India Covid Cases: దేశంలో తగ్గుతోన్న యాక్టివ్ కేసుల సంఖ్య.. 197 రోజుల తర్వాత ఇదే కనిష్టం..
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 24,354 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. నిన్న దేశవ్యాప్తంగా 14.29 లక్షల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఈ మేరకు వెల్లడైందని ఐసీఎంఆర్ తెలిపింది.
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఊరట కలిగించే అంశంగా ఉంది. 197 రోజుల తర్వాత ఈరోజు యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గడం విశేషం. దేశవ్యాప్తంగా వరుసగా నాలుగో రోజు 20 వేలకు పైబడి కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 24,354 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. నిన్న దేశవ్యాప్తంగా 14.29 లక్షల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఈ మేరకు వెల్లడైందని ఐసీఎంఆర్ తెలిపింది. నిన్నటితో పోలిస్తే (26,727) కోవిడ్ కేసుల సంఖ్య 2 వేల వరకు (8.8 శాతం) తగ్గింది.
కొత్త కేసుల సంఖ్య కంటే రికవరీలు అధికంగా ఉండటం ఊరట కలిగించే అంశం. గడిచిన 24 గంటల్లో 25,455 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు రికవరీల సంఖ్య 3.30 కోట్లకు చేరింది. కోవిడ్ రికవరీ రేటు 97.86 శాతానికి చేరింది. క్రియాశీల రేటు కూడా 0.81 శాతానికి తగ్గింది. కోవిడ్ మహమ్మారి కారణంగా గత 24 గంటల వ్యవధిలో 234 మంది మరణించారు. దీంతో కోవిడ్ మరణాల సంఖ్య 4,48,573కి పెరిగింది. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగిరంగా సాగుతోంది. నిన్న 69.33 లక్షల మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటివరకు దేశంలో పంపిణీ చేసిన కోవిడ్ డోసుల సంఖ్య 89.74 కోట్లకు చేరిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
యాక్టివ్ కేసులు: 2,75,224
మొత్తం కేసులు: 3,37,66,707
మొత్తం రికవరీలు : 3,30,68,599
కోవిడ్ మరణాల సంఖ్య: 4,48,339
మొత్తం వ్యాక్సినేషన్ల సంఖ్య : 89,74,00,000 (అంచనా)
COVID-19 Testing Update. For more details visit: https://t.co/dI1pqvXAsZ @MoHFW_INDIA @DeptHealthRes @PIB_India @mygovindia @COVIDNewsByMIB #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 #Unite2FightCorona pic.twitter.com/15VIJgQvkQ
— ICMR (@ICMRDELHI) October 2, 2021
Also Read: మళ్లీ టాటా చేతిలోకి ఎయిర్ ఇండియా!.. ఖండించిన ప్రభుత్వం
Also Read: స్వచ్ఛ భారత్ మిషన్ -2.0కు ప్రధాని మోదీ శ్రీకారం..ఇదే లక్ష్యం!