Delhi Pollution: ఉద్యోగులారా ఇక ల్యాప్ టాప్‌లు తీయండి.. మళ్లీ 'వర్క్ ఫ్రమ్ హోం'!
దిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎన్‌సీఆర్ పరిధిలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం విధానం అమలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది.
దిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టు మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. వాయు కాలుష్యం కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించి, చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. జాతీయ రాజధాని ప్రాంతంలో (ఎన్‌సీఆర్) ఉన్న ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం విధానం అమలు చేయాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది.
తప్పుబట్టిన సుప్రీం..
రైతులు పంట వ్యర్థాలు కాల్చడమే వాయు కాలుష్యానికి కారణమని దిల్లీ ప్రభుత్వం పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ తరహా కుంటిసాకులు అర్థం లేనివని చురకలు అంటించింది. దిల్లీలో ఏయే పరిశ్రమలను ఆపొచ్చు? ఏ వాహనాలను నిషేధించవచ్చు? ఏయే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఆపొచ్చు? వంటి వాటిపై మంగళవారం సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పంటవ్యర్థాలు కాల్చడం వల్ల 10 శాతం మాత్రమే కాలుష్యం ఏర్పడుతోందని కేంద్రం పేర్కొంది.
అత్యవసర భేటీ..
వాయు కాలుష్యం కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై రేపు అత్యవసర సమావేశాన్ని నిర్వహించి, చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, హరియాణా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ భేటీకీ హాజరు కావాలని చెప్పింది. తదుపరి విచారణను నవంబరు 17కు వాయిదా వేసింది.
Also Read: Kabul Blast: అఫ్గానిస్థాన్‌లో బాంబుల మోత.. కాబూల్‌లో మరో పేలుడు
Also Read: Anil Deshmukh Remanded: 'ముందు జైలు కూడు తినండి..' మాజీ హోంమంత్రికి షాకిచ్చిన కోర్టు!
Also Read: Gujarat Drugs Seized: భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. వీటి విలువ రూ. 600 కోట్ల పైమాటే!
Also Read: Delhi Air Pollution: లాక్డౌన్ బాటలో దేశ రాజధాని.. కరోనా కోసం కాదు అంతకుమించి!
Also Read: Corona Cases: క్రమంగా తగ్గుతోన్న కరోనా ఉద్ధృతి.. కొత్తగా 10,229 కేసులు
Also read: తన గేదెపైనే కంప్లయింట్ ఇచ్చిన అమాయకపు రైతు... గేదె చేసిన తప్పు అదే
Also read: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి