luxury cars Smuggling: లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌లో కేటీఆర్‌పై బండి సంజయ్ ఆరోపణలు- కేరళలో దుల్కర్, ఫృధ్వీరాజ్ ఇళ్లలోనూ డీఆర్ఐ సోదాలు !
Car Smuggling: లగ్జరీ కార్లను స్మగ్లింగ్ చేసి పన్ను ఎగ్గొడుతున్న ముఠాలపై డీఆర్ఐ, కస్టమ్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కేటీఆర్ వాడుతున్న కారు అదేనని బండి సంజయ్ ఆరోపించారు.

Luxury Car Smuggling: మలయాళ సినిమా స్టార్ దుల్కర్ సల్మాన్ ఇంట్లో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. లగ్జరీ వెహికల్ స్మగ్లింగ్ కేసులో భాగంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. భూటాన్ ద్వారా అక్రమంగా లగ్జరీ కార్లను ఇంపోర్ట్ చేసి, టాక్స్ ఎగ్గొట్టే స్మగ్లింగ్ రాకెట్‌కు సంబంధించిన కేసు . దుల్కర్ సల్మాన్ మాత్రమే కాకుండా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి మలయాళ స్టార్ల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు.
The Customs and Central Excise team is conducting searches at #DulquerSalmaan's home in Kochi and #PrithvirajSukumaran's in Thevara as part of Operation Numkoor, investigating a scheme involving the import of Bhutan-registered vehicles to India for tax evasion. pic.twitter.com/6tlLoOiuVC
— Southwood (@Southwoodoffl) September 23, 2025
కస్టమ్స్ ప్రివెంటివ్ వింగ్‌లోని అధికారులు 'ఆపరేషన్ నుమ్ఖోర్' పేరుతో కేరళలో 30కి పైగా ప్లేసుల్లో దాడులు చేశారు. నుమ్ఖోర్ అంటే భూటాని భాషలో వాహనం అని అర్థం. ఈ రాకెట్‌లో భూటాన్ ఆర్మీ నుంచి ఆక్షన్‌లో కొన్నామని చెప్పి పాత లగ్జరీ SUVలు ల్యాండ్ క్రూజర్, ప్రాడో, ల్యాండ్ రోవర్ వంటివి ఇండియాకు తీసుకొచ్చి, హిమాచల్ ప్రదేశ్‌లో రిజిస్టర్ చేసి, కేరళలో అమ్ముతున్నారు. ఇవి సెకండ్-హ్యాండ్‌గా డిక్లేర్ చేసి దిగుమతి పన్నులు ఎగ్గొట్టారు. ఒక్కో వాహనంపై వంద శాతం పన్ను ఉంటుంది. భూటాన్ నుంచి 150కి పైగా వెహికల్స్ ఈ విధంగా స్మగ్లింగ్ అయ్యాయని అధికారులు అంచనా.
దుల్కర్ సల్మాన్ పానంపిల్లి నగర్‌లోని ఇలు, పృథ్వీరాజ్ తేవరాలోని ఇలు, కొచ్చి, తిరువనంతపురం, కోజికోడ్, మలప్పురం వంటి ప్లేసుల్లో దాడులు జరిగాయి. ఇండస్ట్రియలిస్టులు, కార్ డీలర్ల ఇళ్లలోనూ సోదాలు చశారు. వెహికల్స్ డాక్యుమెంట్లు చెక్ చేస్తున్నారని అధికారులు చెప్పారు.
ఇలాంటి కేసే హైదరాబాద్‌లోనూ రాజకీయంగా కలకలం రేపుతోంది. హైదరాబాద్ 'కార్ లౌంజ్' ఓనర్ బషరత్ ఖాన్ ను.. మే 2025లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అరెస్టు చేసింది. ఈ కేసులో అతను USA, జపాన్ నుంచి లగ్జరీ కార్లు రోల్స్ రాయిస్, హమ్మర్ EV, ల్యాండ్ క్రూజర్ వంటివి దుబాయ్, శ్రీలంక రూట్‌లో తీసుకొచ్చి, అండర్‌వాల్యూ చేసి రూ. 25-100 కోట్ల పన్ను ఎగ్గొట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. 30కి పైగా కార్లు ఇంపోర్ట్ చేసుకుని వీఐపీలకు అమ్మాడు.
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబసభ్యుల పేరుతో ఉన్న కంపెనీ ద్వారా కొన్న ల్యాండ్ క్రూజర్ (రిజిస్టర్ నంబర్ TG09D6666) బషరత్ ఖాన్ ఇంపోర్ట్ చేసిన కారుల్లో ఒకటని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించాడు. బషరత్ ఖాన్ ఇంటరోగేషన్‌లో ఈ కారు అతని 8 కార్లలో ఒకటని చెప్పాడని అంటున్నారు. అటు కేరళ లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కు..ఇటు హైదరాబాద్ లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కు ఇంకా లింకులు బయటపడలేదు. రెండు వేర్వేరు స్మగ్లింగ్ కేసులుగా భావిస్తున్నారు.
Is Car Party running on smuggled luxury cars?
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 22, 2025
Why is #TwitterTillu seen in land cruisers imported by luxury car scam-accused Basarath Khan, arrested by DRI Ahmedabad?
Why are they registered with companies linked to KCR’s family?
Were these cars bought at market price or…
కొసమెరుపేమిటంటే..దుల్కర్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ సినిమాలో హీరో ఇలా కార్ స్మగ్లింగ్ చేసి డబ్బు సంపాదించే సీన్ ఉంది.





















