అన్వేషించండి

UIDAI Aadhaar Card Update: ఆధార్ తీసుకుని 10 ఏళ్లు దాటిందా? అర్జెంటుగా ఈ పని చేయండి!

UIDAI Aadhaar Card Update: ఆధార్ తీసుకుని 10 ఏళ్లు దాటిన వారు ఈ అప్‌డేట్ చేసుకోవాలని ఉడాయ్ సూచించింది.

UIDAI Aadhaar Card Update: భారత పౌరులకు ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఆధార్‌ కార్డుకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. మీరు ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లయితే కనుక వెంటనే ఈ అప్‌డేట్ (Aadhaar Card Update) చేసుకోండి.

వివరాలు

ఆధార్‌ పొంది పదేళ్లు దాటిన వారు.. గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలను మళ్లీ సమర్పించాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సూచించింది. గత పదేళ్లలో ఆధార్‌ను ఒక్కసారి కూడా అప్డేట్ (Aadhaar Card Update) చేయనివారు ఈ పని చేయాలని కోరింది.

అయితే ఐడెంటిటీ, రెసిడెన్స్ ప్రూఫ్ డాక్యుమెంట్లను సమర్పించడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను మై ఆధార్‌ పోర్టల్‌తోపాటు దగ్గర్లోని ఆధార్‌ సెంటర్లలో నిర్దేశిత రుసుము చెల్లించి చేసుకోవచ్చని తెలిపింది.

దేశంలోని పౌరులందరికీ విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డులను జారీ చేస్తోంది. వీటికి ఐరిస్​, వేలిముద్రలు, ఫొటోలను ప్రామాణికంగా తీసుకుంటుంది. ఇలా కేటాయించిన ఆధార్‌ నంబర్‌ను ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక సహా ఇతర అవసరాలకు ప్రభుత్వం ఉపయోగిస్తోంది.

ఆధార్

ప్రస్తుతం ఆధార్​ కలిగిన వారి శాతం 93 శాతం కంటే ఎక్కువే. దేశంలో దాదాపు 50,000 ఆధార్​ అప్​డేట్​ కేంద్రాలు ఉన్నాయి. ఫోన్​ నంబర్, చిరునామాలను అప్​డేట్​ చేసేందుకు 1,50,000 మంది పోస్ట్​ మ్యాన్లను వినియోగిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. దీని ద్వారా నకిలీ లబ్ధిదారులను గుర్తించి నిధులు దుర్వినియోగం కాకుండా.. ప్రజాధనం ఆదా చేయడానికి సహాయపడుతుందని తెలిపింది.

సుప్రీం ఆదేశాలు

ఆధార్ కార్డుల జారీ విషయంలో సుప్రీం కోర్టు ఈ ఏడాది కీలక ఆదేశాలు ఇచ్చింది. దేశంలోని ప్రతి వ్యక్తికి గౌరవం పొందాల్సిన ప్రాథమిక హక్కు ఉందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కరోనా సమయంలో సెక్స్ వర్కర్లు ఎదుర్కొన్న సమస్యలపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు... వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలని ఆదేశించింది.

యూఐడీఏఐ జారీ చేసే ప్రొఫార్మా సర్టిఫికేట్ ఆధారంగా.. ఆధార్ కార్డులు ఇవ్వాలని సూచించింది. సెక్స్ వర్కర్ల గుర్తింపును బహిర్గతం చేయకూడదని, వారి గోప్యతను కాపాడాలని జస్టిస్ లావు నాగేశ్వర రావు నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

సీబీఓ (కమ్యునిటీ బేస్డ్ ఆర్గనైజేషన్) గుర్తించిన సెక్స్ వర్కర్లకు ఓటర్ ఐడీలు సైతం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సెక్స్ వర్కర్లకు రేషన్ అందించాలని ఇదివరకే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారికి ఎటువంటి గుర్తింపు కార్డులు లేదన్న కారణంతో.. రేషన్ పంపిణీని అడ్డుకోవద్దని సూచించింది.

Also Read: Russia Ukraine Conflict: 'అణు బాంబు వేస్తే మా పవర్ చూపిస్తాం'- పుతిన్‌కు జీ7 దేశాల వార్నింగ్

Also Read: IAF MiG 29K Fighter Jet Crash: సముద్ర తీరంలో కుప్పకూలిన మిగ్- 29కే- పైలట్ సేఫ్!

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
CM Revanth Reddy: 2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget