Congress President Polls: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోరు- ఆ మూడవ నేత ఎవరంటే?
Congress President Polls: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. వారెవరంటే?
Congress President Polls: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. అధ్యక్ష ఎన్నికలకు మొత్తం ముగ్గురు నేతలు నామినేషన్ దాఖలు చేశారు. అయితే సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ మధ్యే పోటీ ఉండే అవకాశం ఉంది. వీరితో పాటు ఝార్ఖండ్‌కు చెందిన నాయకుడు కేఎన్ త్రిపాఠి కూడా నామినేషన్ దాఖలు చేశారు.
అట్టహాసంగా
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలోకి సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన మల్లికార్జున ఖర్గే అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసేటప్పుడు ఆయన వెంట కాంగ్రెస్ సీనియర్ నేతలు అశోక్ గహ్లోత్, ఆనంద్ శర్మ, దిగ్విజయ్ సింగ్ సహా పలువురు కీలక నేతలు ఉన్నారు. అశోక్ గహ్లోత్, దిగ్విజయ్ సింగ్ వంటి నేతలు ఆయనను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తున్నట్లు సంతకాలు చేశారు.
#CongressPresidentElection | Senior Congress leader & LoP Rajya Sabha Mallikarjun Kharge files his nomination for the post of Congress president pic.twitter.com/ru2iWNMmzR
— ANI (@ANI) September 30, 2022
థరూర్
తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ అంతకుముందు నామినేషన్ దాఖలు చేశారు. తాను ఎవరికీ పోటీగా బరిలోకి దిగలేదని పార్టీపై ప్రేమతోనే ఇది చేస్తున్నట్లు శశిథరూర్ అన్నారు.
We're not enemies/rivals, we're colleagues & we're interested in seeing party going forward... LoP RS Mallikarjun Kharge is the 'Bhishma Pitamah' of our party. Let party workers decide how to proceed. I won't say anything negative about Kharge, Digvijaya Singh, Tripathi: Tharoor pic.twitter.com/ex0eMduKkf
— ANI (@ANI) September 30, 2022
చివరిలో
ఝూర్ఖండ్‌కు చెందిన సీనియర్ నేత కేఎన్ త్రిపాఠీ కూడా పార్టీ అధ్యక్ష రేసులోకి వచ్చారు. ఆయన మాజీ మంత్రి. గతంలో ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్.. జాతీయ అధ్యక్షుడిగా పని చేశారు.
Also Read: Jail Tourism Uttarakhand: జైల్లో ఒకరాత్రి గడపాలనుందా? రూ.500 ఇవ్వండి పనైపోతుంది!
Also Read: Harsh Goenka: ఇందుకే ఆఫీసుకు రమ్మనేది- మీకు అర్థమవుతోందా?