Vizag Tech Summit 2023: వైజాగ్ టెక్ సమ్మిట్ 2023కు కేంద్ర సాయం కోరిన ఏపీ ప్రభుత్వం- ఓకే చెప్పిన నిర్మలాసీతారామన్!
Vizag Tech Summit 2023: వైజాగ్ టెక్ సమ్మిట్ 2023కు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.
Vizag Tech Summit 2023: ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైజాగ్ టెక్ సమ్మిట్ - 2323కి కేంద్రం ప్రభుత్వం మద్దతు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఫిబ్రవరి 16, 17 తేదీల్లో జరిగే ఈ సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని ఆమె హామీ ఇచ్చినట్లు సదస్సు నిర్వాహకులు పరల్స్ గ్రూప్ సీఈఓ శ్రీనుబాబు ప్రకటించారు. గురువారం పార్లమెంట్ ఆవరణలో నిర్మలా సీతారామన్ ను కలిసి సదస్సు వివరాలను తెలియజేసిన్లు చెప్పారు. జీ20 అధ్యక్ష దేశంగా భారత్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో గ్లోబల్ టెక్ సమ్మిట్ విజయవంతానికి సహకారం అందిస్తామని, సమ్మిట్ ద్వారా జీ-20 విజన్ ను ముందుకు తీసుకు వెళ్లాల్సిందిగా కోరినట్లు శ్రీనుబాబు తెలిపారు.
జీ-20 సదస్సుకు మద్దతుగా 5 మెట్రో నగరాల్లో సదస్సులు..
జీ-20 సదస్సులకు మద్దతుగా న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో గ్లోబ్ టెక్ సమ్మిట్ లు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమ్మిట్ ద్వారా రూ.3000 కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు వివరించారు. అయితే ఈ డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది నవంబర్ వరకు సదస్సులు, వివిధ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. జీ-20 అధ్యక్ష దేశంగా భారత్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో విశాఖపట్నంలో సదస్సు నిర్వహించాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది. జీ-20 సదస్సులో భాగంగా దేశంలోని 56 నగరాలు, పట్టణాల్లో వివిధ అంశాలపై 200 వరకు సదస్సులు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ పట్నాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
విశాఖ వేదికగా..
2023 ఫిబ్రవరి 3, 4 తేదీల్లో, ఏప్రిల్ 24వ తేదీన విశాఖపట్నంలో వివిధ అంశాలపై సదస్సు నిర్వహించాలని కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. జీ-20 సదస్సుకు నోడల్ అధికారిగా ప్రోటోకాల్ డైరెక్టర్ ఎం. బాలసుబ్రహ్మణ్యం రెడ్డిని, సెక్యూరిటీ నోడల్ అధికారిగా డీజీపీని నియమించారు. విశాఖపట్నంలో జీ-20 సదస్సు మూడు రోజులు జరగనుంది. ఈ మూడ్రోజుల్లో ఆర్థిక రంగం, వ్యవసాయం, పర్యావరణం, వైద్య, విద్యతో పాటు 37 సమావేశాలు జరుగుతాయని జిల్లా అధికారులు వెల్లడించారు.
వేల మంది ప్రతినిధులు హాజరు అవుతారని, వివిధ దేశాల ఆర్థిక మంత్రులు, విదేశాంగ మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు పాల్గొంటారని అధికారులు తెలిపారు. అందుకు అనుగుణగా ఏర్పాట్లు పూర్తి చేసేందుకు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ విశ్వ నాథన్, డీఆర్వో శ్రీనివాస మూర్తి ఇతర జిల్లా అధికారులతో సమావేశమైన దిశానిర్దేశం చేస్తున్నారు. జీ-20 సదస్సు నిర్వహణకు మొత్తం 15 కమిటీలను ఏర్పాటు చేసి, జాయింట్ కలెక్టర్ విశ్వ నాథన్‌ను నోడల్ అధికారిగా నియమించారు. సదస్సుకు వచ్చే అతిథుల కోసం విశాఖపట్నంలోని స్టార్ హోటళ్లలో 703 గదులను రిజర్వ్ చేసేందుకు చర్యలు చేపట్టారు. సదస్సు విశాఖకు వచ్చే వారు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలనూ వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.