December 21: డిసెంబర్ 21 నైట్ టైం ఎక్కువ ఉన్న డేట్, మాజీ సీఎం జగన్, స్టార్ హీరోయిన్ తమన్నా పుట్టిన రోజు
Happy Birth Day Jagan And Tamanna Bhatia: మాజీ సీయం జగన్, స్టార్ హీరోయిన్ తమన్నా పుట్టిన రోజు మర్చిపోకండీ. అలా మర్చిపోతే ప్రపంచంలో జరిగే ఓ కీలకాంశాన్ని, పోటీ పరీక్షల్లో ఓ మార్కును కోల్పోతారు.
Longest Night Day: పగలంతా సూర్యుడు ఉంటాడు.. రాత్రంతా చంద్రుడు ఉంటాడు. ఒక రోజులో రాత్రి పగలు సమానంగా ఉంటాయనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఒక రోజులో రాత్రి పగలు ఎప్పుడూ సమానంగా ఉండవు. కొన్ని రోజులు రాత్రి ఎక్కువ సమయం ఉంటే.. కొన్ని రోజుల్లో పగలు ఎక్కువ సమయం ఉంటుంది. ఇలాంటి వాటిలో డిసెంబర్ 21 చాలా స్పెషల్. ఈ రోజున రాత్రి చాలాసేపు ఉంటుంది.. సంవత్సరంలో అతి పొడవైన రాత్రి (Longest Night ) గా డిసెంబర్ 21కి గుర్తింపు ఉంది.
భూమి ఆకారం, సూర్యుడు చుట్టూ తిరిగే కక్ష కక్ష్య దీనికి కారణం
భూమి సూర్యుడి చుట్టూ వృత్తాకారంలో తిరిగినా లేక భూమి పూర్తిగా గుండ్రంగా ఉన్నా రోజులో రాత్రి పగలు సమానంగా ఉండేవి. నిజానికి భూమి గుండ్రంగా ఉండదు. ధ్రువాల వద్ద కొంచెం లోపలికి నొక్కి ఉంటుంది. దానితో అది సూర్యుడు చుట్టూ 23.5 డిగ్రీల అక్షాంశంపై వంగి తిరుగుతూ ఉంటుంది. అలాగే సూర్యుడు చుట్టూ దీర్ఘ వృత్తాకారంలో (Eloptical ) తిరుగుతూ ఉంటుంది. దీనివల్ల భూమధ్య రేఖ వద్ద సూర్యుడి కిరణాలు సమానంగానే పడినా ధ్రువాలకు దగ్గరగా వెళ్లే కొద్దీ ఒక్కోరోజు ఒక్కోలా పడుతూ ఉంటాయి. దానితో భూమి సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు పగటి సమయం పెరుగుతూ ఉంటుంది. దూరంగా వెళ్లే కొద్దీ రాత్రి సమయం పెరుగుతూ ఉంటుంది. అలా జరిగే సమయంలో అత్యంత పొడవైన రాత్రి ప్రతీ ఏడాది డిసెంబర్ 21న వస్తుంది. ఈ రోజున పగలు అత్యంత తక్కువ సమయం ఉండబోతుందని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు.
అత్యంత పొడవైన పగలూ ఉంది :
ఏడాదిలో అత్యంత పొడవైన రాత్రి డిసెంబర్ 21 అంటే ఈరోజున వస్తే పొడవైన పగలు 6 నెలల తర్వాత వస్తుంది. అదే జూన్ 21. ఆరోజున భూమి కి సూర్యుడు దగ్గరగా ఉంటాడు.
డిసెంబర్ 21న పుట్టిన మాజీ సీయం జగన్
తెలుగు వాళ్లకు సంబంధించి డిసెంబర్ 21కి మరో విశేషం ఉంది. ఏపీ మాజీ సీఎం, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజే పుట్టారు. 1972 డిసెంబర్ 21న జన్మించిన ఆయన చిన్న వయస్సులోనే ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయినా తిరిగి ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
డిసెంబర్ 21న పుట్టిన నటి తమన్నా
స్టార్ హీరోయిన్ తమన్నా కూడా ఈరోజునే (1989 డిసెంబర్ 21) పుట్టింది. చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ (2005) ఇచ్చిన తమన్నా 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకుంది. వరకు 85 సినిమాల్లో నటించిన తమన్నా త్వరలో " ఓదెల 2 " తో అఘోరీగా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనుంది.