By: Ram Manohar | Updated at : 24 Dec 2022 01:22 PM (IST)
విదేశీ ప్రయాణికులకు RT PCR టెస్ట్‌లు తప్పనిసరి చేస్తూ కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Covid-19 Surge:
ఆ ఐదు దేశాల ప్రయాణికులపై నిఘా..
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియా ఈ మేరకు అధికారిక ఓ ప్రకటన చేశారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంగ్‌కాంగ్, థాయ్‌లాండ్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా RT PCR టెస్ట్‌లు చేయాలని ఆదేశించారు. అన్ని విమానాశ్రయాల్లోనూ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ ప్రయాణికుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలున్నా...పాజిటివ్ అని తేలినా వెంటనే క్వారంటైన్ చేయాలని స్పష్టం చేశారు. ఈ దేశాల నుంచి వచ్చే వాళ్లు తప్పనిసరిగా Air Suvidh ఫామ్‌లలో ప్రస్తుత ఆరోగ్య స్థితికి సంబంధించిన అన్ని వివరాలు తెలియ జేయాలని కేంద్రం వెల్లడించింది.
Covid19 | Air Suvidha form filling to declare current health status to be made compulsory for international passengers arriving from China, Japan, South Korea, Hong Kong and Thailand pic.twitter.com/tX4Yrr6j4U
— ANI (@ANI) December 24, 2022
RT-PCR test to be mandatory for international arrivals from China, Japan, S. Korea, Hong Kong & Thailand. On arrival, if any passenger from these countries is found symptomatic or tests positive for Covid19, then he/she will be put under quarantine: Union Health Min Dr Mandaviya pic.twitter.com/QOXNnu0LRV
— ANI (@ANI) December 24, 2022
కరోనా జాగ్రత్తల్లో భాగంగా...కేంద్రఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ మరోసారి అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల్లోని పరిస్థితులను సమీక్షించారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF.7 భారత్‌లోనూ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే నలుగురు ఈ వైరస్ బారిన పడ్డారు. కేంద్రం సహా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై యుద్ధానికి మరోసారి సిద్ధమయ్యాయి. ఈక్రమంలోనే అధికారులతో సమావేశం నిర్వహించిన ఆరోగ్య మంత్రి కీలక ఆదేశాలిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా రాష్ట్రాల ఆరోగ్య మంత్రులకు పలు సూచనలు చేశారు. కరోనా మార్గదర్శకాలు విడుదల చేశారు. అన్ని రాష్ట్రాలకూ లేఖ కూడా రాశారు. రానున్న రోజుల్లో పండుగలు వస్తున్నందున అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీంతో పాటు కరోనా పరీక్షల సంఖ్యనూ పెంచాలని చెప్పారు. టెస్టింగ్, ట్రీట్మెంట్, ట్రేసింగ్ ఫార్ములాను మరోసారి అనుసరించాలని స్పష్టం చేశారు. ప్రజలందరూ ప్రికాషన్ డోస్ తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపించాలని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం సహా భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని వెల్లడించారు.
Leh Manali Highway: రికార్డు సమయంలో అందుబాటులోకి కశ్మీర్ రహదారులు, కారణం ఏంటంటే!
Visakha G20 Summit : ఈ నెల 28, 29న విశాఖలో జీ20 సదస్సు, హాజరుకానున్న 69 మంది విదేశీ ప్రతినిధులు
TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో 15 మంది అరెస్ట్, ప్రవీణ్ ఇంట్లో నగదు స్వాధీనం
Covid19 Cases: కొవిడ్ కేసుల పెరుగుదలతో ఏపీ అలర్ట్ - తెలంగాణను భయపెడుతున్న H3N2 కేసులు
ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!
Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!