అన్వేషించండి
Advertisement
1 Year of Vaccination: భారత్ మరో రికార్డ్.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మొదలై ఏడాది పూర్తి
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమై నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ ప్రయాణాన్ని ఓ సారి చూద్దాం.
కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ మరో మైలురాయిని చేరింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ మొదలై నేటితో ఏడాది పూర్తయింది. ఏడాది కాలంలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 156 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా అర్హులైన లూబ్ధిదారులకు 43,19,278 ప్రికాషనరీ డోసులను అందాయి.
భారత్ ప్రయాణం ..
- 2021 జనవరి 16న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది. ముందుగా ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించారు.
- 2021, మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడి ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి టీకాలు ఇచ్చారు.
- 2021, ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకాలు అందించడం మొదలుపెట్టారు.
- 2021, మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారు వ్యాక్సిన్ తీసుకునే అవకాశం కల్పించింది కేంద్ర ఆరోగ్య శాఖ.
- 2021 సెప్టెంబర్ 17న ఒక్కరోజులో అత్యధికంగా 2.5 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించి భారత్ రికార్డ్ సృష్టించింది.
- 2022 జనవరి 10 నుంచి ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషనరీ డోసులను భారత్ అందిస్తోంది.
- ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,56,76,15,454 డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో 906844414 తొలి డోసులు కాగా, 655195703 రెండో డోసులు, 4269993 ప్రికాషనరీ డోసులు ఉన్నాయి.
మైలురాయికి గుర్తుగా..
వ్యాక్సినేషన్‌కు ఏడాది పూర్తయిన సందర్భంగా కేంద్రం ఓ పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఈ సందర్భంగా ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
హైదరాబాద్
సినిమా రివ్యూ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion