By: ABP Desam | Updated at : 12 Apr 2023 01:44 PM (IST)
సీఎం జగన్
వివిధ సంక్షేమ పథకాల ద్వారా పేద మహిళలకు ఆర్థిక చేయూత అందిస్తూ వారి బాగుకోసం పాటు పడుతున్నామని సీఎం జగన్ అన్నారు. తాను అందిస్తున్న ఆర్థిక సాయం ద్వారా అక్కచెల్లెమ్మలు ఎదగాలని ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. చిరునవ్వుతో కుటుంబాన్ని నడిపిస్తున్న గొప్ప వ్యక్తులు మహిళలు అని అన్నారు. అలాంటి అక్కచెల్లెమ్మలకు సెల్యూట్ చేస్తున్నానని, వీరికి భరోసా ఇచ్చే కార్యక్రమం ఈబీసీ నేస్తం అని అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఎస్వీకేపీ డిగ్రీ కాలేజీ మైదానంలో బుధవారం (ఏప్రిల్ 12) బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ బటన్ నొక్కి నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.
జగనన్న ఈబీసీ నేస్తం ద్వారా 45 నుండి 60 ఏళ్లలోపు వయసు ఉన్న ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద మహిళలకు సీఎం జగన్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో రూ.15 వేలు జమ చేశారు. ఇలా ఇప్పటిదాకా మూడేళ్లలో మొత్తం రూ.45 వేలు ఆర్థిక సాయం చేసినట్లయింది. నేడు ఖాతాల్లోకి బదిలీ చేసిన సొమ్ము మొత్తం రూ.658.60 కోట్లు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు ఈబీసీ నేస్తం ద్వారా అందించిన మొత్తం సాయం రూ.1,257.04 కోట్లు.
ముసలాయన పాలనలో ఇది జరిగిందా - సీఎం
సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘46 నెలల్లో 2.07 లక్షల కోట్లు డీబీటీ ద్వారా లబ్ధిదారులకు అందించాం. మహిళల సాధికారిత కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాం. మహిళలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఎన్నికల ముందు మేం హామీ ఇవ్వలేదు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌పై చట్టం చేశాం. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి. చంద్రబాబు హయాంలో ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయా? చంద్రబాబు అనే ముసలాయన పాలనలో ఒక్క రూపాయి అయినా మీ ఖాతాల్లో జమ అయిందా? ముసలాయన పాలనలో ఎవరు పంచుకున్నారు? ఎవరు దోచుకున్నారు, ఎవరు తిన్నారు ఆలోచన చేయండి’’ అని సీఎం అన్నారు.
ఇప్పడు ఎక్కడబడితే అక్కడ ఫోటోలు దిగుతూ చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ అంటున్నారని సీఎం జగన్ విమర్శించారు. టిడ్కో ఇళ్ల వద్దకు వెళ్లి ఫోటోలు దిగుతున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక, ఏకంగా 2 లక్షల కోట్లకు పైగా సొమ్ము డీబీటీ విధానం ద్వారా వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశామని గుర్తు చేశారు. మరి చంద్రబాబు హాయాంలో ఆ డబ్బు అంతా ఏమైందో అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికీ జరిగిన మంచి ఎంత అనేది బేరీజు వేసుకొనే సత్తా నీకు ఉందా చంద్రబాబు అని నిలదీశారు. ఈ నిజాలు మనిషి మనిషికీ తెలుసని అన్నారు.
ఇలాంటి చంద్రబాబు ఇంటింటికీ స్టిక్కర్ వేయడానికి అర్హుడా అని ప్రశ్నించారు. ఇళ్ల ముందు సెల్ఫీ దిగే నైతికత గానీ, స్టిక్కర్ అతికించే అర్హత కానీ చంద్రబాబు ఉందా అని అక్కచెల్లెమ్మలు ప్రశ్నించాలని సీఎం జగన్ అన్నారు.
Delhi Excise Policy Case: మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు- సుప్రీంకు వెళ్లేందుకు సిద్ధం!
Hyderabad News: హైదరాబాద్‌లోని ఓ పబ్ వైల్డ్ ఆలోచనపై విమర్శలు- అధికారులు, నెటిజన్లు ఆగ్రహం
Jubilant Pharmova: జర్రున జారిన జూబిలెంట్ ఫార్మోవా, నష్టం నెత్తికెక్కితే రిజల్ట్ ఇలాగే ఉంటది
Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారం
Latest Gold-Silver Price Today 30 May 2023: కొండ దిగుతున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
మెగాస్టార్ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ
ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల
SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?
Balakrishna IQ Trailer : బాలకృష్ణ విడుదల చేసిన 'ఐక్యూ' ట్రైలర్ - అసలు కాన్సెప్ట్ ఏమిటంటే?