అన్వేషించండి

DMK MLA Markandeyan Arrest: విజయ్‌పై అనుచితంగా మాట్లాడితే అరెస్టే - జైలుకెళ్లిన రెండో డీఎంకే ఎమ్మెల్యే - స్టాలిన్ ఫైర్

Stalin Condemns DMK MLA Arrest: ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తూత్తుకుడిలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

Tamil Nadu Politics 2026:  తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తంగా మారాయి.  ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కజగం అధినేత సి. జోసెఫ్ విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ప్రతిపక్ష డీఎంకే పార్టీకి చెందిన ప్లాథికుళం  నియోజకవర్గ ఎమ్మెల్యే జి.వి. మార్కండేయన్‌ను తూత్తుకుడి జిల్లా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోమవారం ఉదయం ఆయన నివాసంలోనే  అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుతో తూత్తుకుడి జిల్లాలోని విలాతికుళం, కోవిల్‌పట్టి పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారీగా పోలీసు బలగాలను మోహరించారు.  

డీఎంకే దివంగత అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి జయంతి వేడుకలు, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు కోవిల్‌పట్టిలో నిర్వహించిన బహిరంగ సభలో మార్కండేయన్ ప్రసంగిస్తూ సీఎం విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో సీఎం వ్యవహార శైలిపై విమర్శలు చేస్తూనే, వ్యక్తిగత దూషణలకు దిగడం, బెదిరింపులకు పాల్పడటం వంటి అనుచిత వ్యాఖ్యలు చేశారని టీవీకే పార్టీ ఉత్తర జిల్లా కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు.  

మార్కండేయన్ అరెస్ట్ సమయంలో ఆయన అనుచరులు, డీఎంకే శ్రేణులు పోలీసు వాహనాలను అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేయడంతో అక్కడ తీవ్ర తోపులాట జరిగింది. చట్టాన్ని ఉల్లంఘించే రీతిలో విద్వేషాలను రగల్చడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడటంతో భారతీయ నాయ సంహిత  సెక్షన్ 351(3), 352, 353(2) కింద ఆయనపై కేసులు నమోదు చేశారు.

ఇటీవలే తిరుచెందూర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్ కూడా సీఎం విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులోనే మద్రాస్ హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో అరెస్ట్ అయ్యారు.  కొన్ని వారాల వ్యవధిలోనే తూత్తుకుడి జిల్లాకు చెందిన ఇద్దరు కీలక డీఎంకే ఎమ్మెల్యేలు ఒకే తరహా కేసులో కస్టడీకి వెళ్లడం తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

ఈ వరుస అరెస్టులపై డీఎంకే అధ్యక్షులు ఎం.కే. స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విమర్శలను తట్టుకోలేక టీవీకే ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని, రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ పోలీసు బలగాలను విపక్షాలపై ప్రయోగిస్తోందని ఆరోపించారు. మరోవైపు చట్టానికి ఎవరూ అతీతులు కారని, ప్రజాప్రతినిధులై ఉండి శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రసంగాలు చేస్తే సహించేది లేదని టీవీకే వర్గాలు కౌంటర్ ఇస్తున్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
ABP Desam Top 10, 12 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 12 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
Kerala Influencer Akhil Megha: కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!
కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Embed widget