Delhi Liquor Policy Case: సిసోడియా పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు, హైకోర్టులో తేల్చుకోవాలని సూచన
Delhi Liquor Policy Case: తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ సిసోడియా వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.
Delhi Liquor Policy Case:
విచారించడం కుదరదు: సుప్రీంకోర్టు
CBI అరెస్ట్‌ని సవాల్ చేస్తూ ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఢిల్లీ హైకోర్టునే ఆశ్రయించాలంటూ సూచించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.
హైకోర్టులో ప్రత్యామ్నాయ మార్గాలు దొరికే అవకాశముందని వ్యాఖ్యానించింది. నేరుగా సుప్రీంకోర్టుకు రాకుండా హైకోర్టులోనే తేల్చుకోవాలని తేలవ్చి చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి పిటిషన్ విచారించడం కుదరదని స్పష్టం చేశారు చీఫ్ జస్టిస్ డీపై చంద్రచూడ్. ఈ మేరకు తాము ఢిల్లీ హైకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం కొనసాగిస్తామని ఆప్ తెలిపింది. తనిఖీల్లో ఎలాంటి నగదు దొరకలేదని, ఛార్జ్‌షీట్‌లోనూ ఆయన పేరు లేదని సిసోడియా తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకి తెలిపారు. అయితే...ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి బిజీగా ఉంటున్నారని వివరించారు. ఆయనే ట్రిబ్యునల్ విధులూ నిర్వర్తిస్తున్నారని చెప్పారు. సిసోడియా అరెస్ట్‌ను తప్పు పట్టారు సింఘ్వీ. అయితే...సుప్రీంకోర్టు మాత్రం "మీరేం చెప్పినా హైకోర్టులోనే చెప్పుకోండి. మేం ఈ పిటిషన్‌ను విచారించలేం" అని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తామని, హైకోర్టుకు వెళ్తామని ఆప్ స్పష్టం చేసింది.
SC refuses to entertain Delhi Dy CM Manish Sisodia's plea against his arrest by CBI, suggests him to move High Court. pic.twitter.com/P5jh8UmsNJ
— ANI (@ANI) February 28, 2023
AAP to go to Delhi HC pertaining to Delhi Dy CM Manish Sisodia's arrest by CBI: AAP
— ANI (@ANI) February 28, 2023
Earlier, SC refused to entertain Delhi Dy CM Manish Sisodia's plea against his arrest by CBI & suggested him to move High Court. https://t.co/IyRQtI7bnM
లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ సిసోడియాపై ఆరోపణలు చేస్తోంది CBI.ఇప్పటికే ఆయనను రెండు సార్లు విచారించింది. ఇటీవలే ఆయనను 8.5 గంటల పాటు విచారించిన అధికారులు తరవాత అరెస్ట్ చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని, అందుకే అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పారు. ఆ తరవాత కోర్టులోనూ హాజరు పరిచారు. రౌస్ అవెన్యూ కోర్టులో CBI అధికారులు,సిసోడియా తరపున న్యాయవాది తమ తమ వాదనలు వినిపించారు. కచ్చితంగా అవకతవకలు జరిగాయని CBI చెబుతుంటే...అలాంటిదేమీ లేదని సిసోడియా తరపున న్యాయవాది వాదించారు. చివరకు 5 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది.
మార్చి 4వ తేదీ వరకూ కస్టడీలోనే ఉంటారని స్పష్టం చేశారు అధికారులు
"సిసోడియా కంప్యూటర్లో కొన్ని కీలక ఆధారాలు లభించాయి. కొందరి మంత్రుల నుంచి సిసోడియాకు నోట్లు వచ్చాయి. కమీషన్ ఉన్నట్టుండి 5 కోట్ల నుంచి 12 కోట్లకు పెంచేశారు. ఒకవేళ ఈ పాలసీ నిజంగానే పారదర్శకంగా ఉండి ఉంటే కచ్చితంగా అమలు చేసే వాళ్లు. Indo Spirit అనే కంపెనీ సిసోడియా వల్ల లబ్ధి పొందింది. ఈ కేసులో తప్పకుండా ఫేస్ టు ఫేస్ ఇంటరాగేషన్ జరిపి తీరాలి. ఆయన ఫోన్లు కూడా పదేపదే మార్చారు. ఆధారాలు చెరిపేందుకు ప్రయత్నించారు. 2020 జనవరి నుంచి ఇప్పటి వరకూ సిసోడియా వాడిన ఫోన్లను మేం పరిశీలించాలి."