అన్వేషించండి

Banakacharla Update: బనకచర్లపై కేంద్రం సంచలన నిర్ణయం - 12 మందితో నిపుణుల కమిటీ !

Banakacharla expert committee: బనకచర్లపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఐదుగురి చొప్పున పేర్లు పంపాలని ఏపీ, తెలంగాణకు లేఖలు రాసింది.

Central Govt to form an expert committee on Banakacharla Project:  బనకచర్ల ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్ర జలశక్తి శాఖ కసరత్తు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్,   తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారింది. అందుకే  సాంకేతిక,  ఆర్థిక అంశాలను అధ్యయనం చేయడానికి 12 మంది సభ్యులతో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కమిటీలో ఏపీ ,  తెలంగాణ నుంచి ఐదుగురు నిపుణుల చొప్పున  పేర్లను పంపాలని కేంద్ర జలవనరుల శాఖ రెండు రాష్ట్రాలను కోరింది. అదనంగా, కేంద్రం తరపున మరో ఇద్దరు నిపుణులను ఈ కమిటీలో నియమించనుంది.           
 
గోదావరి నది వరద జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు,   ప్రకాశం జిల్లాలకు తరలించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 80 లక్షల మందికి తాగునీరు, 3 లక్షల హెక్టార్లకు కొత్త ఆయకట్టు,  22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగా రూ.80,112 కోట్లతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు గోదావరి నదిలో తమకు కేటాయించిన 968 టీఎంసీల నీటి హక్కులను హరిస్తుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు 1980 గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డు ,  ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఉల్లంఘిస్తుందని తెలంగాణ  ఆరోపిస్తోంది. 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేంద్ర జలశక్తి శాఖ, గోదావరి బోర్డు, , CWCకు  లేఖలు రాశారు. జనవరి 22, 2025న రాసిన లేఖలో, ఏపీ డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సమర్పించకుండా నిలువరించాలని కోరారు. తర్వాత కేంద్రమంత్రి సమక్షంలో ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 
 
బనకచర్ల వివాదాన్ని పరిశీలించడానికి, ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాంకేతిక ,  ఆర్థిక అంశాలపై అధ్యయనం చేయడానికి కేంద్ర జలశక్తి శాఖ 12 మంది నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీలో ఏపీ ,  తెలంగాణ నుంచి సాంకేతిక నిపుణులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు ఉంటారు. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ (PFR)ను సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC)కు సమర్పించింది. ప్రాజెక్టు పనులు ఇంకా ప్రారంభం కాలేదని ఏపీ కేంద్రానికి తెలిపింది. తెలంగాణ అభ్యంతరాల కారణంగా కేంద్ర జలశక్తి శాఖ గోదావరి ,  కృష్ణా నదీ యాజమాన్య బోర్డులతో సంప్రదించి, తెలంగాణ అభిప్రాయాలను సేకరించిన తర్వాత మాత్రమే సాంకేతిక ,  ఆర్థిక అంచనాలపై ముందుకెళ్తామని స్పష్టం చేసింది 

ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కోసం ఏపీ ప్రభుత్వం టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ (TOR)ను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు చెందిన పర్వేష్ వెబ్‌సైట్‌లో నమోదు చేసింది. అయితే, ఎక్స్‌పర్ట్స్ అప్రైసల్ కమిటీ (EAC) ఈ ప్రతిపాదనలను పరిశీలించి వెనక్కి పంపినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభలో తెలిపారు.         

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?

వీడియోలు

Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
EPFO Update: ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
Axar Patel Ruled Out : భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
UP bride: పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
Embed widget