Drugs Seized in Gujarat: నడి సముద్రంలో హెరాయిన్‌తో దొరికిన పడవ, కోస్ట్ గార్డ్ ఆపరేషన్ సక్సెస్
Drugs Seized in Gujarat: గుజరాత్‌లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చేపట్టిన ఆపరేషన్‌లో డ్రగ్స్ ట్రాఫికింగ్‌ను అడ్డుకున్నారు.
Drugs Seized in Gujarat:
ఆరుగురు అరెస్ట్..
గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (Anti Terrorist Squad), ఇండియన్ కోస్ట్ గార్డ్‌తో కలిసి ఓ కీలక ఆపరేషన్ చేపట్టింది. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఓ బోట్‌లో నుంచి రూ. 200 కోట్ల విలువైన 40 కిలోల హెరాయిన్‌ను సీజ్ చేసింది. అరేబియన్ సముద్ర మధ్యలో ఈ పడవను స్వాధీనం చేసుకున్నారు. ఈ పడవలో ఉన్న ఆరుగురు పాకిస్థానీలను అరెస్ట్ చేశారు. సముద్రం మధ్యలో ఈ ఫిషింగ్ బోట్‌పై దాడి చేసిన ఇండియన్ కోస్ట్ గార్డ్, ఏటీస్ బృందాలు...కచ్ జిల్లాలోని జకావ్ హార్బర్ వద్ద గుర్తించారు. గుజరాత్‌లో అన్‌లోడ్ చేసి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పంజాబ్‌కు తరలించారని ప్లాన్ వేసుకున్నారు నిందితులు. ఇప్పుడే కాదు.
In joint operation, Indian Coast Guard & Gujarat ATS apprehended a Pakistani boat 6 miles inside Indian waters with 40 kgs of drugs valued at Rs 200 cr. Two fast attack boats of ICG caught Pakistani boat 33 nautical miles off Jakhau coast in Gujarat: ICG officials
— ANI (@ANI) September 14, 2022
గతంలోనూ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, కోస్ట్ గార్డ్ బృందాలు కలిసి డ్రగ్ స్మగ్లింగ్‌ను అడ్డుకున్నారు. భారీ మొత్తంలో డ్రగ్స్‌ను సీజ్ చేశారు. నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జులైలో...75.3 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.376.5 కోట్లు. ఫ్యాబ్రిక్ రోల్స్‌లో హెరాయిన్‌ను దాచి పెట్టి గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు ప్రయత్నించారు నిందితులు. యూఏఈ నుంచి వచ్చిన హెరాయిన్‌ను...పంజాబ్‌కు తరలించాలని నిందితులు ప్లాన్ చేసినట్టు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్ నుంచి Directorate of Revenue Intelligence (DRI) కోట్ల రూపాయల డ్రగ్స్‌ను సీజ్ చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో దాదాపు రూ.21,000కోట్ల విలువైన 3 వేల కిలోల హెరాయిన్‌ను పట్టుకున్నారు. ఇక ఈ ఏడాది మేలో 56 కిలోలు, అంతకు ముందు ఏప్రిల్‌లో 205 కిలోల హెరాయిన్ సీజ్ చేశారు.
జీరో టాలరెన్స్..
ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమక్షంలో దాదాపు 30 వేల కిలోల డ్రగ్స్‌ను నాశనం చేసింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో-NCB.దాదాపు నాలుగు చోట్ల దొరికిన ఈ డ్రగ్స్‌ను సీజ్ చేశారు.హోం మంత్రి అమిత్‌షా వీడియో కాన్ఫరెన్స్‌లో ఉండగా, NCB అధికారులు ఆ డ్రగ్స్‌ను ధ్వంసం చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఎన్‌సీబీ ఓ లక్ష్యం పెట్టుకుంది. దేశవ్యాప్తంగా మొత్తం 75 వేల
కిలోల డ్రగ్స్‌ను డిస్పోస్ చేయాలని నిర్దేశించుకుంది. అందులో భాగంగానే...30 వేల కిలోల డ్రగ్స్‌ను డిస్పోస్ చేశారు. ఛండీగఢ్‌లోని డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ నేషనల్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు అమిత్ షా. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. "డ్రగ్ ట్రాఫికింగ్ విషయంలో జీరో టాలరెన్స్ తప్పదు" అని స్పష్టం చేశారు. "డ్రగ్ ట్రాఫికింగ్ సమాజానికి ప్రమాదకరం. సుసంపన్నమైన దేశాలేవీ దీన్ని సహించకూడదు. ఈ ట్రాఫికింగ్‌ను అరికట్టి మన దేశ యువతను కాపాడుకోవాలి" అని అన్నారు. డ్రగ్స్ విక్రయించటం ద్వారా వచ్చిన డబ్బులతో దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక, భారత్‌లో డ్రగ్స్ ట్రాఫికింగ్‌పై జీరో టాలరెన్స్ పాలసీ అనుసరిస్తున్నామని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థపైన, జాతీయ భద్రతపైనా డ్రగ్స్..ప్రతికూల ప్రభావం చూపుతాయని చెప్పారు.
Also Read: Copper Bottles: రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీరు తాగితే ఈ సమస్యలు అధిగమించవచ్చు
Also Read: GOVT WARNING: స్మార్ట్ ఫోన్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం వార్నింగ్, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన!