(Source: ECI/ABP News/ABP Majha)
యాపిల్ ఫోన్ యూజర్లకి కేంద్రం హైరిస్క్ వార్నింగ్, అలెర్ట్‌గా ఉండాలని సూచన
High Risk Warning: యూపిల్ ఫోన్ యూజర్స్‌కి కేంద్రం హైరిస్క్ అలెర్ట్ జారీ చేసింది.
High Risk Warning For iPhones: యాపిల్ యూజర్లను కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ చేసింది. iPhone,iPad, MacBook లు హ్యాక్ అయ్యే ప్రమాదముందని వెల్లడించింది. Computer Emergency Response Team (CERT-In) high-risk అలెర్ట్ జారీ చేసింది. యాపిల్ ప్రొడక్స్ట్‌లో remote code execution జరిగే అవకాశముందని తేల్చి చెప్పింది. యాపిల్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లను టార్గెట్‌గా పెట్టుకుని ఈ రిమోట్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసే ప్రమాదముందని తెలిపింది. యాపిల్ సఫారీ వర్షన్స్ కూడా ఇలా హ్యాకింగ్‌కి గురవుతుందని వెల్లడించింది. Apple macOS Ventura వర్షన్స్, Apple macOS Sonoma, Apple visionOS, Apple iOS and iPadOS versions ఈ లిస్ట్‌లో ఉన్నాయి. సైబర్ నేరగాళ్లు ఓ ఫోన్ లేదా మ్యాక్‌ని టార్గెట్‌గా పెట్టుకుని ఏదో ఓ మాల్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేస్తారు. ఈ అడ్వైజరీ ప్రకారం...iPhone XS, iPad Pro 10.5-inch, iPad Pro 12.9-inch, iPad Air వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. వీటితో పాటు iPhone X, iPhone 8 Plus, iPhone 8 యూజర్స్ కూడా అలెర్ట్ అవ్వాలని కేంద్రం వెల్లడించింది. MacBook యూజర్స్ వెంటనే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.
ఇలా చేస్తే సేఫ్..
ప్రస్తుతం ఉన్న యాపిల్ iOS, macOS, iPad OS వర్షన్స్‌ని వెంటనే అప్‌డేట్ చేయాలి. వాటికి సెక్యూరిటీ ప్యాచెస్ ఉండేలా చూసుకోవాలి. అనధికారిక నెట్‌వర్క్‌లు డివైజ్‌ని యాక్సెస్ చేయకుండా ఉండాలంటే పబ్లిక్ వైఫైకి కనెక్ట్ అవడం మానేయాలి. టూ ఫ్యాక్టర్ అథింటికేష్ ఆప్షన్‌ని ఎనేబుల్ చేసుకోవాలి. యాపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. వేరే చోట నుంచి డౌన్‌లోడ్ చేస్తే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక ఇంపార్టెంట్ డేటానంతా ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకోవాలి. సిస్టమ్ ఫెయిల్యూర్ అయినా, హ్యాక్ అయినా డేట్ అంతా భద్రంగా ఉంటుంది.