అన్వేషించండి

Chinese Spy Balloons: భారత్‌పైనా చైనా స్పై బెలూన్ నిఘా,సంచలన విషయం చెప్పిన అమెరికా

Chinese Spy Balloons: చైనా స్పై బెలూన్లు భారత్‌నూ టార్గెట్ చేసినట్టు అమెరికా వివరించింది.

Chinese Spy Balloons in India: 

జపాన్, భారత్‌పైనా..

అమెరికా ఎయిర్‌బేస్‌లో చైనా స్పై బెలూన్‌ చక్కర్లు కొట్టడం సంచలనమైంది. దాదాపు రెండు రోజుల పాటు దానిపై నిఘా పెట్టిన అగ్రరాజ్యం.. చివరకు ఫైటర్ జెట్‌తో పేల్చి వేసింది. అయితే...ఈ స్పై బెలూన్ వివాదం ఇక్కడితో ముగిసేలా లేదు. అమెరికానే కాకుండా
మరి కొన్ని దేశాలనూ చైనా టార్గెట్ చేసినట్టు ఓ రిపోర్ట్ వెల్లడించింది. ఈ లిస్ట్‌లో భారత్‌తో పాటు జపాన్‌ కూడా ఉంది. ఇప్పటికే ఈ బెలూన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అమెరికా భారత్‌కు తెలిపింది. వాషింగ్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికా డిప్యుటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వెండీ శెర్మన్ ఈ విషయమై మాట్లాడారు. 

"చైనా స్పై బెలూన్ చాలా రోజులుగా యాక్టివ్‌గా ఉంటోంది. మిలిటరీ పరంగా బలంగా ఉన్న దేశాల సమాచారాన్ని సేకరిస్తోంది. జపాన్, భారత్, వియత్నాం, తైవాన్, ఫిలిప్పైన్స్‌పై నిఘా పెట్టింది"

-వాషింగ్టన్ పోస్ట్ 

నాలుగు చోట్ల..

స్వయంగా కొందరు మిలిటరీ అధికారులే ఈ విషయాలు వెల్లడించారు. దాదాపు 5 ఖండాల్లోని గగనతలంలో ఈ స్పై బెలూన్‌లు చక్కర్లు కొట్టినట్టు వివరించారు. కీలక ఆపరేషన్లపైనా నిఘా పెడుతోందని దేశాల సమైక్యతను ఇది దెబ్బ తీస్తోందని చెప్పారు. ఈ మధ్య కాలంలో హవాయి, ఫ్లోరిడా, టెక్సాస్, గువాం ప్రాంతాల్లోని ఎయిర్‌బేస్‌లలో ఇలాంటి స్పై బెలూన్‌లు కనిపించాయని తెలిపారు. ట్రంప్ హయాంలోనే మూడు సార్లు ఇలాంటి బెలూన్‌లు కనిపించాయి. 

కొద్ది రోజులుగా అమెరికా ఎయిర్‌ బేస్‌లో చక్కర్లు కొడుతున్న చైనా స్పై బెలూన్‌ను షూట్ చేసేసింది అగ్రరాజ్యం. దాదాపు మూడు బస్సుల సైజ్ ఉన్న ఈ భారీ బెలూన్‌ను Fighter Jet F-22 షూట్ చేసింది. సింగిల్ మిజైల్‌తో ఆ బెలూన్‌ పేలిపోయింది. రక్షణ పరంగా సున్నితమైన ప్రాంతాలను, వ్యూహాత్మక ప్రదేశాలపై నిఘా పెడుతున్న చైనా స్పై బెలూన్‌ను కాల్చేసినట్టు అధికారులు వెల్లడించారు. దీనిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. బెలూన్‌ను పేల్చివేయడంపై తీవ్ర అసహనంతో ఉంది. అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అధ్యక్షుడు జో బైడెన్‌ మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. చైనా స్పై బెలూన్ కొద్ది రోజులుగా కలకలం సృష్టిస్తోంది. అలెర్ట్ అయిన అగ్రరాజ్యం... సెన్సిటివ్ ఎయిర్‌ బేస్‌లు, స్ట్రాటెజిక్ మిజైల్స్ ఉన్న చోటే ఈ బెలూన్ ఎగురుతోందని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఈ స్పై బెలూన్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసింది అమెరికా. మిలిటరీలోని ఉన్నతాధికారులు ఈ బెలూన్‌ను కాల్చేయాలని  ముందే భావించారు. అధ్యక్షుడు బైడెన్‌ కూడా ఇందుకు ఓకే అన్నారు. కానీ...ఇలా చేయడం వల్ల కింద ఉన్న వాళ్లకు ప్రమాదం తలెత్తే అవకాశముందని ఆలోచనలో పడ్డారు అధికారులు. చివరకు ఆ బెలూన్‌ను పేల్చేశారు. కేవలం తమపై నిఘా ఉంచేందుకే చైనా ఇలా స్పై బెలూన్‌ పంపిందని అమెరికా ఆరోపిస్తోంది. 

"విజయవంతంగా ఆ స్పై బెలూన్‌ను పేల్చివేశాం. ఈ పని ఇంత సక్సెస్‌ఫుల్‌గా చేసిన ఫైటర్ జెట్‌ పైలట్‌లకు నా అభినందనలు" 

- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు 

 

టాప్ హెడ్ లైన్స్

Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget