By: Ram Manohar | Updated at : 19 Mar 2023 11:30 AM (IST)
శ్రీనగర్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులు విచారణ చేపడుతున్నారు. (Image Credits: ANI)
Rahul Gandhi:
ఢిల్లీ పోలీసుల విచారణ..
ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసానికి పోలీసులు వెళ్లారు. స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హెడ్ సాగర్ ప్రీత్ హుడా బృందం ప్రస్తుతం ఆయన ఇంటికి చేరుకుంది. భారత్ జోడో యాత్ర శ్రీనగర్‌లో ముగిసిన సందర్భంగా రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లో ఇప్పటికీ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, ఆ బాధితులు తనతో బాధ పంచుకున్నారని అన్నారు. దీనిపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఏ ఆధారాలతో ఈ వ్యాఖ్యలు చేశారో చెప్పాలంటూ బీజేపీ కూడా తీవ్రంగా మండి పడింది. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసులు రాహుల్‌ను విచారించేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. ఆ బాధితుల వివరాలు ఇస్తే వారికి న్యాయం జరిగేలా చూస్తామని చె చెబుతున్నారు.
"మేమిక్కడి రాహుల్ గాంధీతో మాట్లాడేందుకు వచ్చాం. ఈ ఏడాది జనవరి 30న రాహుల్ గాంధీ శ్రీనగర్‌లో భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొందరు మహిళలకు అత్యాచారానికి గురయ్యారని, స్వయంగా ఆ బాధితులే తనతో మాట్లాడారని చెప్పారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించేందుకు వచ్చాం. తద్వారా బాధితులకు న్యాయం చేయాలని భావిస్తున్నాం"
-సాగర్ ప్రీత్ హుడా, స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హెడ్
Delhi | Special CP (L&O) Sagar Preet Hooda arrives at the residence of Congress MP Rahul Gandhi in connection with the notice that was served to him by police to seek information on the 'sexual harassment' victims that he mentioned in his speech during the Bharat Jodo Yatra. pic.twitter.com/WCAKxLdtZJ
— ANI (@ANI) March 19, 2023
రాహుల్ శ్రీనగర్‌లో మాట్లాడిన ప్రతి మాటనూ రికార్డ్ చేసుకున్న పోలీసులు...ఆ ఆధారంగానే ఆయనను ప్రశ్నించనున్నారు. అంతే కాదు. కశ్మీర్‌లో మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి మీడియా చూపించడం లేదని ఆరోపించడమూ వివాదాస్పదమైంది.
"మహిళలు ఇంకా వేధింపులకు గురవుతూనే ఉన్నారు. కానీ మీడియా మాత్రం వీటి గురించి మాట్లాడదు. ఆ వార్తలు చూపించదు. ఇద్దరు మహిళలు నాతో వ్యక్తిగతంగా మాట్లాడారు. తాము గ్యాంగ్ రేప్‌నకు గురైనట్టు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చాను. కానీ వాళ్లు తమకు పెళ్లి అవ్వదేమో అన్న భయంతో ముందుకు రాలేదు"
- శ్రీనగర్‌లోని స్పీచ్‌లో రాహుల్ గాంధీ
ఈ వ్యాఖ్యల ఆధారంగానే రాహుల్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన సోషల్ మీడియా అకౌంట్‌లలో చేసిన పోస్ట్‌లనూ పరిశీలించారు. అయితే...ఈ నోటీసులపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మండి పడ్డారు. యాత్ర ముగిసిన 45 రోజుల తరవాత విచారించాలని గుర్తొచ్చిందా అని విమర్శించారు. లీగల్‌గా ప్రొసీడ్ అవుతామని తేల్చి చెప్పారు.
Delhi | It has been 45 days since Bharat Jodo Yatra ended. They (Delhi police) are going for questioning after 45 days. If they are so much concerned why didn't they go to him in February? Rahul Gandhi's legal team will respond to it as per law: Congress leader Jairam Ramesh pic.twitter.com/Xo4JqErSGG
— ANI (@ANI) March 19, 2023
Also Read: Amritpal Singh News: పరారీలో అమృత్ పాల్ సింగ్,రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్
Leh Manali Highway: రికార్డు సమయంలో అందుబాటులోకి కశ్మీర్ రహదారులు, కారణం ఏంటంటే!
Visakha G20 Summit : ఈ నెల 28, 29న విశాఖలో జీ20 సదస్సు, హాజరుకానున్న 69 మంది విదేశీ ప్రతినిధులు
TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో 15 మంది అరెస్ట్, ప్రవీణ్ ఇంట్లో నగదు స్వాధీనం
Covid19 Cases: కొవిడ్ కేసుల పెరుగుదలతో ఏపీ అలర్ట్ - తెలంగాణను భయపెడుతున్న H3N2 కేసులు
ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!
Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!