అన్వేషించండి

'I Love Pankaj Tripathi' ఆయన కోసం లెటర్ కూడా రాశా…!  తృణమాల్ ఫైర్ బ్రాండ్ ఎంపీ మహువా మెయిత్రా

Mahua Moitra: బాలీవుడ్ యాక్టర్ పంకజ్ త్రిపాఠీ అంటే తనకు పిచ్చ ప్రేమ అని చెప్పారు.. తృణమాల్ కాంగ్రెస్ ఎంపీ Mahua Moitra. తన మీద లవ్‌తో ఆయనకు ఓ లెటర్ కూడా రాశానని చెప్పుకొచ్చారు.. ఈ ఫైర్‌బ్రాండ్...!

Mahua Moitra Crush on Pankaj Tripathi: బాలీవుడ్ యాక్టర్ పంకజ్‌ త్రిపాఠీ నటనంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. సినిమాల్లో అయినా వెబ్‌సిరిస్‌ల్లో అయిన తన స్టైల్ యాక్టింగ్‌తో కట్టిపడేస్తారు పంకజ్ భాయ్‌…! కేవలం ఆయన యాక్టింగ్ కారణంగానే హిట్ అయిన సిరిస్‌లున్నాయి.  అలాంటి  యాక్టర్ పంకజ్ త్రిపాఠి (Pankaj Tripathi) అంటే తనకు పిచ్చ ప్రేమ అని.. ఆయన కోసం ఓ లేఖ కూడా రాశానని తృణమాల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్రా Mahua Moitra చెప్పారు. ఇండియా టుడే ఇంటర్వూలో మాట్లాడిన ఆమె… రాజకీయ విశేషాలు కాకుండా తనకు ఇష్టమైన సినిమాలు, నటులు గురించి మాట్లాడారు. ఆ సందర్భంగానే ఈ ఇంట్రస్టింగ్ విషయం బయటపడింది. తనకు పంకజ్ త్రిపాఠి నటన అంటే చాలా చాలా ఇష్టం అంటూ మహువా మెయిత్రా చెప్పారు.

పంకజ్ అంటే పిచ్చి… అన్ని సిరిస్‌లు చూసేశాను

ఇటీవల ఇచ్చిన ఇంటర్వూలో మహువా మొయిత్రా పంకజ్‌ మీద తనకున్న అభిమానాన్ని బయటపెట్టారు. ముఖ్యంగా డార్క్ సిరిస్‌లు, ఇంటెన్సిటీ ఎక్కువుగా ఉన్న రోల్స్‌ ను ఎలా డీల్ చేయాలో తనకు బాగా తెలుసని చెప్పారు. Mirzapur సిరిస్‌లో పంకజ్ నటన తనకు చాలా ఇష్టమని … అతని కోసం మూడు సిరిస్‌లు చేసేశానని చెప్పారు. గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్‌లోనూ.. అతని నటన తనకు నచ్చిందని చెప్పారు. “ అతను చాలా కూల్. మీర్జాపూర్, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్‌లో తన నటన సూపర్‌గా ఉంది. డార్క్‌ రోల్స్‌ను అతను చాలా బాగా డీల్ చేస్తాడు. అతను బ్యాడ్‌ రోల్స్‌లో చాలా బాగుంటాడు.. “I love Pankaj Trippathi In those Roles”  అని ఆమె చెప్పారు.

కాఫీకి పిలిచాను కానీ రాలేదు

మహువా కేవలం సినిమాల్లో ఆయన్ని ఇష్టపడటంతోనే ఆగలేదు. తనను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం సక్సెస్ కాలేదన్నారు. పంకజ్‌ను కాఫీకి కలుద్దామా అని కబురు పంపితే స్పందించలేదంట..! పంకజ్‌ త్రిపాఠీ మీద తనకున్న అభిమానాన్ని తెలుపుతూ, ఆయనంటే తనకెంత ఇష్టమో చెబుతూ ఓ లేఖ రాశానని దానిని ఓ లేడీ యాంకర్‌ ద్వారా తనకు చేరవేశానని చెప్పారు. “పంకజ్‌ తన ఇంటికే పరిమితం బయట ఎవరినీ కలవడానికి పెద్దగా ఇష్టపడడు అందుకే నన్ను కలవలేదు” అని ఎంపీ చెప్పుకొచ్చారు.


I Love Pankaj Tripathi' ఆయన కోసం లెటర్ కూడా రాశా…!  తృణమాల్ ఫైర్ బ్రాండ్ ఎంపీ మహువా మెయిత్రా

రవికిషన్‌తో రికమెండేషన్ చేయించా..

