ప్రధాని మోదీపై ఈసీకి ఫిర్యాదు, ఎన్నికల నిబంధన ఉల్లంఘించారని ఆరోపణ
PM Modi: ఎన్నికల నిబంధన ఉల్లంఘించారంటూ ప్రధాని మోదీపై ఈసీకి ఓ లాయర్ ఫిర్యాదు చేశారు.
Complaint on PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల కోడ్‌ని (Lok Sabha Elections 2024) ఉల్లంఘించారని ఓ ఢిల్లీ లాయర్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నిబంధనల్ని పట్టించుకోకుండా మోదీ ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ప్రసంగిస్తున్నారంటూ లేఖ రాశారు. హిందూ దేవతలు, పుణ్యక్షేత్రాల పేర్లు చెప్పి ఓట్లు అడుగుతున్నారని ఆ లేఖలో ప్రస్తావించారు. కొన్ని చోట్ల సిక్కుల పుణ్యక్షేత్రాల పేర్లనూ ప్రస్తావించి ఆ వర్గం ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ గెలవాలని పూజలు చేయాలని ఓటర్లకు పిలుపునివ్వడాన్నీ తప్పుబట్టారు. గతంలోనూ ప్రధాని మోదీపై (PM Modi) ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. ఉద్దవ్ బాల్ థాక్రే శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ కూడా ప్రధాని మోదీపై ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల Model Code of Conduct అమల్లోకి వచ్చిన తరవాత కూడా ఆయన తన ఆఫీస్‌ని ఎన్నికల ప్రచారం కోసం వినియోగించుకున్నారని మండి పడ్డారు. ప్రజా వనరుల్ని వినియోగించుకుని ప్రచారం చేసి ఉంటే ఆ మేరకు మోదీకి కచ్చితంగా బిల్లు పంపించాలని డిమాండ్ చేశారు.
మోదీపైనే కాదు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మపైనా (Himanta Biswa Sarma) ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల ప్రచారంలో రేషన్ కార్డ్ హోల్డర్స్‌కి డబ్బులు పంచుతామని ప్రకటించారని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ని ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు. అసోం కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ అభ్యర్థి ప్రద్యుత్ బొర్దొలాయ్ ఈ కంప్లెయింట్ ఇచ్చారు. ఎన్నికల తరవాత రేషన్ కార్డ్‌లు ఉన్న వాళ్లందరికీ రూ.10 వేల నగదు అందిస్తామని చెప్పారని, ఇది ఎన్నికల నిబంధనకు విరుద్ధం అని మండి పడ్డారు.