(Source: ECI/ABP News/ABP Majha)
Droupadi Murmu President of India: రాష్ట్రపతికి శాలరీ ఎంతిస్తారు? ఆమె ఏ కార్‌లో ప్రయాణిస్తారు? ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
Droupadi Murmu President of India: దేశంలోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తికి ఉన్నతమైన గౌరవం లభిస్తుంది. వేతనం నుంచి వారికి అందించే బెనిఫిట్స్ వరకూ అన్నీ భారీగానే ఉంటాయి.
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. గిరిజన వర్గానికి చెందిన తొలి రాష్ట్రపతిగా ఆమె రికార్డు సృష్టించారు. ప్రతిభా పాటిల్ తరవాత రాష్ట్రపతిగా ఎన్నికైన రెండో మహిళగా నిలిచారు. దేశంలోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తికి ప్రభుత్వం తరపున ఇచ్చే గౌరవాలు, లాంఛనాలు అదే ఉన్నతంగా ఉంటాయి. ఆమెకు ఎంత జీతం ఇస్తారు..? ఆమె ఏ కార్‌లో వెళ్తారు...? అసలు రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తి లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుంది..? ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
రాష్ట్రపతికి కావాల్సిన కనీస అర్హతలివే..
1. భారత రాజ్యాంగం ప్రకారం..రాష్ట్రపతిగా ఎన్నికయ్యే వ్యక్తి కచ్చితంగా భారత పౌరుడై ఉండాలి.
2. 35 ఏళ్లు నిండితే గానీ రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశం ఉండదు.
3. లోక్‌సభ ఎంపీగా ఎన్నికై ఉండాలి.
రాష్ట్రపతికి జీతమెంతిస్తారో తెలుసా?
రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తికి నెలకు రూ.5 లక్షల వేతనం అందిస్తారు. 2018లో రాష్ట్రపతి జీతం రూ.1.5లక్షలుగా ఉండగా, తరవాత దాన్ని రూ.5 లక్షలకు పెంచారు.
ఎక్కడ ఉంటారు..?
రాష్ట్రపతి భవన్...రాష్ట్రపతి అధికారిక నివాసం. ఇందులో మొత్తం 340 గదులుంటాయి. రెసిప్షన్ హాల్స్, గెస్ట్ రూమ్స్, ఆఫీసులు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు ప్రెసిడెంట్ ఎస్టేట్ ఉంటుంది. ఇందులో పెద్ద పెద్ద గార్డెన్‌లు, ఓపెన్ స్పేసెస్, బాడీగార్డ్స్, సిబ్బంది ఇళ్లు ఉంటాయి.
ఎలాంటి కార్‌లో ప్రయాణిస్తారు..?
రాష్ట్రపతి ప్రీమియమ్ కార్లలోనే ప్రయాణిస్తారు. సెక్యూరిటీ సిస్టమ్‌తో కూడిన బుల్లెట్, షాక్‌ప్రూఫ్ కార్‌ను అందిస్తారు. దానికి లైసెన్స్ ప్లేట్ ఉండదు. గత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మెర్సిడెస్ మేబాచ్ S600 పుల్‌మన్ గార్డ్‌లో ప్రయాణించేవారు. ఈ కార్ బులెట్స్‌ని, బాంబు దాడులను తట్టుకోగలదు.
భద్రత ఎలా ఉంటుందంటే..?
భారత సాయుధ బలగాలకు చెందిన సైనికులే రాష్ట్రపతికి బాడీగార్డ్‌లుగా ఉంటారు. త్రివిధ దళాలకు చెందిన సైనికులు రక్షణ కల్పిస్తారు.
రిటైర్ అయ్యాక వచ్చే బెనిఫిట్స్ ఇవే..
రాష్ట్రపతిగా రిటైర్ అయిన వారికి ఏడాదికి రూ.1.5 లక్షల పెన్షన్ అందుతుంది. ప్రెసిడెంట్ జీవితభాగస్వామికి నెలకు రూ.30,000 పెన్షన్ ఇస్తారు. ఎలాంటి అద్దె చెల్లించకుండానే పెద్ద బంగ్లాలో నివసించేందుకు అవకాశముంటుది. ఐదుగురు ఉద్యోగులను నియమించుకునే వెసులుబాటు ఉంటుంది.
వెకేషన్‌కి వెళ్లినప్పుడు ఎక్కడ ఉంటారు..?
దక్షిణాదిన ఓ రీట్రీట్ బిల్డింగ్, ఉత్తరాన ఓ రీట్రీట్ బిల్డింగ్ అందుబాటులో ఉంటాయి. దక్షిణ భారత్‌లో హైదరాబాద్‌లోని బొల్లారంలో రాష్ట్రపతి నిలయం ఉంది. ఉత్తరాదిన సిమ్లాలోని మశోబ్రాలో రీట్రీట్ బిల్డింగ్ ఉంటుంది.
Also Read: NTR Jr : బ్లాక్ బస్టర్ కొట్టేశామంతే - ఆనందంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్