పంకజ్‌ త్రిపాఠిని కలవడానికి Mahua ప్రయత్నాలను ఆపలేదు. పంకజ్ సహ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ద్వారా కూడా ఆమె ప్రయత్నించారు. “పంకజ్‌ను కలవడానికి నేను అన్ని ప్రయత్నాలు చేశా.. చివరకు రవికిషన్ ను కూడా అడిగాను. అయితే అతను నాతో ఫోన్‌లో మాట్లాడించాడు కానీ నేను సరిగ్గా మాట్లాడలేకపోయాను. నేను బయట బాగానే మాట్లాడతా కానీ ఎందుకో ఫోన్‌లో సిగ్గుపడిపోయాను.. సరిగ్గా మాట్లాడలేదు. నేను తనకు లెటర్ రాసిన విషయం కూడా చెప్పడం మర్చిపోయాను ” అని ఆమె నవ్వుతూ చెప్పారు.

Mahua Moitra తన బోల్డ్ స్టేట్మెంట్స్, పొలిటికల్ కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. పార్లమెంట్‌లో ఆమె స్పీచ్‌లు ఆమెను ఫైర్‌బ్రాండ్‌గా నిలిపాయి. ఆమెకు రాజకీయాలకు అతీతంగా దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి ఎంపీ Pankaj Tripathi గురించి ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ను పంచుకున్నారు. పంకజ్‌ తనదైన పాత్రలతో చెరగని ముద్ర వేశారు. మామూలు కమర్షయల్ సినిమాలే కాదు.. Dark Movies, Neo Noir Thrillers, Black Comedy ఇలా కేటగిరీలో పాత్రలకైనా పర్ఫెక్ట్ మ్యాచ్ పంకజ్. ఈ మధ్యనే Metro in Dino,  Criminal Justice-4  సీజన్‌లతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BMC Election Results 2026: ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి
ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి
Jadcharla MLA Anirudh Reddy: మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
Dhurandhar 2: ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
Sanitation worker Honesty: నిజాయితీకి లలితా జ్యువెలరీ యజమాని సలాం - 25 తులాల బంగారం అప్పగించిన కార్మికులకు ఘన సన్మానం
నిజాయితీకి లలితా జ్యువెలరీ యజమాని సలాం - 25 తులాల బంగారం అప్పగించిన కార్మికులకు ఘన సన్మానం

వీడియోలు

Fifa World Cup Free Tickets | లాటరీ తీయాలన్నా 50కోట్ల అప్లికేషన్ల డేటా ఎలా ఎక్కించాలయ్యా | ABP Desam
Harleen Deol 64 Runs vs MI | కోచ్ నోరు మూయించిన హర్లీన్ డియోల్ | ABP Desam
BCB Director Najmul Islam Controversy | ఒక్క మాటతో పదవి పీకించేశారు | ABP Desam
USA U19 vs Ind U19 World Cup 2026 | వరుణుడు విసిగించినా కుర్రాళ్లు కుమ్మేశారు | ABP Desam
Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BMC Election Results 2026: ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి
ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి
Jadcharla MLA Anirudh Reddy: మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
Dhurandhar 2: ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
Sanitation worker Honesty: నిజాయితీకి లలితా జ్యువెలరీ యజమాని సలాం - 25 తులాల బంగారం అప్పగించిన కార్మికులకు ఘన సన్మానం
నిజాయితీకి లలితా జ్యువెలరీ యజమాని సలాం - 25 తులాల బంగారం అప్పగించిన కార్మికులకు ఘన సన్మానం
BMC Election Results 2026: బీఎంసీలో విజేత ఎవరు? BJP కూటమి, శివసేన ఎక్కడెక్కడ గెలిచాయి? సీట్ల వారీగా ఫలితాలు
BMC లో విజేత ఎవరు? BJP కూటమి, శివసేన ఎక్కడెక్కడ గెలిచాయి? సీట్ల వారీగా ఫలితాలు
Chanaka Korata Pump House: ఆదిలాబాద్ రైతన్నల కల సాకారం - చనాక, కొరాటా పంప్ హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్
ఆదిలాబాద్ రైతన్నల కల సాకారం - చనాక, కొరాటా పంప్ హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్
Kalamkaval OTT: మమ్ముట్టి 'కలంకావల్' స్ట్రీమింగ్... ఏ ఓటీటీలో చూడవచ్చో తెలుసా?
మమ్ముట్టి 'కలంకావల్' స్ట్రీమింగ్... ఏ ఓటీటీలో చూడవచ్చో తెలుసా?
Radhika Apte: బాలీవుడ్ బడా ఫ్యామిలీ వారసుడితో 'లెజెండ్' హీరోయిన్ ఎఫైర్... రాధికా ఆప్టే రియాక్షన్ ఏమిటంటే?
బాలీవుడ్ బడా ఫ్యామిలీ వారసుడితో 'లెజెండ్' హీరోయిన్ ఎఫైర్... రాధికా ఆప్టే రియాక్షన్ ఏమిటంటే?
Embed widget