(Source: Poll of Polls)
TMC MP Suspended: రాజ్యసభలో మరో ఎంపీపై వేటు.. 13కు చేరిన సంఖ్య
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియన్‌పై సస్పెన్షన్ వేటు వేసింది రాజ్యసభ. ఈ సెషన్‌లోని మిగతా సమావేశాలకు ఆయన హాజరు కాకుండా నిషేధించారు.
రాజ్యసభలో మరో ఎంపీపై వేటు పడింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియన్‌ను సస్పెండయ్యారు. సభా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆయన్ను ప్రస్తుత సెషన్‌లోని మిగతా సమావేశాలకు హాజరు కాకుండా నిషేధం విధించినట్లు ఛైర్మన్ ప్రకటించారు. ఎన్నికల చట్టాల(సవరణ) బిల్లుపై చర్చ సమయంలో డెరెక్.. రాజ్యసభ రూల్ బుక్‌ను ఛైర్మన్ వైపు విసిరినందుకే సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలైన రోజే రాజ్యసభలో 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేశారు. గత వర్షాకాల సమావేశాల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి సభా మర్యాదలు పాటించని ఎంపీలను ఈ శీతాకాల సమావేశాలకు మొత్తం సస్పెండ్ చేస్తూ రాజ్యసభ సోటీసు ఇచ్చింది.
సస్పెండైన ఎంపీలు..
- ఎలమారమ్ కరీమ్ - సీపీఎమ్
- ఫులో దేవీ నేతమ్ - కాంగ్రెస్
- ఛాయా వర్మ - కాంగ్రెస్
- ఆప్ బోరా - కాంగ్రెస్
- రాజమణి పటేల్ - కాంగ్రెస్
- సయ్యద్ నాసిర్ హుస్సేన్ - కాంగ్రెస్
- అఖిలేశ్ ప్రసాద్ సింగ్ - కాంగ్రెస్
- బినోయ్ విశ్వం - సీపీఐ
- డోలా సేన్ - టీఎమ్‌సీ
- శాంతా ఛెత్రీ - టీఎమ్
- ప్రియాంక ఛతుర్వేదీ - శివసేన
- అనిల్ దేశాయ్ - శివసేన
Also Read: Goodbye 2021: బైబై బాబు.. చెప్పేముందు ఇక్కడ ఓ లుక్కేయండి.. 2021లోనే తొలిసారి!
Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 5,326 మందికి కొవిడ్
Also Read: Omicron Death In US: అమెరికాలో ఒమిక్రాన్‌తో తొలి మరణం నమోదు.. యూఎస్‌లో మొదలైన కలవరం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి