By: Ram Manohar | Updated at : 17 Mar 2023 01:17 PM (IST)
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రష్యా పర్యటనకు సిద్ధమవుతున్నారు.
Xi Jinping Russia Visit:
మార్చి 20-22 మధ్య పర్యటన..
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రష్యా పర్యటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే వారం ఈ పర్యటన ఉంటుందని చైనా అధికారికంగా ప్రకటించింది. ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలయ్యాక తొలిసారి జిన్‌పింగ్ రష్యాకు వెళ్లనున్నారు. మార్చి 20 నుంచి 22వ తేదీ వరకూ జిన్‌పింగ్ రష్యాలో పర్యటించనున్నారు. ఇటీవలే మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన జిన్‌పింగ్...తొలిసారి విదేశీ పర్యటన చేయనున్నారు. ఉక్రెయిన్‌లో శాంతియుత వాతావరణం ఉండేలా చూడాలంటూ రష్యాతో మాట్లాడే అవకాశాలున్నాయి. రష్యాకు పరోక్షంగా చైనా మద్దతునిస్తోందన్న అపవాదు పోగొట్టుకునేందుకు జిన్‌పింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇదే సమయంలో రష్యా, చైనా మధ్య మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాల అధ్యక్షులు కీలక చర్చలు జరపనున్నట్టు చైనా అధికారులు చెబుతున్నారు. కొన్ని కీలక ఒప్పందాలు కూడా కుదిరే అవకాశాలున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా పర్యటనకు వచ్చారు. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలైనప్పటి నుంచి రష్యా, చైనా మధ్య వాణిజ్యం అమాంతం పెరిగింది. రష్యా నుంచి భారీ మొత్తంలో చమురు కొనుగోలు చేస్తోంది డ్రాగన్. ఇదే రష్యాకు భారీ ఆదాయం తెచ్చి పెడుతోంది. అయితే ఈ వాణిజ్యాన్ని మరింత పెంచుకునేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.
Chinese President Xi Jinping will pay a state visit to Russia from March 20 to 22 at the invitation of Russian President Vladimir Putin, Chinese Foreign Ministry spokesperson Hua Chunying announced on Friday pic.twitter.com/Tad6WDFlrr
— China Xinhua News (@XHNews) March 17, 2023
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కీలక ఆదేశాలిచ్చారు. దేశ సైన్యాన్ని నవీకరించుకోవాలంటూ పిలుపునిచ్చారు. Great Wall of Steelలా శక్తిమంతం అవ్వాలని అన్నారు. అమెరికాతో వివాదం ముదురుతున్న నేపథ్యంలో జిన్ పింగ్ ఈ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రక్షణాపరంగా దేశం పవర్ఫుల్ అవ్వాలని తేల్చి చెప్పారు జిన్‌పింగ్. పార్లమెంట్ సమావేశాల ముగింపు సమయంలో మాట్లాడిన ఆయన...ఈ ఆదేశాలిచ్చారు. జాతీయ భద్రతకు, పౌరుల రక్షణకు కచ్చితంగా కట్టుబడి ఉండాలని వెల్లడించారు. దేశ భద్రతే అభివృద్ధికి కీలకమని అన్నారు. దశాబ్ద కాలం తరవాత కేబినెట్లో చాలా మార్పులు చేశారు జిన్‌పింగ్. సెక్యూరిటీ విభాగంలోని ప్రస్తుత అధికారులను తొలగించి...తనకు సన్నిహితంగా ఉండే వాళ్లను నియమించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలోనూ చైనా నంబర్ వన్‌గా నిలవాలని లక్ష్యం నిర్దేశించారు. సెల్ఫ్ రిలయెన్స్‌తో దూసుకుపోవాలని తేల్చి చెప్పారు. చైనా నుంచి వచ్చే చిప్‌లపై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తైవాన్ అంశాన్నీ ప్రస్తావించిన ఆయన...అంతర్గత వ్యవహారాల్లో విదేశాలు జోక్యం చేసుకోవడాన్ని కచ్చితంగా వ్యతిరేకించాల్సిందేనని అన్నారు.
Breaking News Live Telugu Updates: కాసేపట్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
Tirumala Hundi Income: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?
Fed Rate Hike: వడ్డీ రేట్లను 25 bps పెంచిన ఫెడ్ - ప్రపంచం ఏమైనా పర్లేదు, తన దారి తనదే!
Vizag Building Collapse: విశాఖలో అర్ధరాత్రి తీవ్ర విషాదం! కుప్పకూలిన భవనం, అక్కడికక్కడే ముగ్గురు మృతి
Stocks to watch 23 March 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - HAL, Heroపై ఓ కన్నేయండి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు ఓటేస్తారా? రాజీనామాను ఆమోదించేశారా?
KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ
NTR 30 Muhurtam : రాజమౌళి క్లాప్‌తో మొదలైన ఎన్టీఆర్ 30 - అతిరథ మహారథుల సమక్షంలో...
DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య