(Source: ECI/ABP News/ABP Majha)
Bilawal Bhutto Kashmir: పాకిస్థాన్‌ని కశ్మీర్‌ని వేరు చేసి చూడలేం, ఆ విషయంలో మేం ఓడిపోయాం - బిలావల్ భుట్టో
Bilawal Bhutto Kashmir: పాకిస్థాన్, కశ్మీర్ వేరు వేరు కాదని విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అన్నారు.
Bilawal Bhutto Kashmir:
ఫోరమ్‌లో వ్యాఖ్యలు..
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో మరోసారి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. Organization of Islamic Cooperation (OIC) ఫోరమ్‌లో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్ మధ్య ప్రశాంత వాతావారణం నెలకొనాలంటే..కశ్మీర్ సమస్యను పరిష్కరించాలని అన్నారు. అప్పటి వరకూ ఈ అలజడి తప్పదని చెప్పారు. OIC ప్రారంభ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు.
"ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి జమ్ముకశ్మీర్ ప్రజలకూ ఓటు హక్కు ఉందని, వాళ్లు ఎవరినైనా ఎన్నుకోవచ్చని ఓ తీర్మానం పాస్ చేసింది. కానీ భారత్ మాత్రం ఐరాస తీర్మానానికి వ్యతిరేకంగా నడుచుకుంటోంది. కశ్మీర్‌లో మళ్లీ అలజడికి కారణమవుతోంది. పాకిస్థాన్, కశ్మీర్‌ను వేరు చేసి చూడలేం. భౌగోళికంగా రెండూ కలిసే ఉన్నాయి. అంతే కాదు. రెండు ప్రాంతాల విశ్వాసాలు,సంస్కృతి ఒకటే. కశ్మీర్ ప్రజలకు పాకిస్థాన్ ఎప్పుడూ అండగా ఉంటుంది"
- బిలావల్ భుట్టో, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి
కొద్ది రోజుల క్రితం ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతూ...కశ్మీర్ అంశంలో పాకిస్థాన్ ఓడిపోయిందని అంగీకరించారు బిలావల్ భుట్టో. సరైన విధంగా ఈ అంశాన్ని చర్చించలేకపోయామని అన్నారు. ఐక్యరాజ్య సమితిలో చర్చించడమే ఎజెండాగా పెట్టుకుని ఉండాల్సిందని వెల్లడించారు.
గతంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ లేవనెత్తడంతో భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. 'అంతర్జాతీయ శాంతి, భద్రత, సంస్కరించిన బహుపాక్షికత కోసం కొత్త ధోరణి' అనే అంశంపై జరిగిన బహిరంగ చర్చకు భారత్ నాయకత్వం వహించింది. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్.. పాకిస్థాన్‌కు కౌంటర్ ఇచ్చారు.
ప్రస్తుతం మహమ్మారి వ్యాప్తి, వాతావరణ మార్పు, సంఘర్షణలు లేదా ఉగ్రవాదం వంటి కీలక సవాళ్లకు ప్రభావవంతమైన ప్రతిస్పందనపై ఐరాస విశ్వసనీయత ఆధారపడి ఉంటుందని జై శంకర్ అన్నారు.