. గట్టమ్మ ఆలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి గల ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
జాతర మొదలైన గత మూడు రోజుల నుంచి భక్తుల వాహనాలతో రోడ్డు మరింత రద్దీగా మారింది. ఈ నేపథ్యంలో చిన్నచిన్న ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి. కానీ, ఈ స్థాయిలో ప్రాణనష్టం జరగడం ఇదే తొలిసారి. కాగా, ఈ దుర్ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ములుగు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: Hyderabad: కస్తూర్బా ట్రస్టు నుంచి 14 మంది అమ్మాయిల పరార్, పటిష్ఠ భద్రత నడుమ మాస్టర్ ప్లాన్!
శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం జాతీయ రహదారి పై తెల్లవారు జామున ఒరిస్సా నుండి వస్తున్న టూరిజం బస్సు ఆగివున్న లారీనీ బలంగా గుద్దడంతో పలువురికి తీవ్రగాయాలు కాగా కొంతమంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. జే.ఆర్.పురం ఎస్సై రాజేశ్ తెలిపిన సమాచారం ప్రకారం ఒరిస్సానుండి బస్సులో సుమారు నలభై ఏడు మందివరకు కేరళ, తమిళనాడుకు వెళుతున్నట్లు తెలిపారు. తెల్లవారు జామున పైడిభీమవరం జాతీయ రహదారి బస్సు డ్రవర్ నిద్ర మత్తులో ఆగివున్న లారీని బలంగా గుద్దడంతో ప్రమాదం సంభవించి ఉండవచ్చని తెలిపారు. గాయపడ్డ 33 మందిని 108 హైవే అంబులెన్స్ లలో శ్రీకాకుళం రిమ్స్ కి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నదని వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారని మిగిలిన క్షతగాత్రులకు సంఘటన స్థలం వద్ద ప్రథమ చికిత్స అందించారు. స్థానికుల సమాచారం ప్రకారం జే.ఆర్.పురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
Also Read: KTR In Sircilla: సరిగ్గా 8 ఏళ్ల కిందట ఏం జరిగింది? అలా మాట్లాడితే పుట్టగతులుండవు: మంత్రి కేటీఆర్