Jharkhand Viral News: హనుమంతుడికి రైల్వేశాఖ నోటీసులు- 10 రోజుల్లో ఆలయం ఖాళీ చేయాలట!
Jharkhand Viral News: 10 రోజుల్లో ఆలయాన్ని ఖాళీ చేయాలని ఆంజనేయ స్వామికి నోటీసులు పంపింది రైల్వే శాఖ.
Jharkhand Viral News: 'గోపాల గోపాల' సినిమా గుర్తుందా? అదేనండి.. నీ వల్లే నేను నష్టపోయాను అంటూ వెంకటేశ్.. దేవుడికి నోటీసు పంపిస్తాడు కదా! తాజాగా అదే సీన్ రియల్ లైఫ్‌లో జరిగింది. అయితే ఇక్కడ ఏకంగా రైల్వే అధికారులు ఈ నోటీసులు పంపించారు. స్యయంగా ఆంజనేయ స్వామికే నోటీసులిచ్చారు.
ఇదీ జరిగింది
ఝార్ఖండ్ ధన్‌బాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బెరక్‌బందల్ ఖాటిక్ ప్రాంతంలో ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వలస వచ్చిన ఖాటిక్ తెగ ప్రజలు నివసిస్తున్నారు. వీరు 20 ఏళ్లుగా ఇక్కడే కూలీ పనులు చేసుకుని బతుకుతున్నారు. అయితే రైల్వేకు చెందిన స్థలంలో అక్రమంగా నివసిస్తున్నందున తక్షణమే గుడిసెలు ఖాళీ చేసి వెళ్లాలని రైల్వే అధికారులు వీళ్లకు నోటీసులిచ్చారు.
అయితే ఇదే వరుసలో ఓ హనుమాన్ మందిరం ఉంది. దీంతో ఆంజనేయుడికి కూడా నోటీసు ఇచ్చారు అధికారులు. 10 రోజుల్లో గుడి ఖాళీ చేసి వెళ్లాలని ఆదేశించారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదేందిరా నాయనా!
రైల్వే ఇచ్చిన నోటీసు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే నోటీసులో 'హనుమాన్ జీ' అని స్పష్టంగా రాసి ఉంది.
@RailMinIndia
— Keshav kadam 🚩 🇮🇳 (@Keshavkadam09) October 11, 2022
They simply do not have the guts to take action against the mazaari illegally constructed on the railway premises, what do the railway officials want to achieve by sending a notice to God.
If you have the guts, send this notice to those who are hiding in the tomb. pic.twitter.com/QX0w0oy0DG
ఈ నోటీసు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా షాకవుతున్నారు. ఈ నోటీసులపై అక్కడి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గుడిని 1931 లో నిర్మించినట్లుగా స్థానికులు చెబుతున్నారు.
Also Read: UIDAI Aadhaar Card Update: ఆధార్ తీసుకుని 10 ఏళ్లు దాటిందా? అర్జెంటుగా ఈ పని చేయండి!
Also Read: Russia Ukraine Conflict: 'అణు బాంబు వేస్తే మా పవర్ చూపిస్తాం'- పుతిన్‌కు జీ7 దేశాల వార్నింగ్