Rahul allegations against Election Commission: మహదేవపురాలో లక్ష ఓట్ల చోరీ - సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్న ఈసీ - రాహుల్ తీవ్ర ఆరోపణలు
Rahul Gandhi Vs EC: మహదేవపురాలో లక్ష ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. సాక్ష్యాలను ఈసీ ధ్వంసం చేస్తోందన్నారు.

Rahul Gandhi reveals some details about vote rigging: 2014 నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడింది రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. ఈసీకి వ్యతిరేకంగా మా దగ్గర ఆటంబాంబ్ లాంటి ఆధారాలున్నాయని ఢిల్లీలో జరిగిన ప్రెస్‌మీట్‌లో ప్రకటించారు. బీజేపీ కోసం ఈసీ ఓట్లను చోరీ చేస్తుందన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా మారుతున్నాయి.. ఒకే పేరు, ఒకే ఫోటో, ఒకే అడ్రస్ ఉన్న వ్యక్తికి వేర్వేరు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉందన్నారు. ఇలాంటి ఓట్లు వేలల్లో ఉన్నాయన్నారు. ఎగ్జిట్ పోల్స్ కు కూడా అంచనాలకు అందని ఫలితాలు వస్తున్నాయి.. ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై అధ్యయనం చేశాం.. హర్యానా, మధ్యప్రదేశ్లోనూ అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి.. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న చోట కూడా బీజేపీకి మాత్రమే అనుకూలంగా వస్తున్నాయన్నారు. బీహార్లో లక్షల మంది ఓట్లను తొలగించారు.. బీహార్లో ఓట్ల తొలగింపుపై ఈసీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కర్ణాటకలోని మహదేవపుర నియోజకవర్గంలో 6.5 లక్షల వోట్లలో 1,00,250 వోట్లు ‘చోరీ’ అయినట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఒక నియోజకవర్గం వోటరు జాబితాను డిజిటల్ ఫార్మాట్‌లోకి మార్చి, ఆరు నెలల పాటు విశ్లేషించిన తర్వాత ఈ విషయాన్ని కనుగొన్నట్లు చెప్పారు. మహారాష్ట్రలో లోక్‌సభ , విధానసభ ఎన్నికల మధ్య 5 నెలల వ్యవధిలో 1 కోటి కొత్త ఓటర్లను చేర్చారని సాయంత్రం 5:30 తర్వాత ఓటింగ్ శాతంలో భారీ పెరుగుదల కనిపించిందని రాహుల్ ఆరోపించారు. ఈ ఫలితాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కై ఎన్నికలను ‘దొంగిలించిందని’ ఆయన మండిపడ్డారు.
ఎన్నికల సంఘం డిజిటల్ రీడబుల్ వోటరు జాబితాను అందించడానికి నిరాకరించిందని, సీసీటీవీ ఫుటేజీని నాశనం చేయాలని చూస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించలేదని, ఇది వారి తప్పును రుజువు చేస్తుందని ఆయన అన్నారు.2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలో కొనసాగడానికి 25 సీట్లను ‘దొంగిలించాల్సి’ వచ్చిందని, బీజేపీ 33,000 ఓట్ల కంటే తక్కువ తేడాతో 25 సీట్లు గెలుచుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ , ఎన్నికల సంఘం మధ్య ఎన్నికల కుమ్మక్కు ఉందని, నకిలీ ఓటర్లు , నకిలీ చిరునామాలను ఎన్నికల రోల్స్‌లో చేర్చారని ఆరోపించారు. 2023 ఛత్తీస్‌గఢ్ ఎన్నికల నుంచి ఈ అనుమానాలు మొదలై, 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ధృవీకరణ అయినట్లు ఆయన చెప్పారు.
BREAKING NEWS 🚨
— Amock_ (@Amockx2022) August 7, 2025
Rahul Gandhi tore ECI apart and explained mass manipulation in voter list
He claimed 100250 #VoteChori in a single assembly of Karnataka during 2024 LS 🤯
Where will ECI hide the face? Watch and share this video maximum pic.twitter.com/GEtzFhcwGV
రాహుల్ గాంధీ ఆరోపణల తర్వాత, కర్ణాటక ముఖ్య ఎన్నికల అధికార కార్యాలయం ఆయనను తన ఆరోపణలకు సంబంధించిన రుజువులను ఆగస్టు 8, 2025 సాయంత్రం లోపు సమర్పించాలని కోరింది.





















