Rajnath Singh Corona Positive: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు కరోనా పాజిటివ్

స్వల్ప లక్షణాలతో తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

FOLLOW US: 

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్‌లో వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. ప్రస్తుతానికి హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు.

" స్వల్ప లక్షణాలతో నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతానికి హోం క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకోవాలి.                                                   "
-రాజ్‌నాథ్‌ సింగ్, రక్షణ మంత్రి

ప్రముఖులకు కరోనా..

కరోనా సెకండ్ వేవ్ సమయంలో సామాన్యులకు ఎక్కువగా కరోనా సోకగా థర్డ్ వేవ్‌లో చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. వీరందరికీ ఇటీవల కరోనా వచ్చింది.

  • దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌
  • కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్
  • రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ 
  • భాజపా ఎంపీ వరుణ్ గాంధీ
  • మహారాష్ట్రలో పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కరోనా బారిన పడ్డారు.

పీక్ స్టేజ్..

దేశంలో రోజువారీ కేసులు లక్షకు పైగా నమోదవుతున్నాయి. ఇప్పటికే థర్డ్ వేవ్ ప్రారంభమైందని కొంతమంది నిపుణులు అంటున్నారు. కానీ ఒమిక్రాన్ కారణంగా వచ్చే థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌లో ఉంటే రోజుకి 10 లక్షల కేసులు వచ్చే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదట్లో థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌లో ఉండే అవకాశం ఉందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (IISc-ISI) తెలిపింది.

IISc-ISIకు చెందిన ఫ్రొఫెసర్ శివ ఆత్రేయ, ఫ్రొఫెసర్ రాజేశ్ సుందరేశన్ నేతృత్వంలోని బృందం ఈ అధ్యయనం చేసింది. అయితే థర్డ్ వేవ్ పీక్ దశ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండే అవకాశం ఉందని వీరు తెలిపారు. మార్చి మొదటి నుంచి మళ్లీ కరోనా కేసులు తగ్గే అవకాశం ఉందన్నారు.

Also Read: TN Jallikattu Guidelines: ఒమిక్రాన్ అయినా ఏమైనా.. తమిళనాడు తగ్గేదేలే! జల్లికట్టుకు పచ్చజెండా

Also Read: షాకింగ్ వీడియో: విహారంలో విషాదం.. పర్వతం విరిగి బోటుపై పడింది

Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 10 Jan 2022 04:28 PM (IST) Tags: defence minister Rajnath Singh Corona Positive Rajnath Singh Corona Positive

సంబంధిత కథనాలు

Searching For Tiger: కాకినాడజిల్లాలో తిరిగే పులి రూటు మార్చిందా? అనకాపల్లి జిల్లాలో పశువులపై దాడి ఎవరి పని?

Searching For Tiger: కాకినాడజిల్లాలో తిరిగే పులి రూటు మార్చిందా? అనకాపల్లి జిల్లాలో పశువులపై దాడి ఎవరి పని?

Viral Video: ఏం దూకినవ్, హార్ట్ బీట్ పెంచేసినవ్ లే- 70 ఏళ్ల బామ్మ జంప్!

Viral Video: ఏం దూకినవ్, హార్ట్ బీట్ పెంచేసినవ్ లే- 70 ఏళ్ల బామ్మ జంప్!

Konda Vishweshwar Reddy: బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి! టీఆర్ఎస్ మాజీ ఎంపీతో బండి సంజయ్, తరుణ్ ఛుగ్ భేటీ?

Konda Vishweshwar Reddy: బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి! టీఆర్ఎస్ మాజీ ఎంపీతో బండి సంజయ్, తరుణ్ ఛుగ్ భేటీ?

Breaking News Live Telugu Updates: మళ్లీ నోరు జారిన ఏపీ డిప్యూటీ సీఎం, సీఎంను అంతమాట అనేశారే!

Breaking News Live Telugu Updates: మళ్లీ నోరు జారిన ఏపీ డిప్యూటీ సీఎం, సీఎంను అంతమాట అనేశారే!

Udaipur Murder Case: ఉదయ్‌పుర్ హత్య కేసు నిందితులకు పాక్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు

Udaipur Murder Case: ఉదయ్‌పుర్ హత్య కేసు నిందితులకు పాక్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు

టాప్ స్టోరీస్

Xiaomi A2 TV Series: సూపర్ ఫీచర్లతో షియోమీ కొత్త టీవీలు - డిస్‌ప్లేలే పెద్ద ప్లస్ పాయింట్!

Xiaomi A2 TV Series: సూపర్ ఫీచర్లతో షియోమీ కొత్త టీవీలు - డిస్‌ప్లేలే పెద్ద ప్లస్ పాయింట్!

YSRCP Plenary: "కిక్‌ బాబు అవుట్‌" ఇదే వైఎస్‌ఎస్‌ఆర్‌సీపీ ప్లీన‌రీ నినాదం

YSRCP Plenary:

In Pics: వీణా వాణితో మంత్రులు సబిత, సత్యవతి - స్వీట్లు తినిపించి అభినందనలు, ఈ అద్దం సంగతి ఏంటో తెలుసా?

In Pics: వీణా వాణితో మంత్రులు సబిత, సత్యవతి - స్వీట్లు తినిపించి అభినందనలు, ఈ అద్దం సంగతి ఏంటో తెలుసా?

Ram Pothineni: గర్ల్ ఫ్రెండ్, పెళ్లిపై హీరో రామ్ రియాక్షన్ ఇదే!

Ram Pothineni: గర్ల్ ఫ్రెండ్, పెళ్లిపై హీరో రామ్ రియాక్షన్ ఇదే!