GAIL Director Arrested: గెయిల్ మార్కెటింగ్ డైరెక్టర్ అరెస్ట్.. సోదాల్లో రూ.1.29 కోట్ల నగదు, బంగారం స్వాధీనం
లంచం తీసుకున్న కేసులో గెయిల్ డైరెక్టర్ ఈఎస్ రంగనాథన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది.
గెయిల్ డైరెక్టర్ ఈఎస్ రంగనాథన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్ట్ చేసింది. ప్రైవేట్ కంపెనీల నుంచి రూ.50 లక్షలు లంచం తీసుకున్నారనే ఆరోపణలపై రంగనాథన్‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పెట్రో కెమికల్ ఉత్పత్తులను డిస్కౌంట్‌కు విక్రయించేందుకు లంచం తీసుకున్నారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ కేసులో రంగనాథన్‌తో పాటు పవన్ గౌర్, రాజేశ్ కుమార్, ఎన్ రామకృష్ణన్ నాయర్ అనే ముగ్గురు మధ్యవర్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది.
సోదాలు..
దిల్లీ, నోయిడా, గురుగ్రామ్, పంచకులా, కర్నాల్ ప్రాంతాల్లో ఈ కేసుకు సంబంధించి తనిఖీలు చేపట్టింది సీబీఐ. గెయిల్ మార్కెంటింగ్ డైరెక్టర్ రంగనాథన్ నివాసాల్లోనూ సోదాలు నిర్వహించింది. ఆయన ఇళ్లలో నుంచి ఇప్పటివరకు రూ.1.29 కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకుంది.
వ్యాపారవేత్త సౌరభ్ గుప్తా, బన్సల్ ఏజెన్సీ అధినేత ఆదిత్య బన్సల్‌పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఐదుగురుని సీబీఐ అరెస్ట్ చేసింది.
Also Read: Covid Cases: దేశంలో కొత్తగా 2.71 లక్షల మందికి కరోనా.. 8 వేలకు చేరువలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య
Also Read: 1 Year of Vaccination: భారత్ మరో రికార్డ్.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మొదలై ఏడాది పూర్తి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి