అన్వేషించండి

Medicine Ban: ఫీవర్ వచ్చిందని ఈ మందులు వాడుతున్నారా.. వీటిని బ్యాన్ చేశారని తెలుసా?

Medicine Ban: ఒకటి కన్నా ఎక్కువ ఔషధాల కలయికతో తయారైన మందుల వాడకం వల్ల ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువని నిపుణుల బృందం తేల్చింది. 156 రకాల ఔషధాలపై కేంద్రం నిషేధం విధించింది.

Medicines Ban: అసలే వర్షాకాలం చిన్న జలుబు చేసినా....కాస్త ఒళ్లు వెచ్చబడిందా అంతే పరుగెత్తుకుని మందుల షాపులకు వెళ్లి టాబ్లెట్‌లు తెచ్చుకుని వేసుకుంటారు. ఇంట్లో ఎవరికైనా కాస్త సుస్తి చేసిందంటే చాలు ప్రతిఒక్కరూ డాక్టర్( Doctor) అవతారం ఎత్తేస్తారు. అవసరం ఉన్నా లేకున్నా....మూడుపూటలు బిల్లలు వేస్తూనే ఉంటారు. దీనివల్ల  ఉన్న రోగం సంగతి ఏమోగానీ కొత్తకొత్త రోగాలు అంటుకునే ప్రమాదం ఉంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్‌(Side Effects)లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రోగులకు ముప్పు తెచ్చే అవకాశం ఉన్న 156 రకాల మందులను నిషేధించింది. ఈ మందులు(Medicine) ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దని ప్రజలను   హెచ్చరించింది.

కాంబినేషన్ మందులతో జాగ్రత్త
సాధారణంగా మనకు జ్వరం వస్తే...ముందు జాగ్రత్తగా  జలుబుకు కూడా కలిపి కాంబినేషన్ మందులు తీసుకుంటాం. యాంటీబయోటిక్‌లో కూడా రెండు, మూడు రకాలు కలిపి ఉన్న కాంబినేషన్లు ఎక్కువగా వాడుతుంటారు. ఇలా అవసరం ఉన్నా లేకపోయిన ఇష్టానుసారం మందులు వాడకం వల్ల లేని ప్రమాదాలను కొని తెచ్చుకోవడమేనని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇబ్బందికరమైన 156 రకాల ఔషధాలను నిషేధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో ప్రజలు తరుచుగా వాడే జ్వరం, జలుబు, నొప్పులు, ఎలర్జీ మందులే ఎక్కుగా ఉన్నాయి. ప్రజలు ఎక్కువగా కాస్త ఒళ్లు నొప్పులు ఉండగానే నోప్పులతోపాటు పారాసిటమల్ కాంబినేషన్ మందులు తీసుకుంటారు.అందుకే ఎసిక్లోఫినాక్‌ పారాసిటమాల్ కాంబినేషన్ మందులను సైతం కేంద్రం నిషేధిత జాబితాలో ఉంచింది. ఈనెల 12నే వీటిని  నిషేదిత జాబితాలో చేర్చుతూ  నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 156 ఎఫ్‌డీసీలను తక్షణమే ఉత్పత్తి, నిల్వలు, విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించింది. వీటిల్లో ఎక్కువగా యాంటీబయోటిక్స్‌, నొప్పి, మల్టీ విటమిన్లు ఉన్నాయి. డ్రగ్‌ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. మందుల తయారీ సంస్థల వాదనలను డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు తోసిపుచ్చింది. కాంబినేషన్ మందుల వల్ల రోగులకు ప్రయోజనాలు చేకూరపోగా...మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింంది. అందుకే  ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ మందులను నిషేదిస్తున్నట్లు వెల్లడించింది. 

