By: Ram Manohar | Updated at : 11 Jan 2023 03:03 PM (IST)
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఆరుబయటే యూరినేట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Urination in Delhi Airport:
ఆరుబయటే యూరినేషన్..
ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఓ మహిళపై యూరినేషన్ చేసిన ఘటన మరిచిపోక ముందే...అలాంటి ఘటనే ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణంలో ఆరుబయట ఓ వ్యక్తి యూరినేట్ చేశాడు. కొందరు ప్రయాణికులు ఇది గమనించిపోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. జనవరి 8న ఈ ఘటన జరిగింది. అలా చేయడం కరెక్ట్ కాదంటూ అక్కడి వాళ్లు ఆ వ్యక్తిని ఆపేందుకు ప్రయత్నించినా...గొడవకు దిగాడు. చివరకు అరెస్ట్ అయ్యాడు. జనవరి 8న సాయంత్రం 5.30 గంటలకు గేట్ నంబర్ 6 వద్ద ఇది జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి మద్యం సేవించాడని వెల్లడించారు. నిందితుడిని బిహార్‌కు చెందిన జోహార్ అలీఖాన్‌గా గుర్తించారు. సౌదీ అరేబియాకు వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చినట్టు చెప్పారు. అరెస్ట్ చేసిన వెంటనే మెడికల్ టెస్ట్ చేయించారు. అదుపులోకి తీసుకున్నప్పటికీ...బెయిల్‌తో బయటకు వెళ్లాడు నిందితుడు.
ఎయిర్ ఇండియా ఘటన..
ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో మహిళపై యూరినేట్ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ పోలీసులు బెంగళూరులో శంకర్ శేఖర్ మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు. గతేడాది నవంబర్ 26న ఈ ఘటన జరగ్గా...అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు...ఎట్టకేలకు బెంగళూరులో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. బెంగళూరులో ఉన్నాడన్న ప్రాథమిక సమాచారం
ఆధారంగా...ఢిల్లీ పోలీసులు ప్రత్యేకంగా ఓ టీమ్‌ని అక్కడికి పంపించారు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నప్పటికీ..సోషల్ మీడియా అకౌంట్స్ యాక్టివ్‌గా ఉన్నాయి. వీటి ద్వారానే పోలీసులు నిందితుడిని ట్రాక్ చేశారు. ఒకే ప్లేస్‌లో ఉండటంతో పాటు క్రెడిట్ కార్డ్ కూడా వినియో గించినట్టు విచారణలో తేలింది. నిజానికి...శంకర్ శేఖర్ శర్మ బాధితురాలితో మాట్లాడాడు. పరిహారం కింద రూ.15,000 కూడా చెల్లించాడు. కంప్లెయింట్ వెనక్కి తీసుకోవాలని కోరాడు. అయితే...బాధితురాలి కూతురు మాత్రం ఇది అంగీకరించలేదు. డబ్బు తిరిగి ఇచ్చేసింది. అప్పటి నుంచి మళ్లీ కేసు మొదటికి వచ్చింది. అమెరికాలోని వెల్స్‌ఫార్గో కంపెనీలో పని చేస్తున్న శంకర్ శర్మను ఆ సంస్థ విధుల నుంచి తొలగించింది. ఇలా ప్రవర్తించే వారికి తమ కంపెనీలో చోటు ఇవ్వలేమని,క్రెడిబిలిటీ కోల్పోలేమని స్పష్టం చేసింది యాజమాన్యం.
షోకాజ్ నోటీసులు..
మహిళా ప్రయాణికురాలిపై యూరినేట్ చేయడం, తోటి ప్రయాణికురాలిని ఇబ్బంది పెట్టిన రెండు వేర్వేరు ఘటనలపై విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA) ఎయిరిండియాకు షోకాజు నోటీసులు జారీ చేసింది. రెండు వేర్వేరు ఘటనల్లో తాము నివేదిక కోరేంత
వరకు తమకు ఎయిరిండియా ఎందుకు రిపోర్ట్ చేయలేదని డీజీసీఏ ప్రశ్నించింది. విమాన సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహ రించిందని, ఎయిర్ లైన్స్ పై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులలో పేర్కొంది. ఎయిరిండియాకు వివరణ ఇచ్చేందుకు రెండు వారాలు గడువు ఇచ్చిన డీజీసీఏ, ఎయిరిండియా నివేదిక తరువాత చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటనలో పేర్కొంది.
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
-Rahul Gandhi In Srinagar: ప్రతిపక్షాల మధ్య విభేదాలున్నా, ఆరెస్సెస్- బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతాం: రాహుల్ గాంధీ
Bandi Sanjay: ముందస్తుకు మేం కూడా రెడీ, కానీ అదొక్కటే షరతు అంటున్న బండి సంజయ్
BRS Corporators Arrest : మేడిపల్లిలో పేకాట స్థావరంపై దాడి, డిప్యూటీ మేయర్ సహా 7గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్టు
Minister Botsa Satyanarayana : రాజకీయాలు దిగజారడానికి అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తులే కారణం - మంత్రి బొత్స
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్
IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!
Naba Kishore Das: ఏఎస్ఐ కాల్పుల్లో గాయపడిన ఒడిశా మంత్రి నబా కిషోర్ దాస్ మృతి