అన్వేషించండి

CM Jagan Christmas Celebrations: కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ - ముగిసిన కడప జిల్లా పర్యటన

CM Jagan: కడప జిల్లాలో సీఎం జగన్ 3 రోజుల పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా పులివెందులలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

CM Jagan Christmas Celebrations With Family Members: సీఎం జగన్ (CM Jagan) కడప (Kadapa) జిల్లా పర్యటన ముగిసింది. ఆయన కడప ఎయిర్ పోర్ట్ నుంచి గన్నవరానికి బయల్దేరారు. ఈ ఉదయం పులివెందులలోని (Pulivendula) సీఎస్ఐ (CSI Church) చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం జగన్, ఆయన తల్లి విజయమ్మ (Vijayamma) కేక్ కట్ చేశారు. 2024 నూతన సంవత్సర క్యాలెండర్ (New Calendar)ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సీఎం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పులివెందుల పర్యటన ముగించుకుని మైదుకూరు వెళ్లారు. అక్కడ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ దస్తగిరి కుమారుడు, కుమార్తెల వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. 

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

3 రోజుల పర్యటనలో భాగంగా సీఎం జగన్ కడప జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పులివెందులలోని సింహాద్రిపురంలో నూతనంగా నిర్మించిన రోడ్డు వెడల్పు సుందరీకరణ పనులు, వైఎస్సార్ పార్కు, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎంపీడీవో కార్యాలయాలను ప్రారంభించారు. పులివెందుల నియోజకవర్గం అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. కాగా, సింహాద్రిపురం మండల కేంద్రంలో రూ.11.6 కోట్లతో రోడ్ల సుందరీకరణ, రూ.5.5 కోట్లతో 1.5 ఎకరాల్లో వైఎస్సార్ పార్కును సుందరీకరించారు. ఇందులో ఎంట్రీలో ప్లాజా వాటర్ ఫౌండేషన్, చిన్న పిల్లల ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, వైఎస్సార్ విగ్రహాలను అందంగా ఏర్పాటు చేశారు. రూ.3.19 కోట్ల PADA నిధులతో నిర్మించిన తహసీల్దార్ ఆఫీస్, రూ.2 కోట్లతో న్యూ పోలీస్ స్టేషన్, రూ.3.16 కోట్లతో నిర్మించిన ఎంపీడీవో ఆఫీసును సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా పులివెందుల నేతలతో భేటీ అయిన సీఎం వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిచేలా కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ స్థానికంగా పర్యటించి, ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. అంతకు ముందు ఇడుపులపాయలోని దివంగత నేత వైఎస్సార్ ఘాట్ కు వెళ్లి నివాళులర్పించారు. ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

గుంటూరు పర్యటన

సీఎం జగన్ ఈ నెల 26న (మంగళవారం) గుంటూరులో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గుంటూరు శివారు నల్లపాడు చేరుకుంటారు. అక్కడ లయోలా పబ్లిక్ స్కూల్ లో ఏర్పాటు చేసిన 'ఆడుదాం ఆంధ్రా' క్రీడా పోటీలను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని సీఎంవో కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Also Read: Tadipatri MLA: తాడిపత్రిలో కరపత్రాల కలకలం! అందులో ఎమ్మెల్యే కేతిరెడ్డిపై సంచలన ఆరోపణలు

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Vikkatakavi Series : న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Vikkatakavi Series : న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
HMD Fusion: ఈ స్మార్ట్ ఫోన్ బట్టలు మార్చేయచ్చు - స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌తో వచ్చిన హెచ్‌ఎండీ ఫ్యూజన్!
ఈ స్మార్ట్ ఫోన్ బట్టలు మార్చేయచ్చు - స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌తో వచ్చిన హెచ్‌ఎండీ ఫ్యూజన్!
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Tata Sierra EV: టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Embed widget