News
News
X

75th Independence Day: దేశభక్తి గీతం రాసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.... ఈ దేశం మనందరిదీ అంటూ గీతం రూపకల్పన

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓ పాట రాశారు. ఈ విషయాన్ని ఆమె తన ఫేస్ బుక్ ఖాతాలో తెలిపారు.

FOLLOW US: 

భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటుంది. దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతీ ఒక్కరు తమ దేశభక్తిని వివిధ రూపాల్లో ప్రదర్శిస్తున్నారు. దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాట రూపంలో తన దేశభక్తిని చాటుకున్నారు. ‘ఈ దేశం మనందరిదీ’ అంటూ ఓ పాట రాశారు. ఈ పాటను దీదీ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. బెంగాలీ గాయకులు ఇంద్రనీల్ సేన్, మనోమయ్ భట్టాచార్య, త్రిష పరూయి, దేవజ్యోతి ఘోష్ లు ఈ పాటను ఆలపించారని ఆమె తెలిపారు.

Also Read: Independence Day 2021: సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్టైక్స్‌తో వారికి హెచ్చరికలు పంపాం... ప్రధాని మోదీ స్పీచ్ హైలైట్స్

దుష్టశక్తులపై కలిసి పోరాడుదాం

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తాను ఈ దేశభక్తి గీతాన్ని రాశానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఎంతో ముఖ్యమైన ఈ రోజున దేశ ప్రజల ఆలోచనలతో తాను ఈ పాటను రూపొందించానని తెలిపారు. మన స్వాతంత్ర్యాన్ని దూరం చేసేందుకు ప్రయత్నించే అన్ని దుష్ట శక్తులపై కలిసి పోరాడాలని మమతా ట్వీట్ చేశారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కోల్ కతా లోని విక్టోరియా మెమోరియల్ ను 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 7 వేల 500 చదరపు అడుగుల త్రివర్ణ పతాకంతో ముస్తాబు చేశారు. ఆ జెండాను బెంగాల్ గవర్నర్ ఆవిష్కరించారు. హిమాలయ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్ ఈ భారీ తివర్ణ పతాకాన్ని రూపొందించింది. 

Also Read: AP CM Jagan Speech: 26 నెలల పాలన చూడండి.. మార్పు గమనించండి.. పంద్రాగస్టు వేదికపై నుంచి ఏపీ సీఎం జగన్ అభ్యర్థన

దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు

 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎర్రకోటపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని ప్రసంగించారు. దేశాభివృద్ధికి అన్ని ప్రాంతాలు కలుపుపోవాలన్నారు. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లతో కూడిన హిమాలయ ప్రాంతం, తీర, గిరిజన ప్రాంతాల అభివృద్ధే దేశ భవిష్యత్తని ప్రధాని అన్నారు. గ్రామాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్న ప్రధాని, గత ఐదేళ్లలో అనేక గ్రామాలకు రోడ్లు, విద్యుత్తు సదుపాయాలను విస్తరించామని తెలిపారు. ఆప్టికల్‌ నెట్‌వర్క్‌ ద్వారా గ్రామాలను సాంకేతికంగా అభివృద్ధి చేశామన్నారు.  గ్రామాల్లోనూ డిజిటల్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయన్న ప్రధాని.... ఇవి యువపారిశ్రామికవేత్తలు పుట్టుకకు నాంది అవుతున్నాయన్నారు.  

Also Read: CJI Justice NV Ramana: పార్లమెంట్ చర్చలపై సీజేఐ జస్టిస్ రమణ కీలక వ్యాఖ్యలు... విస్తృతస్థాయి చర్చలు జరగడంలేదని అసంతృప్తి

Published at : 15 Aug 2021 05:10 PM (IST) Tags: Mamata Banerjee West Bengal Abp News Independence Day 2021 Didi Song on Independence

సంబంధిత కథనాలు

Breaking News Telugu Live Updates: ప్రగతి భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కేసీఆర్

Breaking News Telugu Live Updates: ప్రగతి భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కేసీఆర్

PM Modi Speech Highlights: ఈ మార్గం చాలా కఠినం, ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం - గెలిచి చూపించాం: మోదీ

PM Modi Speech Highlights: ఈ మార్గం చాలా కఠినం, ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం - గెలిచి చూపించాం: మోదీ

Independence Day 2022: వచ్చే 25 ఏళ్లు చాలా కీలకం, పంచప్రాణాలు పెట్టాలి - ఆ ఐదు ఏంటో చెప్పిన ప్రధాని మోదీ

Independence Day 2022: వచ్చే 25 ఏళ్లు చాలా కీలకం, పంచప్రాణాలు పెట్టాలి - ఆ ఐదు ఏంటో చెప్పిన ప్రధాని మోదీ

Independence Day 2022 Live Updates: ఎర్రకోటపై స్వాతంత్య్ర వేడుకలు, జెండావందనం చేసిన ప్రధాని - మోదీ స్పీచ్ లైవ్

Independence Day 2022 Live Updates: ఎర్రకోటపై స్వాతంత్య్ర వేడుకలు, జెండావందనం చేసిన ప్రధాని - మోదీ స్పీచ్ లైవ్

Gaur Hari Das: స్వాతంత్య్ర సమరయోధుడిగా నిరూపించుకునేందుకు 32 ఏళ్లు పోరాడిన గౌర్ హరి దాస్

Gaur Hari Das: స్వాతంత్య్ర సమరయోధుడిగా నిరూపించుకునేందుకు 32 ఏళ్లు పోరాడిన గౌర్ హరి దాస్

టాప్ స్టోరీస్

Independence Day 2022: 34 ఏళ్లు బ్రిటీష్ జెండా ఎగిరిన చోటే 75 ఏళ్లుగా మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడుతోంది 

Independence Day 2022: 34 ఏళ్లు బ్రిటీష్ జెండా ఎగిరిన చోటే 75 ఏళ్లుగా మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడుతోంది 

Independence Day 2022 : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ

Independence Day 2022 : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ

Minister KTR: భారత్ ను మరే దేశంతో పోల్చలేం, ప్రతి 100 కిలోమీటర్లకు విభిన్న సంస్కృతి - మంత్రి కేటీఆర్

Minister KTR: భారత్ ను మరే దేశంతో పోల్చలేం, ప్రతి 100 కిలోమీటర్లకు విభిన్న సంస్కృతి - మంత్రి కేటీఆర్

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!