Chandrababu Naidu: 'చంద్రబాబు అనే నేను..' - నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
Chandrababu Naidu Oath Ceremony: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాల్గోసారి చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. ఆయనతో గవర్నర్ నజీర్ ప్రమాణం చేయించారు.

Chandrababu Naidu Oath Ceremony: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. నాలుగోసారి ఏపీ సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబు రికార్డు సృష్టించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో, జేపీ నడ్డా, ఇతర రాజకీయ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అతిరథ మహారథులు కదలివచ్చిన వేళ ప్రమాణస్వీకారం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబు ఎమోషన్
నాల్గోసారి ప్రమాణం చేసిన చంద్రబాబు మొహంలో భావోద్వేగాలు స్పష్టంగా కనిపించాయి. ప్రమాణం చేసిన తర్వాత నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వద్దకు వచ్చారు. అక్కడ ఆయన చంద్రబాబు అభినందిస్తూ పూలబొకేను అందించారు. అనంతరం చంద్రబాబు ఆయన్ని కౌగిలించుకొని ఎమోషన్ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా వీఐపీ గ్యాలరీ వైపుగా వెళ్లి అక్కడ కూర్చొని ఉన్న అమిత్‌షా, వెంకయ్య, జేపీ నడ్డా, ఇతర ప్రమఖులకు అభివాదం చేశారు.
నారా చంద్రబాబు నాయుడు అనే నేను.. #KutamiTsunami #NaraChandrababuNaidu #ChandrababuNaiduAneNenu #AndhraPradesh pic.twitter.com/l3C8IqVEm9
— Telugu Desam Party (@JaiTDP) June 12, 2024
సవాళ్లే విజయానికి మెట్లుగా...
1975లో చంద్రబాబు రాజకీయం జీవితం ప్రారంభమైంది. అంతకంటే ముందే యూనివర్శిటీ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ ఆయనకు తొలిసారి 1975లోనే గుర్తింపు ఉన్న పదవి వచ్చింది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కేరీర్ స్టార్ చేశారు. అక్కడు ఐదేళ్లలోనే చంద్రగిరి ప్రజల మనసులు నెగ్గిన చంద్రబాబు 1978లో మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. అక్కడకు రెండేళ్లకే 1980లో అంజయ్య కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు భుజానకెత్తుకున్నారు. అయితే ఎన్టీఆర్ పార్టీ ప్రభంజనంలో 1983లో ఆయన చంద్రగిరి నుంచి ఓటమిపాలయ్యారు. అక్కడకు కొన్ని రోజులకే టీడీపీలో చేరి అక్కడ కూడా చాలా యాక్టివ్‌గా పని చేశారు. దీంతో ఆయన పనితీరును మెచ్చిన ఎన్టీఆర్ 1986లో టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
1989లో కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కుప్పం నుంచి గెలుస్తూ వస్తున్నారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో 1995లో టీడీపీని హస్తగతం చేసుకున్నారు. అధికార మార్పిడిలో రాష్ట్ర సీఎంగా తొలిసారిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే కేంద్రంలో కూడా కీలకమైన వ్యక్తిగా మారరు. 1999లో కూడా రెండోసారి సీఎంగా ఎన్నికయ్యారు. 2004 నుంచి వరుసుగా రెండుసార్లు ఓడిపోయారు. రాష్ట్రవిభజన తర్వాత 2014లో మళ్లీ సీఎంగా ఎన్నికయ్యారు. 2019లో ప్రజల తిరస్కరణగురై అనేక ఇబ్బందులు పడ్డారు. మరోసారి పొత్తుగా ఏర్పడి ఈసారి నాల్గోసారి సీఎంగా ప్రమాణం చేశారు.
పవన్ అనే నేను..
చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కల్యాణ్, నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నారాయణతో పాటు ఇతర మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. పవన్ కల్యాణ్, లోకేశ్ ప్రమాణ స్వీకారం సమయంలో సభ మొత్తం మార్మోగింది. 'కొణిదెల్ పవన్ కల్యాణ్ అనే నేను..' అని అనగానే అభిమానుల కేరింతలు, ఉత్సాహంతో సభలో సందడి నెలకొంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

