Divorce Case: పిల్లాడికి పేరు దగ్గర గొడవలు - విడాకుల కోసం కోర్టుకెళ్లిన జంట - జడ్జి ఇలా పరిష్కరించేశారు !
Mysuru Court: అబ్బాయే పుడతాడు నేను అనుకున్న పేరే పెడతాను అని మైసూర్లోని ఆ జంట ఎవరికి వారు అనుకుంటూ వచ్చారు. వారనుకున్నట్లుగా అబ్బాయి పుట్టాడు కానీ.. విడాకుల కోసం కోర్టుకెళ్లారు.
Couples 2 Year Divorce Case Ends With Mysuru Court Naming Their Son: ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవడం చాలా కష్టం కానీ విడిపోవడం మాత్రం చాలా సులభం. పెళ్లి చేసుకోవడానికి సవాలక్ష రూల్స్ పెట్టుకుంటారు..అన్నీ మ్యాచ్ అయితే పెళ్లి చేసుకుంటారు. కానీ పెళ్లి అయిన తర్వాత ఏ ఒక్కడి తేడా వచ్చినా పోలోమని విడాకులకు వెళ్లిపోతున్నారు. ఎంత చిన్న చిన్న కారణాలతో విడాకులకు వెళ్తున్నారో మైసూరులో కోర్టులోని ఈ కేసే ఉదాహరణ.
మైసూరు కోర్టులో రెండేళ్ల కిందట నుంచి ఓ కేసు వాదనలకు వస్తోంది. ఆ కేసులో ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకుని కోర్టుకు వచ్చారు. వాదనల్లో అసలు మీ సమస్య ఏమిటి.. ఎందుకు విడిపోవడం అంటూ జడ్జి ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పారు. తాము పెళ్లి చేసుకున్నామని అన్యోన్యంగా ఉన్నామన్నారు. తమకు అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఓ బిడ్డ కూడా పుట్టారని అన్నారు. అయితే అక్కడే అసలు సమస్య వచ్చిందన్నారు. బిడ్డకు తనకు ఇష్టమైన పేరు పెట్టారని ఆ భర్త.. లేదు తాను ఎప్పుడో అనుకున్నానని భార్య ఇద్దరూ వాదులాడుకోవడం ప్రారంభించారు. ఇద్దరూ రాజీపడటానికి సిద్దపడలేదు. చివరికి విడిపోవాలనుకున్నారు. విడిపోయిన తరవాత న్యాయస్థానం బిడ్డ సంరక్షణ సహజంగా తల్లికే ఇస్తుంది కాబట్టి తాను పేరు పెట్టుకుంటానని ఆ భార్య భావించి విడాకుల కోసం కోర్టులో పిటిషన్ వేసింది. భార్య వద్దనుకుంటే తనకు మాత్రం ఎందుకని ఆ భర్త కూడా రెడీ అయ్యాడు.
Also Read: మంత్రగాడి మాట విని బతికున్న కోడిపిల్లను మింగేశాడు - ఊపిరాడక ప్రాణాలు వదిలాడు, ట్విస్ట్ ఏంటంటే?
ఇద్దరూ రాజీ పడతారేమోనని కేసు విచారణను రెండేళ్ల పాటు కొనసాగించారు మైసూరు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి. తమ ఎదుటకు చాలా విడాకులు కేసులు వస్తాయి కానీ ఇలాంటి కేసు మాత్రం అరుదైనదని న్యాయమూర్తి భావించారు. అయితే ఈ కారణంగా వారికి విడాకులు మంజూలు చేయాలని ఆయనకు అనిపించలేదు. అందుకే మనుసు మార్చుకుంటారేమోనని విచారణ సాగించారు. అయితే రెండేళ్ల తర్వాత కూడా వారు అదే మాట మీద ఉన్నారు. ఇక లాభం లేదని న్యాయమూర్తి కల్పించుకున్నారు. ఇరువురు పేర్లు కాదని న్యాయస్థానమే బిడ్డకు పేరు పెడుతుందని కలిసి ఉండాలని స్పష్టం చేశారు. దానికి ఆ జంట అంగీకరించారు.