అన్వేషించండి

Child Labour Day 2022: బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ఆవశ్యకత ఇదీ, మీకు ఈ విషయాలు తెలుసా

ఏటా జూన్ 12 వ తేదీన ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తున్నారు. చిన్నారులకు సామాజిక రక్షణ అందించటమే ఈ ఏడాది నినాదంగా పెట్టుకున్నారు.

చిన్నారులకు సామాజిక రక్షణ అందించాలి..

పేదరికం, నిరక్షరాస్యత కారణంగా చాలా  మంది చిన్నారులు చదువుకు దూరమవుతున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేవని పిల్లల్ని కూలీ పనులకు తీసుకెళ్తున్నారు తల్లిదండ్రులు. ఇది చాలా చోట్ల చూస్తున్నదే. చిన్నారులతో పని చేయించటం నేరం అని తెలిసినా ఎవరూ పట్టించుకోవటం లేదు. చట్టాలు కఠినంగా ఉన్నా అన్ని చోట్లా ఇది అమలు కావటం లేదు. ఈ సమస్యను పరిష్కారించాలన్న పిలుపుతో ఏటా జూన్ 12వ తేదీన ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రత్యేక నినాదంతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్ల మంది పిల్లలు, యుక్త వయస్కులు ప్రమాదకరమైన స్థలాల్లో పని చేస్తున్నట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. వీరందరినీ ఈ వలయం నుంచి బయటపడేయాలన్నదే ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం ప్రధాన ఉద్దేశం. 
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు "చిన్నారులకు సామాజిక రక్షణ" అందించటమే ఈ ఏడాది నినాదంగా పెట్టుకున్నారు. 

బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం మొదలైంది అప్పుడే..

2017లో అంతర్జాతీయ కార్మిక సంస్థ-ILO భారత్‌లోని స్థితిగతులను లెక్కలతో సహా వివరించింది. దేశవ్యాప్తంగా 15-17 ఏళ్ల మధ్య ఉన్న వారిలో దాదాపు 20% మంది ప్రమాదకరమైన పరిశ్రమల్లో పని చేస్తున్నట్టు తేల్చి చెప్పింది. 17 ఏళ్లు నిండకుండానే పనుల్లో చేరుతున్న వారి సంఖ్య కోటికిపైగానే ఉంది. సమస్య ఇంత తీవ్రంగా ఉంది కాబట్టే  భారత్‌లో ఈ సవాలు అధిగమించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు నిపుణులు. 2002లో మొదటి సారి అంతర్జాతీయ కార్మిక సంస్థ ఈ ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ప్రారంభించింది. బాల కార్మిక వ్యవస్థ వల్ల చిన్నారులకు ఎంత హాని కలుగుతోందో అవగాహన కల్పించటమే ప్రధాన లక్ష్యంగా అప్పటి నుంచి ఏటా ఓ థీమ్‌తో ఇది జరుపుకుంటున్నారు.

మానవ అక్రమ రవాణా, డ్రగ్స్‌ రవాణా సహా వ్యభిచార కూపంలోకి బాలికల్ని దింపటానికి ప్రధాన కారణం బాల కార్మిక వ్యవస్థే. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు స్థానిక ప్రభుత్వాలు సహకరించాలని పిలుపునిస్తోంది ILO. అంతర్జాతీయ సంస్థలూ ఇందులో పాలు పంచుకుంటున్నాయి. ఈ కూపంలో నుంచి బయటపడేసి చిన్నారులకు మంచి విద్య అందించాలని కృషి చేస్తున్నాయి. పిల్లలు పనుల్లోకి వెళ్లకుండా రక్షించుకోవాలని సూచిస్తున్నాయి. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని స్వచ్ఛంద సంస్థలు తమ వంతు బాధ్యతగా నిధులు సేకరించాలని భావిస్తున్నాయి. వీలైనంత త్వరగా అంతర్జాతీయంగా ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. భారత్‌లోనూ పలు సంస్థలు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం: మస్కటీన్‌లో ఏడుగురి దుర్మరణం
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం: మస్కటీన్‌లో ఏడుగురి దుర్మరణం
IPL 2026 Flop Playing XI: ఐపీఎల్ 2026 ఫ్లాప్ ప్లేయింగ్ ఎలెవన్ : రిషభ్ పంత్ కెప్టెన్.. సూర్య, హార్దిక్ ,  బుమ్రాలకు చోటు.. నిరాశపరిచిన స్టార్ ప్లేయర్స్
ఐపీఎల్ 2026 ఫ్లాప్ ప్లేయింగ్ ఎలెవన్ : రిషభ్ పంత్ కెప్టెన్.. సూర్య, హార్దిక్ ,  బుమ్రాలకు చోటు.. నిరాశపరిచిన స్టార్ ప్లేయర్స్
Hyderabad Traffic Diversions: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
Vaibhav Sooryavanshi News: సూర్య‌వంశీ ఫ్యూచ‌ర్ పై బీసీసీఐ బాస్ కీల‌క అప్డేట్.. యాక్ష‌న్ ప్లాన్ సిద్ధం చేసిన కార్య‌ద‌ర్శి సైకియా
సూర్య‌వంశీ ఫ్యూచ‌ర్ పై బీసీసీఐ బాస్ కీల‌క అప్డేట్.. యాక్ష‌న్ ప్లాన్ సిద్ధం చేసిన కార్య‌ద‌ర్శి సైకియా

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Rajya Sabha Seat Congress: షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
Hyderabad Traffic Diversions: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
EPFO 3.0 PF withdrawal via ATM:ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
10K Steps Daily : రోజుకు 10 వేల అడుగులు నడవాలా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఈజీగా కంప్లీట్ చేయొచ్చు
రోజుకు 10 వేల అడుగులు నడవాలా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఈజీగా కంప్లీట్ చేయొచ్చు
ABP India at 2047: అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
Rains In AP and Telangana: ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు.. అక్కడ పిడుగుల వార్నింగ్
ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు.. అక్కడ పిడుగుల వార్నింగ్
Maruti Suzuki May Sales Record: అద‌ర‌గొట్టిన మారుతి సుజుకి.. మేలో ఆల్ టైమ్ హైయెస్ట్ మంత్లీ సేల్స్ తో సరికొత్త రికార్డ్
అద‌ర‌గొట్టిన మారుతి సుజుకి.. మేలో ఆల్ టైమ్ హైయెస్ట్ మంత్లీ సేల్స్ తో సరికొత్త రికార్డ్
Embed widget