రెండు లేదా మూడు ఔషధాలను కలిపి నిర్దిష్ట నిష్పత్తిలో తయారు చేసే మందులను ఎఫ్‌డీసీ(FDC) అంటారు. వీటిని కాక్‌టెయిల్ డ్రగ్స్‌ అని కూడా పిలుస్తారు. కేంద్రప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఈ ఎఫ్‌డీసీలపై అధ్యయనం చేసి అవి వాడకం మంచిది కావని నిర్థారించిన తర్వాత వాటిపై నిషేధం విధించారు. చిన్నచిన్న జబ్బులకు సైతం సొంత వైద్యం పనికిరాదని  వైద్య నిపుణులు హెచ్చరించారు. ఇష్టానుసారం మందుల దుకాణాల నుంచి టాబ్లెట్లు కొని వేసుకోరాదని సూచించారు. దీర్ఘకాలంలో అవి అవయవాలపై దుష్ప్రాభావం చూపుతాయని హెచ్చరించారు. నిపుణులైన వైద్యులను సంప్రదించిన తర్వాత...వారు సూచించిన మందులనే వాడాలని తెలిపారు. ఒక్కోసారి మందుల దుకాణదారులు సైతం డాక్టర్ రాసిన మందులు లేవని...వేరే కాంబినేషన్ ఉందని ఇస్తుంటారు. ఖచ్చితంగా అలాంటివి కూడా వద్దని చెప్పారు. నిర్దిష్టమైన రోగానికి...నిర్ధిష్టమైన మందులనే వైద్యులు సూచిస్తారని...అంతకు మించి ఇష్టానుసారం వాడటం మంచిది కాదని తెలిపారు. 

Also Read: కోల్‌కతా కేసులో మరో సంచలనం, హత్యాచారానికి ముందు రోజు డాక్టర్‌ని వేధించిన నిందితుడు - సీసీటీవీ ఫుటేజ్‌ సంచలనం

Also Read: కోల్‌కతా కేసులో ఇంత గందరగోళం ఎందుకు? ఆ రోజు ఏం జరిగింది - ముందుగా డెడ్‌బాడీని చూసిందెవరు?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

In Pics: హైదరాబాద్‌కు దూరంగా బీఆర్ఎస్ నేతల తరలింపు, కార్యకర్తలు రచ్చరచ్చ - ఫోటోలు
హైదరాబాద్‌కు దూరంగా బీఆర్ఎస్ నేతల తరలింపు, కార్యకర్తలు రచ్చరచ్చ - ఫోటోలు
Sangareddy Court: ఆరేళ్ల పాపపై అత్యాచారం, ఉరి శిక్ష వేస్తూ సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు
ఆరేళ్ల పాపపై అత్యాచారం, ఉరి శిక్ష వేస్తూ సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు
Arekapudi Gandhi: కౌశిక్ భార్య మాపై పూలకుండీలు విసిరేసింది - అరెకపూడి గాంధీ
కౌశిక్ భార్య మాపై పూలకుండీలు విసిరేసింది - అరెకపూడి గాంధీ
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Langur At Ganapati Mandap | గణపతి మండపానికి కొండెంగ కాపలా | ABP DesamKashmir Willow Bat Making Video | కశ్మీర్ విల్లో బ్యాట్లు తయారవ్వటానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది | ABPHarish rao at Cyberabad CP Office | సైబరాబాద్ సీపీ ఆఫీసును ముట్టడించిన BRS నేతలు | ABP DesamSitaram Yechury Political Journey | విద్యార్థి దశ నుంచే పోరాటాలు చేసిన సీతారాం ఏచూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
In Pics: హైదరాబాద్‌కు దూరంగా బీఆర్ఎస్ నేతల తరలింపు, కార్యకర్తలు రచ్చరచ్చ - ఫోటోలు
హైదరాబాద్‌కు దూరంగా బీఆర్ఎస్ నేతల తరలింపు, కార్యకర్తలు రచ్చరచ్చ - ఫోటోలు
Sangareddy Court: ఆరేళ్ల పాపపై అత్యాచారం, ఉరి శిక్ష వేస్తూ సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు
ఆరేళ్ల పాపపై అత్యాచారం, ఉరి శిక్ష వేస్తూ సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు
Arekapudi Gandhi: కౌశిక్ భార్య మాపై పూలకుండీలు విసిరేసింది - అరెకపూడి గాంధీ
కౌశిక్ భార్య మాపై పూలకుండీలు విసిరేసింది - అరెకపూడి గాంధీ
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
Balakrishna: విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Share Market Today: సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
Embed widget