అన్వేషించండి

Congress Ministers Conflicts: మేము కలిసే ఉన్నాం, తప్పుడు కథనాలు వద్దు: మహిళా మంత్రుల ఫైర్

Konda Surekha And Seethakka: తమ మధ్య విభేదాలున్నాయంటూ ఓ న్యూస్ ఛానల్‌, దినపత్రికలో వచ్చిన కథనాలను మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఖండించారు. అవి నిరాధారమైన ఆరోపణలంటూ కొట్టిపారేశారు.

Konda Surekha Vs Seethakka: ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులుగా తాము పరస్పర అవగాహనతో కలిసి సాగుతున్నామని మంత్రులు కొండా సురేఖ (Konda Surekha), సీతక్క (Seethakka) స్పష్టం చేశారు. తమ మధ్య విభేదాలున్నాయంటూ ఓ న్యూస్ ఛానల్‌, దినపత్రికలో వచ్చిన కథనాలను మంత్రులు ఇద్దరూ ఖండించారు. అవి నిరాధారమైన ఆరోపణలంటూ కొట్టిపారేశారు. కొన్ని వ్యతిరేకశక్తులు కావాలని తమ పై బురదజల్లే చర్యలకు పాల్పడుతూ పైశాచికానందం పొందుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ మహిళలకు మంత్రి పదవులను కేటాయించిందని, మహిళా సాధకారతను చేతల్లో చూపుతోందని అన్నారు. బీఆర్ఎస్ వంటి బూర్జువా పార్టీలు ఓటమిని జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

ఓర్వలేక విమర్శలు
జర్నలిజం ముసుగులో బీఆర్‌ఎస్ సొంత మీడియా కాంగ్రెస్‌కు వ్యతిరేక వార్తలను ప్రచురిస్తూ, ప్రసారం చేస్తూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపిస్తున్నాయని మంత్రులు సురేఖ, సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో గిరిజన బిడ్డ సీతక్క, బీసీ బిడ్డ అయిన తాను ఎదుగుతున్న తీరును చూసి తట్టుకోలేని ఫ్యూడలిస్టులు అవాస్తవ కథనాలతో విషం చిమ్ముతున్నారని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులుగా జిల్లా ప్రగతికి, రాష్ట్ర పురోగతికి తమవంతు కృషి చేస్తూ కలిసి సాగుతున్నట్లు చెప్పారు.

మహిళాశక్తిని కించపరచడమే
తమపై అసత్య ఆరోపణలు చేయడం మహిళాశక్తిని కించపరచడమేనని మంత్రులు సీతక్క, సురేఖ అన్నారు. మేడారం జాతరలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన సమీక్షా సమావేశాల్లో, జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో, ఎన్నికల ప్రచార సభల్లో తాము ఇరువురం కలిసికట్టుగా పనిచేశామన్నారు. మేడారం జాతర సమయంలో తాను విపరీతమైన జ్వరంతో బాధపడ్డానని, తిరిగి కోలుకొని అమ్మవార్లు గద్దెకు చేరుకున్న సమయంలో జాతరకు హాజరైన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. తానూ, మంత్రి సురేఖ పరస్పరం సహకరించుకుంటూ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించి, విజయవంతంగా జాతరను ముగించామని మంత్రి సీతక్క అన్నారు. 

ఎన్నికల కోడ్ వల్లే కలిసి పని చేసే అవకాశం రాలేదు
పార్లమెంటు ఎన్నికలు రావడంతో ఎవరికివారు ప్రచార కార్యక్రమాల్లో తాము తలమునకలై ఉన్నట్లు మంత్రులు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉండటంతో తాము కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభించలేదన్నారు. తోచిన అంశాలను ఆధారంగా చేసుకొని ఇష్టం వచ్చినట్లు తమ పై అసంబద్ధమైన వార్తలను వండివార్చేందుకు జర్నలిజం విలువలను గాలికొదిలేసిన మీడియా సంస్థలు చేసిన ప్రయత్నాలు బెడిసికొడతాయని వారు హెచ్చరించారు. మీడియా ముసుగులో ఏది పడితే అది రాస్తామంటే కుదరదని, ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారని పేర్కొన్నారు. 

ఇప్పటికైనా మారండి
టీఆర్పీ రేటింగ్‌ల కోసమో, ఇతరర ప్రయోజనాల కోసమే ఇలాంటి అవాస్తవ వార్తా కథనాలు వండివార్చుతున్నారని మంత్రులు నిప్పులు చెరిగారు. వృత్తి విలువలు పాటించని కొందరు జర్నలిస్టులు, మీడియా సంస్థల కారణంగా ప్రజలకు మీడియాపై చిన్నచూపు ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు. ‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అనే విధంగా వ్యవహరించకుండా నిజానిజాలను నిర్ధారణ చేసుకొని వార్తలను ప్రచురించాలని వారు సూచించారు.  మీడియా సంస్థలు ప్రజలకు ఉపయోగపడే వార్తలకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా మీడియాకున్న పేరుకు సార్థకతను చేకూర్చే దిశగా కృషి చేయాలని మంత్రులు కొండా సురేఖ, సీతక్క హితవు పలికారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
Chittoor News: చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Embed widget