China Food : ఉత్తరకొరియా తరహాలోనే చైనాలోనూ ఆకలి రాజ్యం ? తిండి గింజలు దాచుకోవాలని ప్రజలకు డ్రాగన్ సర్కార్ సలహా !
నిత్యావసర వస్తువులు పొదుపుగా వాడుకోవాలని .. దాచుకోవాలని చైనా ప్రభుత్వం ప్రజలకు పిలుపునిచ్చింది. దీంతో ఆ దేశంలో ఆకలి రాజ్యం రాబోతోందన్న అంచనాలు ప్రారంభమయ్యాయి.
మన దేశంలో.. మన రాష్ట్రాల్లో తిండి గింజలు ఎక్కువైపోయాయి... వరి పంటల్లాంటివి వేయవద్దని ప్రభుత్వాలు అంటున్నాయి. కానీ చైనా మాత్రం ఆహార కొరత వస్తోంది ఆహారధాన్యాలు దాచుకోవాలని ప్రజలకు పిలుపునిస్తోంది. ఎందుకు ఆహార కొరత వస్తుందో చెప్పడం లేదు కానీ ప్రజలందరికీ సలహాలిచ్చేసింది. వాతావరణం సరిగా లేకపోవడం, ఇంధనం కొరత, కోవిడ్19 నిబంధనల వల్ల రవాణా సమస్యలు ఏర్పడతాయని జాగ్రతతలు చెబుతోంది. ప్రజలు నిత్యావసరాలను నిల్వ చేసుకునే విధంగా స్థానిక ప్రభుత్వాలను ఆదేశిచింది.
Also Read : కొవాగ్జిన్ టీకాకు ఆస్ట్రేలియా సహా మరో 5 దేశాల అధికారిక గుర్తింపు
చైనా ప్రభుత్వం ఆదేశాలతో చైనీయులు చలి కాలం నుంచి ఎండా కాలం వరకూ ఇబ్బంది లేకుండా సరుకులు పెట్టుకునేందుకు పరుగులు తీస్తున్నారు. నిజమైన కారణం ఏమిటా అన్నదానిపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. చైనా ప్రపంచంలో అతి ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో ఒకటి. నిత్యావసరాల కొరత వస్తే అది తీవ్రంగా ఉంటుంది. అయితే ఎగుమతుల్లో కీలకంగా ఉండే చైనా తమ దేశ అవసరాలే ఎందుకు తీర్చుకోలేదనేదే ఇక్కడ హాట్ టాపిక్ అవుతోంది.
Also Read : ఏం ఐడియా సర్‌జీ..! ఛీఛీ అనుకోకండి.. దీంతో ఇంటి మొత్తానికి కరెంట్!
తైవాన్‌ను ఆక్రమించుకునే ప్రయత్నాల్లో ఉన్న చైనా.. ప్రపంచదేశాలు కన్నెర్ర చేస్తే ఇబ్బంది అవుతుందని ముందుగా ప్రజలను ఆహారం నిల్వ వైపు ప్రొత్సహిస్తున్నారని కొంత మంది నమ్ముతున్నారు. అయితే చైనాలో ఆహారసమస్య రావడానికి కారణం అక్కడి వాతావరణ పరిస్థితులేనన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో చైనాలో పలు ప్రాంతాల్లో 1000 ఏళ్లల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో వరదలు వచ్చాయి. పంటలు దెబ్బతిన్నాయి. ఫలితంగా ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఎక్కువ అయ్యాయి.
Also Read: G20 Summit: 'ప్రపంచానికి బాసటగా భారత్.. 2022 చివరి నాటికి 500 కోట్ల టీకా డోసులు'
మరో వైపు కరోనా కూడా కారణం కావొచ్చని చెబుతున్నారు. ఇటీవల డెల్టా వేరియంట్ చైనాలో విజృంభించడం మొదలు పెట్టింది. ఫలితంగా చాలా నగరాలు మళ్లీ కఠిన లాక్‌డౌన్ల వైపుగా ప్రయాణిస్తున్నాయి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించాల్సి వస్తే ముందు జాగ్రత్తగా ప్రజల్ని ఇలా చైనా అప్రమత్తం చేస్తోందని కొంత మంది భావిస్తున్నారు. కొసమెరుపేమిటంటే.. చైనా సోషల్ మీడియా గ్రూపుల్లో ఎవరైనా అతిగా తిండి తింటూ వీడియోలు తీసుకుని పోస్ట్ చేస్తే వారిపై కేసులు పెడుతున్నారు. కొద్ది రోజుల కిందట ఉత్తరకొరియా కూడా అదే తరహా ఆదేశాలిచ్చింది. తీవ్రమైన ఆహారకొరత ఉందని.. ప్రజలు తక్కువ తినాలని సలహా ఇచ్చింది కిమ్ ప్రభుత్వం. చైనా పరిస్థితి కూడా అటూ ఇటూగా అలాగే ఉంది.
Also read: ఇది మంగళసూత్రం ప్రకటనా లేక లోదుస్తుల ప్రకటనా?