అన్వేషించండి

Top Headlines Today: ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం- మద్యం బ్రాండ్లపై అప్రమత్తమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

AP Telangana Latest News 12 June 2024: నేటి ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. ఒక్క క్లిక్ చేసి 5 ప్రధాన వార్తలు చదవండి.

Andhra Pradesh News Today: 'చంద్రబాబు అనే నేను..' - నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం - ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్‌ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. నాలుగోసారి ఏపీ సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబు రికార్డు సృష్టించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో, జేపీ నడ్డా, ఇతర రాజకీయ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అతిరథ మహారథులు కదలివచ్చిన వేళ ప్రమాణస్వీకారం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

అన్న చిరంజీవి అంటే అంత ప్రేమా! మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత పవన్ ఏం చేశారంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను అంటూ ప్రమాణం చేస్తుంటే... సభా ప్రాంగణం ఒక్కసారిగా దద్దరిల్లింది. సభకు వచ్చిన వారంతా చప్పట్లతో స్వాగతం పలికారు. ప్రమాణం చేసిన తర్వాత మంత్రి పవన్ కల్యాణ్‌ తన అన్న చిరంజీవి కాళ్లకు దణ్ణం పెట్టారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ఇంతింతై పవన్ అంతై... రాజకీయాల్లోనూ ట్రెండ్ సెట్టర్‌ పవర్ స్టార్
పవన్ కల్యాణ్... ఈ పేరులో వైబ్రేషన్ ఉంటుంది. పవర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. పేరుకు తగ్గట్టుగానే ఆయనలో ఏదో తెలియని పవర్ ఉంటుంది. అన్న చాటు చాటు తమ్ముడి  సినీ రంగ ప్రవేశం చేసిన 2 సినిమాలతోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. నవ్వితే చాలు బాక్సాఫీస్‌లో కనకవర్షం కురిసేది. ఇలా సినిమా సినిమాకు తన స్టామినా పెంచుకుంటూ ఇంతింతై అన్నట్టు వెండితెరపై అమాంతం ఎదిగిపోయారు. అప్పటి వరకు ఏ హీరోకి లేని ఇజాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే పవనిజం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

మందుబాబులతో పెట్టుకుంటే కష్టమే - ఆ విషయంలో వెనక్కి తగ్గిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో కొద్ది రోజులుగా కొత్త  బీర్ బ్రాండ్లు హైలెట్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మాదిరిగా విచిత్రమైన బ్రాండ్లు మద్యం దుకాణాల్లో కనిపిస్తున్నాయి. అదే సమయంలో పాపులర్ బ్రాండ్ల కొరత ఏర్పడింది. దీంతో ఏపీలో మాదిరిగా మద్యం గూడుపుఠాణి ఏదో జరుగుతోందన్న అనుమానాలు, ఆరోపణలు ప్రారంభమయ్యాయి. రాజకీయంగా ఇది ఇబ్బందికరం అయ్యే అవకాశాలు కనిపించడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రమత్తమయింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

మేము కలిసే ఉన్నాం, తప్పుడు కథనాలు వద్దు: మహిళా మంత్రుల ఫైర్
ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులుగా తాము పరస్పర అవగాహనతో కలిసి సాగుతున్నామని మంత్రులు కొండా సురేఖ (Konda Surekha), సీతక్క (Seethakka) స్పష్టం చేశారు. తమ మధ్య విభేదాలున్నాయంటూ ఓ న్యూస్ ఛానల్‌, దినపత్రికలో వచ్చిన కథనాలను మంత్రులు ఇద్దరూ ఖండించారు. అవి నిరాధారమైన ఆరోపణలంటూ కొట్టిపారేశారు. కొన్ని వ్యతిరేకశక్తులు కావాలని తమ పై బురదజల్లే చర్యలకు పాల్పడుతూ పైశాచికానందం పొందుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ మహిళలకు మంత్రి పదవులను కేటాయించిందని, మహిళా సాధకారతను చేతల్లో చూపుతోందని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Venkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడుPrime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారుల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Actress Shobita: సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
Peelings Song Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
Embed widget