అన్వేషించండి

Arvind Kejriwal: బీజేపీ ఆఫీస్‌కి వస్తాం, ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చేయండి - కేజ్రీవాల్ సవాల్

Arvind Kejriwal: బిభవ్ కుమార్ అరెస్ట్‌పై తీవ్రంగా స్పందించిన అరవింద్ కేజ్రీవాల్‌ తాము అంతా కలిపి బీజేపీ ఆఫీస్‌కి వస్తామని ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చూస్తామని సవాల్ విసిరారు.

Arvind Kejriwal Challenges BJP: ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ దాడి కేసు అక్కడి రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన సహాయకుడు బిభవ్ కుమార్‌పై కుట్ర చేసి అరెస్ట్ చేయించారంటూ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా మండి పడ్డారు. ఇదంతా బీజేపీ కుట్ర అని ఆరోపించారు. బీజేపీ పదేపదే ఆప్‌ని వెంటాడుతోందని అసహనం వ్యక్తం చేశారు. ఏం చేసినా తమ పార్టీని అణిచివేయలేరని తేల్చి చెప్పారు. ఇప్పటికే సంజయ్‌ సింగ్‌ని జైల్‌లో పెట్టిన బీజేపీ ఇప్పుడు బిభవ్‌ కుమార్‌పై కక్ష కట్టిందని మండి పడ్డారు. ఈ క్రమంలోనే ఆయన సవాల్ విసిరారు. బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌కి అంతా కలిసి వస్తామని, ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చూస్తానంటూ ఛాలెంచ్ చేశారు. Jail Bharo కార్యక్రమానికి పిలునిచ్చారు. రేపు (మే 19న) మధ్యాహ్నం 12 గంటలకు అంతా కలిసి బీజేపీ ఆఫీస్‌కి వెళ్తామని స్పష్టం చేశారు.  

"బీజేపీ ఆప్‌ వెంట ఎలా పడుతోందో గమనిస్తూనే ఉన్నారు. ప్రధాని మోదీ మాతో జైల్‌ కా ఖేల్‌ ఆడుతున్నారు. అందుకే రేపు బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌కి మా పార్టీలోని కీలక నేతలతో కలిసి వస్తాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వస్తారు. మీరు ఎంత మందిని అరెస్ట్ చేస్తారో, ఎంత మందిని జైలుకి పంపుతారో చూస్తాం" 

- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి 

వరుస అరెస్ట్‌లు తప్పవేమో: కేజ్రీవాల్

బిభవ్ కుమార్ అరెస్ట్‌పైనా స్పందించారు కేజ్రీవాల్. ఇప్పటికే సంజయ్‌ సింగ్‌ని జైలుకి పంపిన బీజేపీ ఆ తరవాత రాఘవ్ చద్దాని అరెస్ట్ చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆయన లండన్ నుంచి రాగానే అరెస్ట్ చేసే అవకాశముందని అన్నారు. తరవాత అతిషితో పాటు సౌరభ్ భరద్వాజ్‌ని కూడా జైలుకి పంపుతారని మండి పడ్డారు. తాము ఏం నేరం చేశామని బీజేపీ ఇలా అరెస్ట్‌లు చేయిస్తోందో చెప్పాలని ప్రశ్నించారు.

"బీజేపీ మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసిందో అర్థం కావడం లేదు. ఎందుకు అరెస్ట్ చేస్తుందో తెలియడం లేదు. మేం చేసిన తప్పేంటి..? ప్రభుత్వ ఆసుపత్రులను, బడుల్ని బాగు చేయించనందుకా ఇదంతా. వాళ్లు ఈ మాత్రం అభివృద్ధి కూడా చేయలేకపోతున్నారు. 24 గంటల పాటు విద్యుత్ అందిస్తున్నాం. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పని చేయలేదు"

- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి

Also Read: Priyanka Gandhi: రాహుల్‌తో పాటు నేనూ పోటీ చేసుంటే బీజేపీకి ప్లస్ అయ్యేది - ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kamala Harris: చిన్నప్పుడు ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్
ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్
Janasena: వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
Kanguva Movie: తెలుగు సినిమాల బాటలో ‘కంగువా’, తెల్లవారుజాము నుంచే షోలు షురూ!
తెలుగు సినిమాల బాటలో ‘కంగువా’, తెల్లవారుజాము నుంచే షోలు షురూ!
Kadiyam Srihari: వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి కేటీఆర్‌? అందుకే కవిత జైలుకు: కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు
వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి కేటీఆర్‌? అందుకే కవిత జైలుకు: కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్‌కు కొత్త ప్రత్యర్థి, డ్రోన్లతో వరుసగా దాడులు!‘సుప్రీం జడ్జినే చంపేశారు, చేతకాని పాలకుడు చెత్తపన్ను వేశాడు’వీడియో: చంద్రబాబుకు ముద్దు పెట్టాలని మహిళ ఉత్సాహంParvathipuram Elephants Hulchul | భవన నిర్మాణ కార్మికులను వణికించిన ఏనుగులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kamala Harris: చిన్నప్పుడు ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్
ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్
Janasena: వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
Kanguva Movie: తెలుగు సినిమాల బాటలో ‘కంగువా’, తెల్లవారుజాము నుంచే షోలు షురూ!
తెలుగు సినిమాల బాటలో ‘కంగువా’, తెల్లవారుజాము నుంచే షోలు షురూ!
Kadiyam Srihari: వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి కేటీఆర్‌? అందుకే కవిత జైలుకు: కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు
వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి కేటీఆర్‌? అందుకే కవిత జైలుకు: కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు
Free Gas Cylinder: ఉచితంగా గ్యాస్ సిలిండర్‌ పొందాలంటే ఈ విషయాలు తెలుసుకోండి, అలా చేస్తేనే నగదు జమ
ఉచితంగా గ్యాస్ సిలిండర్‌ పొందాలంటే ఈ విషయాలు తెలుసుకోండి, అలా చేస్తేనే నగదు జమ
Morning Drink : పరగడుపునే ఈ కషాయం తాగితే చాలా మంచిదట.. షుగర్, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతాయట
పరగడుపునే ఈ కషాయం తాగితే చాలా మంచిదట.. షుగర్, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతాయట
Sabarimala News: శబరిమల యాత్రికులకు శుభవార్త, రూ.5 లక్షల ఉచిత బీమా కల్పిస్తూ నిర్ణయం
శబరిమల యాత్రికులకు శుభవార్త, రూ.5 లక్షల ఉచిత బీమా కల్పిస్తూ నిర్ణయం
Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు గ్రీన్ సిగ్నల్, కొత్తగా 5 మార్గాల్లో పనులకు జీవో జారీ
హైదరాబాద్ మెట్రో రెండో దశకు గ్రీన్ సిగ్నల్, కొత్తగా 5 మార్గాల్లో పనులకు జీవో జారీ
Embed widget