అన్వేషించండి

Telangana Beer Issue : మందుబాబులతో పెట్టుకుంటే కష్టమే - ఆ విషయంలో వెనక్కి తగ్గిన తెలంగాణ ప్రభుత్వం

Telangana News : కొత్త బీర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆయా బ్రాండ్లకు కొత్తగా ఇచ్చిన అనుమతుల్ని నిలిపివేశారు.

Telangana new Brand beers :  తెలంగాణలో కొద్ది రోజులుగా కొత్త  బీర్ బ్రాండ్లు హైలెట్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మాదిరిగా విచిత్రమైన బ్రాండ్లు మద్యం దుకాణాల్లో కనిపిస్తున్నాయి. అదే సమయంలో పాపులర్ బ్రాండ్ల కొరత ఏర్పడింది. దీంతో ఏపీలో మాదిరిగా మద్యం గూడుపుఠాణి ఏదో జరుగుతోందన్న అనుమానాలు, ఆరోపణలు ప్రారంభమయ్యాయి. రాజకీయంగా ఇది ఇబ్బందికరం అయ్యే అవకాశాలు కనిపించడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రమత్తమయింది. 

కొత్త బ్రాండ్లకు ఇచ్చిన లైసెన్స్‌లు తాత్కలికంగా నిలిపివేత                                     

తెలంగాణ  ప్రభుత్వం బేవరేజెస్ కార్పొరేషన్ ఐదు కొత్త మద్యం కంపెనీలకు ఇచ్చిన లైసెన్సులను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం  తీసుకుంది.  మందుబాబుల  వ్యతిరేకత, కొత్త కంపెనీల నుంచి వస్తున్న ఉత్పత్తుల నాణ్యత, ప్రామాణికతపై అనుమానాలు వ్యక్తమవుతున్నందన  కొన్ని రోజులు ఈ బ్రాండ్‌లను అమ్మవద్దని నిర్ణయించారు.  సోషల్ మీడియాలో కొత్త బీర్ బ్రాండ్లపై నెటిజన్లు తమ వ్యతిరేకతను కూడా వ్యక్తం చేశారు. 

ఏపీ తరహాలో ఉన్న బ్రాండ్లపై మందు బాబుల్లో వ్యతిరేకత                                

తెలంగాణలో దర్శనమిస్తుున్న   కొత్త మద్యం బ్రాండ్లపై రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తెరలేచింది. కొత్త మద్యం బ్రాండ్ల వ్యవహారం తలనొప్పిగా మారడంతో కొత్త కంపెనీలకు ఇవ్వాల్సిన అనుమతులను తాత్కాలికంగా నిలిపివేశారు. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ఐదు కొత్త కంపెనీలకు అనుమతి ఇచ్చింది. ఈ ఐదు కంపెనీలు తెలంగాణలో దాదాపు 27 రకాల బీర్లను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేశాయి. లైసెన్సు పొందిన కొన్ని కంపెనీలకు సరైన  ట్రాక్ రికార్డు  లేకపోవడం, కొన్ని చోట్ల కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు కథనాలు రావడంతో ప్రజల నుంచి, మద్యం ప్రియుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది.                             

ఏపీ సర్కార్‌కు ఘోరమైన ఫలితాలకు కారణం నాసిరకం మధ్యం కూడా !                     

ఏపీలో అక్కడి ప్రభుత్వానికి మద్యం విధానం పెద్ద మైనస్ గా మారింది. ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలు వచ్చాయి. నాసిరకం మద్యం అత్యధిక రేట్లకు విక్రయించారని.. పేదల ఆదాయాన్ని పిండుకున్నారన్న విమర్శలు వచ్చాయి. ఎన్నికల ఫలితాల్లో .. వైసీపీకి ఘోరమైన రిజల్ట్ రావడానికి మద్యం బ్రాండ్లు కూడా  ఓ కారణమని ప్రజలు నమ్మారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా తెలంగాణ సర్కార్.. బ్రాండ్ల నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.                                                  

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పార్టీ మారడం లేదన్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. కేక్ కట్ చేసి కేటీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్
పార్టీ మారడం లేదన్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. కేక్ కట్ చేసి కేటీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Rains In AP and Telangana: రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ
రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని
Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది
రూ.10 లక్షల బడ్జెట్‌లో ఫస్ట్‌ కార్‌ కొనాలనుకుంటున్నారా? డిజైర్‌, నెక్సాన్‌, పంచ్‌, XUV 3XOలో బెస్ట్ ఛాయిస్ ఇదే!
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Embed widget