అన్వేషించండి

DMKతోనూ కాంగ్రెస్‌కి విభేదాలు? ఆ మంత్రి వ్యాఖ్యలతో దుమారం

INDIA Bloc: కాంగ్రెస్‌ పని అయిపోయిందంటూ డీఎమ్‌కే మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

INDIA Bloc Disputes: I.N.D.I.A కూటమిలోని ఒక్కో పార్టీ కాంగ్రెస్‌ వరుస పెట్టి విమర్శలు సంధిస్తున్నాయి. ఇప్పటికే జేడీయూ ఏకంగా బీజేపీతో పొత్తుకి సిద్ధమైంది. అటు ఆప్ కూడా కాంగ్రెస్‌కి దూరంగానే ఉంటుంది. తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితీ ఇంతే. ఇప్పుడు మరో కీలక పార్టీ అయిన DMK కాంగ్రెస్‌పై అసహనం వ్యక్తం చేసింది. కేవలం తమ స్వార్థం కోసం మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తోందంటూ డీఎమ్‌కే మంత్రి ఒకరు తీవ్ర విమర్శలు చేయడం సంచలనమవుతోంది. ఆ పార్టీకి మునుపు ఉన్న బలం లేదని, ఎప్పుడో బలహీనపడిపోయిందని స్పష్టం చేశారు డీఎమ్‌కే మంత్రి రాజా కన్నప్పన్. ఇది కేవలం ఆయన ఒక్కరి అభిప్రాయమా..? లేదంటే నిజంగానే డీఎమ్‌కే, కాంగ్రెస్ మధ్య విభేదాలు తలెత్తాయా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. 

"కాంగ్రెస్ కేవలం తన స్వార్థమే చూసుకుంటోంది. కేవలం సీట్‌లు గెలుచుకోవాలనే ఉద్దేశంతోనే పార్టీని నడుపుతోంది. దీని వల్ల ఏం ఉపయోగం..? ఓ ఐడియాలజీతో ఉండాలి. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఏమీ లేకుండా పోటీ చేస్తానంటే ఎలా..? ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఆ పార్టీకి అన్నీ గుర్తొస్తాయి. ఈ ఫార్ములా పెద్దగా వర్కౌట్ అవ్వదు. ప్రజలు కూడా హర్షించరు. బీజేపీ చాలా చరిత్ర ఉన్న పార్టీయే కావచ్చు. కానీ అప్పటంత బలం ఇప్పుడు లేదు"

- రాజా కన్నప్పన్, డీఎమ్‌కే మంత్రి

స్టాలిన్ ఏమంటున్నారు..?

అటు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎమ్‌కే చీఫ్ ఎమ్‌కే స్టాలిన్ మాత్రం కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఎవరూ కూటమిలో అనవసరమైన విభేదాలు సృష్టించొద్దని నేతలకు సూచిస్తున్నారు. దీని వల్ల ఓట్లు చీలిపోయి బీజేపీకే మేలు జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. 

దూరం..దూరం..

సీట్ల కేటాయింపు(Seats allocation) అంశం మా వ్య‌క్తిగ‌తం. వేరే పార్టీ వారు మాకు ఆఫ‌ర్ ఇవ్వ‌డం ఎందుకు?  మాతో చ‌ర్చిస్తే అప్పుడు ఆలోచిస్తాం అని ఇప్పటికే మ‌మ‌తా బెన‌ర్జీ(Mamatha benarjee) తెగేసి చెప్పారు. అనంత‌రం వెంట‌నే ఆమె మాట మార్చి.. తాము ఒంట‌రిగానే బ‌రిలో దిగుతున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. కాగా, బెంగాల్‌ రాష్ట్రంలో మొత్తం 47 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. వీటిలో క‌నీసం 10 స్థానాల్లో పోటీ చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కానీ, మ‌మ‌తా బెన‌ర్జీ మాత్రం రెండు క‌న్నా ఎక్కువ సీట్లు ఇచ్చే ప‌రిస్థితి లేదు. దీంతో ఈ దిశగా కొన్నాళ్ల నుంచి వివాదం ర‌గులుతూనే ఉంది. ఇప్పుడు ఈ వివాదం  మ‌రింత పెరిగి, చివ‌ర‌కు సీఎం బెన‌ర్జీ ఒంట‌రి పోరును ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఇండియా కూట‌మిలో ఉన్న మ‌రో పార్టీ  ఆమ్ ఆద్మీ(Aaam Aaadmi Party). ఢిల్లీ(Delhi), పంజాబ్‌(Punjab)ల‌లో అధికారంలో ఉన్న ఈ పార్టీ కూడా తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్(Bhagawanth mann) సీట్ల షేరింగ్‌పై మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 13 పార్ల‌మెంటు స్థానాల్లోనూ తామే(ఆప్) ఒంట‌రిగా పోటీ చేయ‌నున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. అంతేకాదు.. అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ కూడా తుది ద‌శ‌కు చేరుకుంద‌ని సీఎం మాన్ చెప్పారు.

Also Read: Lok Sabha Election 2024: హ్యాట్రిక్‌పై గురి పెట్టిన మోదీ షా, రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ల నియామకం

టాప్ హెడ్ లైన్స్

Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Kranti Gaud Record:  క్రాంతి గౌడ్ అరుదైన ఘ‌న‌త‌.. జులన్ గోస్వామి ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు, ఇంగ్లాండ్ ను వణికించిన 22 ఏళ్ల నయా స్పీడ్‌స్టర్! ప‌ట్టుబిగించిన టీమిండియా
క్రాంతి గౌడ్ అరుదైన ఘ‌న‌త‌.. జులన్ గోస్వామి ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు, ఇంగ్లాండ్ ను వణికించిన 22 ఏళ్ల నయా స్పీడ్‌స్టర్! ప‌ట్టుబిగించిన టీమిండియా
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget