Diwali Bonus: ఆ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్- దీపావళి కానుకగా 78 రోజుల బోనస్!
Diwali Bonus: రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుకగా బోనస్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
Diwali Bonus for Railway Employees: రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. దీపావళి కానుకగా బోనస్ ప్రకటించింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమై నిర్ణయం తీసుకుంది.
కానీ
బోనస్ విషయంలో కేంద్రం ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చింది. ఇది ప్రొడెక్టివిటీ లింక్‌డ్ బోనస్ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. మొత్తం 11.27 లక్షల మంది రైల్వే ఉద్యోగులు గరిష్ఠంగా రూ.17,951 పొందుతారని వివరించారు.
Productivity linked bonus of Rs 1,832 crores will be given to 11.27 lakh employees of railways. It will be a bonus of 78 days and Rs 17,951 will be its maximum limit: Union Minister Anurag Thakur pic.twitter.com/lBu3GJj7w1
— ANI (@ANI) October 12, 2022
నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు పెర్ఫామెన్స్ ఆధారిత ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్లు కేంద్రం ఎప్పుడో తెలిపింది. అలాగే ఆయిల్ సంస్థలకు రూ.22 వేల గ్రాంట్‌ను మంజూరు చేయనున్నట్లు ఠాకూర్ తెలిపారు.
కేబినెట్ నిర్ణయాలు
ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలను అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌పీజీ ధరలు పెరుగుతున్న కారణంగా సామాన్యులపై ఆ ప్రభావం పడకుండా పబ్లిక్ సెక్టార్‌లోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రూ.22 వేల కోట్లు ఒన్ టైమ్ గ్రాంట్‌గా ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
Also Read: Jharkhand Viral News: హనుమంతుడికి రైల్వేశాఖ నోటీసులు- 10 రోజుల్లో ఆలయం ఖాళీ చేయాలట!
Also Read: UIDAI Aadhaar Card Update: ఆధార్ తీసుకుని 10 ఏళ్లు దాటిందా? అర్జెంటుగా ఈ పని చేయండి!