అన్వేషించండి

Paytm FASTag: పేటీఎమ్ ఫాస్టాగ్‌లపై కేంద్రం కీలక ప్రకటన,బ్యాంక్‌ బదిలీ చేసుకోవాలని సూచన

Paytm FASTag: పేటీఎమ్ ఫాస్టాగ్ వినియోగదారులు మార్చి 15 లోగా బ్యాంక్ బదిలీ చేసుకోవాలని కేంద్రం సూచించింది.

Paytm FASTag Users: కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్‌లపై కీలక ప్రకటన చేసింది. National Highways Authority of India (NHAI) ఫాస్టాగ్ వినియోగదారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. Paytm ద్వారా ఫాస్టాగ్‌లు తీసుకున్న వాళ్లు వెంటనే వేరే బ్యాంక్‌లకు బదిలీ చేసుకోవాలని సూచించింది. ఎలాంటి అవాంతరాలు రాకుండా ప్రయాణం సాఫీగా సాగిపోవాలంటే పేటీఎమ్ బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్‌కి ఫాస్టాగ్‌ని బదిలీ చేసుకోవాలని వెల్లడించింది. మార్చి 15వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా Paytm Payments Bankపై విధించిన ఆంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలని వివరించింది. మార్చి 15వ తేదీ తరవాత పేటీఎమ్ బ్యాంక్ ద్వారా ఫాస్టాగ్‌లు రీఛార్జ్ చేసుకోడానికి కానీ...వినియోగించుకోడానికి కానీ వీలుండదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న బ్యాలెన్స్‌ మాత్రం మార్చి 15లోగా వినియోగించుకోవచ్చని తెలిపింది. అయితే..Paytm FASTag కి సంబంధించి ఏదైనా సమాచారం కావాలంటే సంబంధిత బ్యాంక్‌లను సంప్రదించాలని సూచించింది. లేదంటే IHMCL  వెబ్‌సైట్‌లో FAQలు అందుబాటులో ఉన్నాయని, అక్కడ అన్ని వివరాలు తెలుసుకోవచ్చని వెల్లడించింది. జాతీయ రహదారులపై ప్రయాణించే సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఇలా అప్రమత్తం చేస్తున్నట్టు NHAI స్పష్టం చేసింది. 

ఆ జాబితా నుంచి పేటీఎమ్ ఔట్..

ఇప్పటికే ఫాస్టాగ్‌లు జారీ చేసే బ్యాంక్‌ల జాబితా నుంచి పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్‌ని తొలగించారు. పేటీఎమ్ బ్యాంక్‌కి బదులుగా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్  బరోడా, కెనరా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ICICI బ్యాంక్‌ తదితర బ్యాంక్‌లను చేర్చింది. ఇప్పటికే పేటీఎమ్‌ ఫాస్టాగ్ కోసం సెక్యూరిటీ డిపాజిట్ చేసిన వాళ్లు రీఫండ్‌కి రిక్వెస్ట్ పెట్టుకోవాలని తెలిపింది. కస్టమర్ సర్వీస్‌ని సంప్రదించి ఈ ప్రక్రియని పూర్తి చేయాలని తెలిపింది. పేటీఎమ్ ద్వారా ఫాస్టాగ్‌లు జారీ చేయొద్దని IHMCL ఆదేశాలు జారీ చేసింది. పేటీఎమ్ నుంచి ఫాస్టాగ్‌ని తొలగించాలని తేల్చి చెప్పింది. ఇప్పటి వరకూ ఈ సర్వీస్‌లు అందించేందుకు పేటీఎమ్‌కి అవకాశమిచ్చిన సంస్థ ఇప్పుడు ఆ లిస్ట్ నుంచి తొలగించింది. టాప్‌అప్స్,డిపాజిట్స్‌ స్వీకరించకూడదని ఆదేశాలు జారీ చేసింది. IHMCL పరిధిలో మొత్తం 32 బ్యాంకులున్నాయి. వీటి ద్వారా ఫాస్టాగ్‌ జారీ చేసేందుకు అవకాశముంది. ఇకపై ఈ జాబితాలో పేటీఎమ్ కనిపించదు. 

ప్రత్యామ్నాయాలు ఇవే..

జనవరి 31వ తేదీన RBI పేటీఎమ్ బ్యాంక్‌పై ఆంక్షలు విధించింది. అంతర్గతంగా మనీ లాండరింగ్ జరిగిందని, భారీ అవతవకలు జరిగాయని తేల్చి చెప్పింది. వీటిని సరి చేసుకోవాలి ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించింది. దీనిపై ఇప్పటికే ఈడీ దర్యాప్తు మొదలైంది. ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ ఆంక్షల్ని పొడిగించింది. ఈ క్రమంలోనే ఫాస్టాగ్ సర్వీస్‌లనూ నిలిపివేసింది. అందుకే...ఇకపై వాహనదారులు ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందే. పేటీఎమ్ కాకుండా ఇతర బ్యాంక్‌లు కూడా ఈ సేవలని అందిస్తున్నాయి. 

Also Read: ABP Cvoter Opinion Poll 2024: ఆ రాష్ట్రాల్లో బీజేపీదే హవా - ABP CVoter ఒపీనియన్ పోల్‌ అంచనాలివే

టాప్ హెడ్ లైన్స్

Rohit- Virat Mission: 2027 వన్డే వరల్డ్ కప్ వేటలో దిగ్గజ ద్వయం.. నెట్స్ లో రచ్చ లేపిన రోకో జంట‌, కివీస్ గడ్డపై బిగ్ వార్ కు సై
2027 వన్డే వరల్డ్ కప్ వేటలో దిగ్గజ ద్వయం.. నెట్స్ లో రచ్చ లేపిన రోకో జంట‌, కివీస్ గడ్డపై బిగ్ వార్ కు సై
Hyderabad Rains: హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. మరో నాలుగైదు రోజులపాటు రెయిన్ అలర్ట్
హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. మరో నాలుగైదు రోజులపాటు రెయిన్ అలర్ట్
PM Kisan 24th Installment: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ నిధులు విడుదల.. మీ ఖాతాలో రూ.2 వేలు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి!
రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ నిధులు విడుదల.. రూ.2 వేలు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి!
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
Embed widget