అన్వేషించండి

Krishna Water Row : కృష్ణా జలాల సమస్య పరిష్కారానికి తెలుగు రాష్ట్రాలకు సీజేఐ ఎన్వీ రమణ కీలక సూచనలు..!

కృష్ణా జలాల విషయంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ ధర్మాసనం విచారణ జరిపింది. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాల న్యాయవాదులకు సలహా ఇచ్చింది.

కృష్ణా జలాల వివాదంలో  మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. తెలంగాణ సర్కార్ అన్ని రకాల చట్టాలను ఉల్లంఘించి నీటిని  కరెంట్ ఉత్పత్తికి వినియోగిస్తున్నారని..   కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్టు పరిధిని వెంటనే నోటిఫై చేయాలని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. తెలంగాణ ప్రభుత్వం జూన్ 28న జారీ చేసిన కరెంట్ ఉత్పత్తి జీవోను రద్దు చేయాలని కోరారు.  ఏపీకి న్యాయమైన వాటాకు తెలంగాణ ప్రభుత్వం గండికొడుతుందని ఏపీ సర్కార్ పిటిషన్‌లో ఆరోపించింది. ఈ పిటిషన్‌పై విచారణ ఈ రోజు చీఫ్ జస్టిస్ బెంచ్ మీద విచారణ జరిగింది. విచారణ సందర్భంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ వాదనలు తాము వినిపించాయి. 

కేంద్ర ప్రభుత్వం..  ఇప్పటికే కృష్ణాబోర్డును నోటిఫై చేసినందున విచారణ అవసరం లేదని తెలంగాణ సర్కార్ వాదించింది. అయితే...  కేంద్రం జారి చేసిన గెజిట్ అక్టోబర్‌ నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి...  అప్పటి వరకూ నీటిని నష్టపోవడానికి ఏపీ సిద్ధంగా లేదని.. తక్షణం గెజిట్ అమలు చేస్తే తమకు అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం మరో ధర్మాసనం ముందుకు రానుంది. తాను రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినని.. అలాగే గతంలో కృష్ణా జలాల వివాదంలో వాదించానని గుర్తు చేసుకున్నారు.  మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని రెండు ప్రభుత్వాలకు సూచించాలని..   ఇరు రాష్ట్రాల  ఇరు రాష్ట్రాల సీనియర్‌ న్యాయవాదులకు సీజేఐ ఎన్వీ రమణ సూచించారు. 

కృష్ణా జలాల వివాదం రెండు రాష్ట్రాల మధ్య నివురు గప్పిన నిప్పులా ఉంది. ఇప్పుడంటే వర్షాలు, వరదలు పడి ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి కానీ.. అసలు వివాదం ప్రారంభమైనప్పుడు.. ప్రాజెక్టుల్లో డెడ్ స్టోరేజీ నీరు మాత్రమే ఉంది. ఆ సమయంలో ఏపీ ప్రభుత్వం .. రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణాన్ని నిలిపివేయలేదన్న కారణాన్ని చూపుతూ.. తెలంగాణ సర్కార్ జీవో ఇచ్చి మరీ.. అన్ని విద్యుత్ ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. ఈ కారణంగా ప్రాజెక్టులన్నీ ఖాళీ అయిపోయాయి. చాలా వరకు కృష్ణానీరు సముద్రం పాలయింది. అప్పట్లో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మాట్లాడుకోవాలని...  చాలా మంది సూచించినా... ఆ దిశగా ముందడుగు పడలేదు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టునే ఆ తరహా సూచన చేసింది.  ముఖ్యమంత్రులు మాట్లాడుకోకపోయినా.. కనీసం మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. దీనిపై ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి..!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మోదీ పాటలు వింటారా? ప్రధాని నుంచి ఊహించని రిప్లైసీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
WhatsApp Stop Working: 2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
CM Chandrababu: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Crime News:  టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Embed widget